ముస్లింల పట్ల మీడియా వ్యతిరేక కథనాలను ప్రచురిస్తోంది : అమెరికన్ జర్నలిస్టు తగౌరి

లాస్ ఏంజల్స్: ముస్లింల పట్ల మీడియా వ్యతిరేక కథనాలను ప్రచురిస్తోందని అమెరికాలో టీవీ జర్నలిస్టు తగౌరి ఆవేదన వ్యక్తం చేశారు. అమెరికాలో ప్రముఖ మ్యాగజైన్ ప్లేబాయ్ మొదటిసారిగా ఒక హిజాబ్ పాటించే ముస్లిం మహిళ కథనాన్ని అక్టోబరు సంచికలో ప్రచురించింది. అమెరికాలో ముస్లింల పట్ల ఉన్న వివక్షను ఎదుర్కొంటూ ఒక మహిళ ఎదిగిన తీరును మ్యాగజైన్ అభినందించింది. లిబియా నుంచి వచ్చిన తగౌరి హిజాబ్ పాటిస్తూ  అమెరికా టీవీ  చానెళ్లలో యాంకరింగ్ చేయడమే లక్ష్యంగా కృషి  చేశారని ప్రశంసించింది. ఈ కథనంపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు, పొగడ్తలు వెల్లువెత్తాయి. తగౌరిని సోషల్ మీడియాలో లక్షకు పైగా ఫాలోవర్లు అనుసరిస్తున్నారు. అశ్లీల పత్రికగా పేరున్న ప్లేబాయ్ గత కొంత కాలంగా ఎటువంటి పోర్న్ చిత్రాలను ప్రచురించడం లేదు. ఈ నేపథ్యంలో హిజాబ్ పాటించే ముస్లిమ్ మహిళ ఫోటోతో కథనం ప్రచురించడం…

Read More

అమెరికా దాడిలో 13 మంది ఆఫ్ఘాన్ పౌరులు మృతి 

ఆఫ్ఘనిస్థాన్ (సెప్టెంబర్ 28) : ఆఫ్ఘనిస్థాన్ లో ఐసిస్ తీవ్రవాదులను లక్ష్యంగా చేసుకొని అమెరికన్ వాయుసేన జరిపిన వైమానిక దాడిలో 13 మంది ఆఫ్ఘాన్ పౌరులు మృతి చెందారని అధికార వర్గాల సమాచారం. నాన్ గర్హార్ రాష్ట్రంలోని అచిన్ జిల్లాలో ఓ జనావాస ప్రాంతంలో హజ్ యాత్రకు వెళ్లి తిరిగి వస్తున్న గిరిజన నాయకుడికి స్వాగతం చెప్పేందుకు ప్రజలు గుమిగూడినపుడు ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. అయితే స్థానిక రాజకీయ నాయకుడు సిన్వారీ, ఆరుగురు ఐసిస్ తీవ్రవాదులు మరణించారని, 12 మంది ప్రజలకు కేవలం గాయాలయ్యాయని చెప్పుకురాగా ఆచిన్ జిల్లా పోలీసు ఉన్నతాధికారి ముహమ్మద్ అలీ మాత్రం అమెరికా  జరిపిన దాడిలో 15 మంది సాయుధులు మరణించారని  సమర్థించారు. కాగా తమ బలగాలు ఆఫ్ఘనిస్థాన్ లో జరిపిన దాడుల్లో పౌరులు మరణించారని వచ్చిన ఆరోపణలపై తాము దర్యాప్తు చేస్తున్నామని ఆఫ్ఘనిస్థాన్ లో  యూఎస్ బ్రిగేడియర్ జనరల్ ఛార్లెస్ క్లెవ్ ల్యాండు…

Read More