మాలెగాఁవ్ పేలుళ్ల కేసులో కల్నల్ పురోహిత్ కు బెయిల్ నిరాకరణ

ముంబయి : 2008వ సంవత్సరంలో మాలెగాఁవ్ లో జరిగిన పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడైన కల్నల్ శ్రీకాంత్ పురోహిత్ పెట్టుకున్న బెయిల్ పిటిషన్ ను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కోర్టు తోసిపుచ్చింది. మాలెగాఁవ్ పేలుళ్ల కేసులో కల్నల్ పురోహిత్ ప్రమేయం ఉందని ప్రాథమిక సాక్ష్యాధారాలు లభించినందున వాదోపవాదాల దశలో పురోహిత్ కు బెయిల్ ఇవ్వవద్దని ఎన్ఐఏ అధికారులు కోర్టును అభ్యర్థించారు. దీంతో పురోహిత్ బెయిల్ ను నిరాకరిస్తూ స్పెషల్ జడ్జి ఎస్డీ టేకాలే ఉత్తర్వులు జారీ చేశారు. ముస్లిమ్ చేనేత కార్మికులు ఎక్కువగా నివాసముంటున్న మాలెగాఁవ్ లో 2008 సెప్టెంబరు 29 న జరిగిన పేలుళ్లలో ఏడుగురు మరణించగా, వందమంది గాయపడ్డారు. 2006 అభినవ భారత్ ట్రస్టు పేరిట ఏర్పాటు చేసి సాధ్వీ  ప్రఙ్ఞా సింగ్ ఠాకూర్ తోపాటు కల్నల్ పురోహిత్ లు పేలుళ్లకు పాల్పడ్డారని తేలింది.

Read More