ఇంగ్లండ్ ప్రధాని చర్చిల్ ఇస్లామ్ స్వీకరించాలనుకున్నారా…!?

లండన్ : రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటన్ దేశానికి ప్రధానమంత్రిగా పనిచేసిన సర్ విన్‌స్టన్ చర్చిల్ ఇస్లాం స్వీకరించాలనుకున్నారా…అవునని తాజాగా వెలుగుచూసిన లేఖ ఈ విషయాన్ని బహిర్గతం చేసింది. సర్ విన్‌స్టన్ చర్చిల్ తాను ఇస్లాం మతాన్ని స్వీకరించాలనే కోరికను వ్యక్తం చేయగా దాన్ని అతని కుటుంబం వ్యతిరేకించిందని తాజాగా వెల్లడైన లేఖతో తేలింది. బ్రిటిష్ సామ్రాజ్య ప్రధాన రక్షకుడైన ప్రధాన మంత్రి సర్ విన్‌స్టన్ చర్చిల్ ఇస్లాం మతాన్నివిపరీతంగా అభిమానించే వాడని వెల్లడైంది. రెండవ ప్రపంచ యుద్ధంలో  బ్రిటన్ దేశాన్ని విజయం వైపు నడిపించిన ప్రధాన మంత్రి ఇస్లాం మతమంటే తనకిష్టమని చెప్పి అందులోకి మారేందుకు చేసిన యత్నాన్ని అతని కుటుంబం నచ్చజెప్పి మతం మారకుండా అడ్డుకుందని సమాచారం. ‘‘నేను మీలో ఇస్లాంపై మీలో ఉన్న ధోరణిని గమనించానని… దయచేసి మీరు ఇస్లాం మతంలోకి  మారకండి..’’అంటూ…

Read More

యూరీ జవాన్లకు ఒడిశా ముస్లింల నివాళులు

ఒడిశా :  జమ్మూకశ్మీర్‌ రాష్ట్రంలో జరిగిన యూరీ ఘటనలో మరణించిన వీరజవాన్లకు ఒడిశా రాష్ట్రం నవరంగపూర్‌లో ముస్లింలు ఘనంగా నివాళులర్పించారు. నవరంగపూర్ లోని  సున్నిహానఫి మస్జిద్ కమిటీ ఆధ్వర్యంలో ముస్లింలు పట్టణంలో శాంతిర్యాలీ జరిపారు. సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం వరకూ ర్యాలీగా వెళ్లిన ముస్లిమ్ లు పాకిస్తాన్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం ఉగ్రవాదులపై కఠిన చర్యలు చేపట్టాలంటూ ప్రధానమంత్రికి రాసిన వినతి పత్రాన్ని సబ్‌కలెక్టర్‌ గోపాల్‌స్వామి నాయుడుకు అందజేశారు.

Read More