ఒడిశా : జమ్మూకశ్మీర్ రాష్ట్రంలో జరిగిన యూరీ ఘటనలో మరణించిన వీరజవాన్లకు ఒడిశా రాష్ట్రం నవరంగపూర్‌లో ముస్లింలు ఘనంగా నివాళులర్పించారు. నవరంగపూర్ లోని సున్నిహానఫి మస్జిద్ కమిటీ ఆధ్వర్యంలో ముస్లింలు పట్టణంలో శాంతిర్యాలీ జరిపారు. సబ్ కలెక్టర్ కార్యాలయం వరకూ ర్యాలీగా వెళ్లిన ముస్లిమ్ లు పాకిస్తాన్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం ఉగ్రవాదులపై కఠిన చర్యలు చేపట్టాలంటూ ప్రధానమంత్రికి రాసిన వినతి పత్రాన్ని సబ్‌కలెక్టర్ గోపాల్‌స్వామి నాయుడుకు అందజేశారు.
Read More