బీజేపీ ఎమ్మెల్యేకు యూపీ గవర్నరు ప్రచారం…రాజ్యాంగ విధులకు తూట్లు

ఉత్తరప్రదేశ్ : ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర గవర్నరు అయిన రామ్ నాయక్ ఓ బీజేపీ ఎమ్మెల్యేకు మద్ధతుగా ప్రజల్లో ప్రచారం చేసి వివాదాస్పదంగా నిలిచారు. గవర్నరుగా రాజ్యాంగ విధిని నిర్వహిస్తున్న రామ్ నాయక్ ఫిలిబిత్ పట్టణంలో జరిగిన బహిరంగ సభలో బీజేపీ ఎమ్మెల్యే రాంశరణ్ వర్మకు మద్ధతుగా ప్రచారం చేయడమే కాకుండా ఆయన చేసిన మంచి పనులకు మద్ధతు ఇవ్వాలని ప్రజలను కోరి విమర్శల పాలయ్యారు. బీజేపీ ఎమ్మెల్యే రాంశరణ్ భవనాలు, మరుగుదొడ్లు, బస్ స్టేషన్లు, స్కూలు భవనాలు నిర్మించి మంచి పనులు చేశారని గవర్నరు కితాబునిచ్చారు. తాను గవర్నరుగా ఎవరికి ఓటు వేయాలో చెప్పడం తగదంటూనే బీజేపీ పార్టీ నేతలా మాట్లాడారు. ఎమ్మెల్యే నిధులు రూ.6కోట్లతో చేపట్టిన పనులకు గవర్నరు శంకుస్థాపన చేసి ఈ వ్యాఖ్యలు చేశారు.…

Read More