ఉత్తరాఖండ్ : తనను ప్రశ్నించాడనే కోపంతో ఓ దళితుడి తలను నరికిన ఘటన ఉత్తరాఖండ్ రాష్ట్రంలో జరిగింది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని కదారియా గ్రామానికి చెందిన సోహన్ రామ్ అనే దళిత వ్యక్తి గోధుమ పిండి పట్టించుకునేందుకు పిండిమిల్లుకు వచ్చాడు. ఇదే సమయంలో స్కూల్లో ఉపాధ్యాయుడిగా పని చేసే లలిత్ కర్నాటక్ అనే వ్యక్తి కూడా వచ్చాడు. దళితుడైన సోహన్ పిండి ఆడించుకునేందుకు అక్కడికి రావడంవల్ల ఆ ప్రదేశం మొత్తం అపవిత్రం అయిందని, కులం తక్కువవాడిని ఎందుకు రానిస్తారంటూ లలిత్ వ్యాఖ్యలు చేశాడు.దీంతో, అవమానానికి గురైన సోహన్ ‘ఎందుకలా నోరు పారేసుకుంటారు?’ అని ప్రశ్నించాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన లలిత్ అక్కడే ఉన్న పెద్ద కొడవలితో అతని మెడపై ఒక్క వేటు వేశాడు. అంతటితో ఆగని లలిత్…అదే ఆవేశంతో…సోహన్ తలను మొండెం నుంచి వేరు చేశాడు. దీంతో…
Read MoreTag: national
అక్టోబరు 13నుంచి ఆల్ ఇండియా ముస్లిమ్ మజ్లిస్ ఏ ముషావరత్ సదస్సు
ముంబయి: దేశంలో ముస్లిమ్ లు ఎదుర్కొంటున్న సమస్యలతోపాటు సామాజిక, రాజకీయ పరిస్థితులపై చర్చించేందుకు ముంబయిలో అక్టోబరు 13నుంచి నాలుగురోజుల పాటు ఆల్ ఇండియా ముస్లిమ్ మజ్లిస్ ఏ ముషావరత్ సదస్సు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు చెప్పారు. అక్టోబరు 13నుంచి 16వతేదీ వరకు నిర్వహించనున్న ఈ సదస్సు సందర్భంగా అక్టోబరు 15వ తేదీన జరిగే బహిరంగసభకు జాతీయ స్థాయి ముస్లిమ్ నేతలు, ఉలమా, ముషావరత్ నేతలు పాల్గొంటారు. ఈ సదస్సులో 400 మంది ముస్లిమ్ నేతలు, విద్యావేత్తలు పాల్గొని ముస్లిమ్ ల సమస్యలపై చర్చించి తీర్మానాలు చేస్తారు.
Read More