Recent media coverage of divorce statistics across communities has raised quite a bit of noise against the Muslim community vis-à-vis the occurrence of Triple Talaq. But is this data hiding something? Does the data really indicate what the media wants you to believe? Let’s first see what figures are making rounds in the media circles and what is being interpreted. Then we shall see what is being hidden and what can be done. The national media is projecting this matter as a national disaster and an epidemic particularly in Muslim…
Read MoreTag: muslims
బలవంత మత మార్పిడి ఆరోపణలు బూటకం అని తేల్చి చెప్పిన పోలీస్ అధికారులు
మంగళూరు : దక్షిణ కన్నడ జిల్లా సుల్లుయా తాలూకాలో బలవంతంగా ఇస్లాంలోకి మతం మార్పించినట్లు ఒక్క ఫిర్యాదు కూడా రాలేదని ఎస్పీ భూషణ్ గులాబ్ రావు బోరాసే స్పష్టం చేశారు. ఓ గ్రూపు కొందరు యువకులను బలవంతంగా ఇస్లామ్ లోకి మార్పించారని, దీనిపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సంజీవ్ మతండోర్ ఆరోపించారు. బలవంతంగా మతమార్పిడిలు చేస్తున్నారని వీహెచ్‌పీ, భజరంగ్‌దళ్ సంస్థలు ఆరోపించాయి. దీనిపై విచారణ జరపగా ఒక్క కేసులోనూ ఇస్లామ్ లోకి బలవంతంగా మార్పిడి జరగలేదని ఎస్పీ వివరించారు. సుల్లుయా తాలూకా మందీకోలు గ్రామానికి చెందిన సతీష్ ఆచార్య తన సొంత సంకల్పంతోనే ఎవరి ఒత్తిడి లేకుండా ఇస్లామ్ మతాన్ని స్వీకరించినట్లు తమ దర్యాప్తులో తేలిందని ఎస్పీ పేర్కొన్నారు.
Read Moreఅక్టోబరు 13నుంచి ఆల్ ఇండియా ముస్లిమ్ మజ్లిస్ ఏ ముషావరత్ సదస్సు
ముంబయి: దేశంలో ముస్లిమ్ లు ఎదుర్కొంటున్న సమస్యలతోపాటు సామాజిక, రాజకీయ పరిస్థితులపై చర్చించేందుకు ముంబయిలో అక్టోబరు 13నుంచి నాలుగురోజుల పాటు ఆల్ ఇండియా ముస్లిమ్ మజ్లిస్ ఏ ముషావరత్ సదస్సు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు చెప్పారు. అక్టోబరు 13నుంచి 16వతేదీ వరకు నిర్వహించనున్న ఈ సదస్సు సందర్భంగా అక్టోబరు 15వ తేదీన జరిగే బహిరంగసభకు జాతీయ స్థాయి ముస్లిమ్ నేతలు, ఉలమా, ముషావరత్ నేతలు పాల్గొంటారు. ఈ సదస్సులో 400 మంది ముస్లిమ్ నేతలు, విద్యావేత్తలు పాల్గొని ముస్లిమ్ ల సమస్యలపై చర్చించి తీర్మానాలు చేస్తారు.
Read Moreఫోర్బ్స్ కోటీశ్వరుల జాబితాలో నలుగురు భారతీయ ముస్లిమ్ లు
న్యూఢిల్లీ : ఫోర్బ్స్ జాబితాలోకి ఎక్కిన వందమంది భారత బిలియనీర్ల జాబితాలో నలుగురు ముస్లిమ్ పారిశ్రామికవేత్తలున్నారు. ఇందులో ముగ్గురు పాత వారు కాగా, దక్షిణ భారతదేశానికి చెందిన యువ NRI డాక్టర్ షంషీర్ వాయలీల్ తాజాగా బిలియనీర్ల జాబితాలోకి ఎక్కారు. 39 ఏళ్ల షంషీర్ వందమంది ఫోర్బ్స్ యువ ధనవంతుల జాబితాలో మూడోవ్యక్తిగా నిలిచారు. అజీమ్ ప్రేమ్ జీ, ఎంఏ యూసుఫ్ అలీ, యూసుఫ్ హమీద్ ల పేర్లు ఫోర్బ్స్ జాబితాలో కొనసాగుతున్నారు. డాక్టర్ షంషీర్ మన భారతదేశంతోపాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లలో వీపీఎస్ హెల్త్ కేర్ పేరిట నెట్ వర్కింగ్ హాస్పిటల్స్, క్లినిక్ లు, ఫార్మాస్యూటికల్ తయారీ యూనిట్లు, ఫార్మసీ కేంద్రాలు నిర్వహిస్తున్నారు. 1.27 బిలియన్ల సంపదతో షంషీర్ ఫోర్బ్స్ జాబితాలో 98వ స్థానంలో నిలిచారు. వైద్యరంగంలో డాక్టర్ షంషీర్ చేసిన సేవలకు గుర్తింపుగా మన…
Read Moreయూరీ జవాన్లకు ఒడిశా ముస్లింల నివాళులు
ఒడిశా : జమ్మూకశ్మీర్ రాష్ట్రంలో జరిగిన యూరీ ఘటనలో మరణించిన వీరజవాన్లకు ఒడిశా రాష్ట్రం నవరంగపూర్‌లో ముస్లింలు ఘనంగా నివాళులర్పించారు. నవరంగపూర్ లోని సున్నిహానఫి మస్జిద్ కమిటీ ఆధ్వర్యంలో ముస్లింలు పట్టణంలో శాంతిర్యాలీ జరిపారు. సబ్ కలెక్టర్ కార్యాలయం వరకూ ర్యాలీగా వెళ్లిన ముస్లిమ్ లు పాకిస్తాన్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం ఉగ్రవాదులపై కఠిన చర్యలు చేపట్టాలంటూ ప్రధానమంత్రికి రాసిన వినతి పత్రాన్ని సబ్‌కలెక్టర్ గోపాల్‌స్వామి నాయుడుకు అందజేశారు.
Read More