ముస్లిం స్వాతంత్య్ర యోధుల జీవితాలపై ఉచిత అప్

అత్యధిక శాతం భారతీయులు మరచిపోయిన, నిర్లక్ష్యం చేసిన వందలాది ముస్లిం స్వాతంత్య్ర యోధుల జీవితాలపై సయ్యిద్ నసీర్ అహ్మద్ గారు పరిశోధన చేసి విలువైన సమాచారాన్ని క్రోడీకరించి రచించిన గ్రంథం ‘చరితార్థులు’ ఇప్పుడు ఒక ఆండ్రాయిడ్ ఆప్ గా మన ముందుకు వచ్చింది గుంటూరు జిల్లా తాడేపల్లి మండ‌లానికి చెందిన చ‌రిత్ర‌కారుడు, బ‌హుగ్రంథ ర‌చయిత‌, సయ్యిద్ నసీర్ అహ్మద్ 2014లో రూపొందించిన 155 మంది ముస్లిం స్వాతంత్య్ర స‌మర‌యోధుల వినూత్నఆల్బ‌మ్ ‘చ‌రితార్దులు’ కంప్యూట‌ర్ సాంకేతిక సొబ‌గ‌ల‌ను అన్వ‌యించుకుంటూ ‘యాప్’ రూపంలో ఉచితంగా  ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి వ‌చ్చింది. సాఫ్ట్ వేర్ నిపుణుడు స‌య్య‌ద్ ఖాలిద్ సైఫుల్లాహ్, ఆయ‌న స‌హ‌చ‌రుడు అమానుల్లా ఖాన్ ల‌ బృందం నసీర్ గారి స‌హ‌కారంతో “Muslim Freedom Fighters” పేరుతో ఉచిత యాప్ రూపొందించారు. ఈ యాప్ లో ఆల్బ‌మ్ లోని 155 మంది ముస్లిం స్వాతంత్య్ర…

Read More

ఫోర్బ్స్ కోటీశ్వరుల జాబితాలో నలుగురు భారతీయ ముస్లిమ్ లు

న్యూఢిల్లీ : ఫోర్బ్స్ జాబితాలోకి ఎక్కిన వందమంది భారత బిలియనీర్ల జాబితాలో నలుగురు ముస్లిమ్ పారిశ్రామికవేత్తలున్నారు. ఇందులో ముగ్గురు పాత వారు కాగా, దక్షిణ భారతదేశానికి చెందిన యువ NRI డాక్టర్ షంషీర్ వాయలీల్ తాజాగా బిలియనీర్ల జాబితాలోకి ఎక్కారు. 39 ఏళ్ల షంషీర్ వందమంది ఫోర్బ్స్ యువ ధనవంతుల జాబితాలో మూడోవ్యక్తిగా నిలిచారు. అజీమ్ ప్రేమ్ జీ, ఎంఏ యూసుఫ్ అలీ, యూసుఫ్ హమీద్ ల పేర్లు ఫోర్బ్స్ జాబితాలో కొనసాగుతున్నారు. డాక్టర్ షంషీర్ మన భారతదేశంతోపాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లలో వీపీఎస్ హెల్త్ కేర్ పేరిట నెట్ వర్కింగ్ హాస్పిటల్స్, క్లినిక్ లు, ఫార్మాస్యూటికల్ తయారీ యూనిట్లు, ఫార్మసీ కేంద్రాలు నిర్వహిస్తున్నారు. 1.27 బిలియన్ల సంపదతో షంషీర్ ఫోర్బ్స్ జాబితాలో 98వ స్థానంలో నిలిచారు. వైద్యరంగంలో డాక్టర్ షంషీర్ చేసిన సేవలకు గుర్తింపుగా మన…

Read More