అక్టోబరు 13నుంచి ఆల్ ఇండియా ముస్లిమ్ మజ్లిస్ ఏ ముషావరత్ సదస్సు

ముంబయి: దేశంలో ముస్లిమ్ లు ఎదుర్కొంటున్న సమస్యలతోపాటు సామాజిక, రాజకీయ పరిస్థితులపై చర్చించేందుకు ముంబయిలో అక్టోబరు 13నుంచి నాలుగురోజుల పాటు ఆల్ ఇండియా ముస్లిమ్ మజ్లిస్ ఏ ముషావరత్ సదస్సు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు చెప్పారు. అక్టోబరు 13నుంచి 16వతేదీ వరకు నిర్వహించనున్న ఈ సదస్సు సందర్భంగా అక్టోబరు 15వ తేదీన జరిగే బహిరంగసభకు జాతీయ స్థాయి  ముస్లిమ్ నేతలు, ఉలమా, ముషావరత్ నేతలు పాల్గొంటారు. ఈ సదస్సులో 400 మంది ముస్లిమ్ నేతలు, విద్యావేత్తలు పాల్గొని ముస్లిమ్ ల సమస్యలపై చర్చించి తీర్మానాలు చేస్తారు.

Read More