ఇంగ్లండ్ ప్రధాని చర్చిల్ ఇస్లామ్ స్వీకరించాలనుకున్నారా…!?

లండన్ : రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటన్ దేశానికి ప్రధానమంత్రిగా పనిచేసిన సర్ విన్‌స్టన్ చర్చిల్ ఇస్లాం స్వీకరించాలనుకున్నారా…అవునని తాజాగా వెలుగుచూసిన లేఖ ఈ విషయాన్ని బహిర్గతం చేసింది. సర్ విన్‌స్టన్ చర్చిల్ తాను ఇస్లాం మతాన్ని స్వీకరించాలనే కోరికను వ్యక్తం చేయగా దాన్ని అతని కుటుంబం వ్యతిరేకించిందని తాజాగా వెల్లడైన లేఖతో తేలింది. బ్రిటిష్ సామ్రాజ్య ప్రధాన రక్షకుడైన ప్రధాన మంత్రి సర్ విన్‌స్టన్ చర్చిల్ ఇస్లాం మతాన్నివిపరీతంగా అభిమానించే వాడని వెల్లడైంది. రెండవ ప్రపంచ యుద్ధంలో  బ్రిటన్ దేశాన్ని విజయం వైపు నడిపించిన ప్రధాన మంత్రి ఇస్లాం మతమంటే తనకిష్టమని చెప్పి అందులోకి మారేందుకు చేసిన యత్నాన్ని అతని కుటుంబం నచ్చజెప్పి మతం మారకుండా అడ్డుకుందని సమాచారం. ‘‘నేను మీలో ఇస్లాంపై మీలో ఉన్న ధోరణిని గమనించానని… దయచేసి మీరు ఇస్లాం మతంలోకి  మారకండి..’’అంటూ…

Read More

బలవంత మత మార్పిడి ఆరోపణలు బూటకం అని తేల్చి చెప్పిన పోలీస్ అధికారులు

మంగళూరు : దక్షిణ కన్నడ జిల్లా సుల్లుయా తాలూకాలో బలవంతంగా ఇస్లాంలోకి మతం మార్పించినట్లు ఒక్క ఫిర్యాదు కూడా రాలేదని ఎస్పీ భూషణ్ గులాబ్ రావు బోరాసే స్పష్టం చేశారు. ఓ గ్రూపు కొందరు యువకులను బలవంతంగా ఇస్లామ్ లోకి మార్పించారని, దీనిపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సంజీవ్ మతండోర్ ఆరోపించారు. బలవంతంగా మతమార్పిడిలు చేస్తున్నారని వీహెచ్‌పీ, భజరంగ్‌దళ్ సంస్థలు ఆరోపించాయి. దీనిపై విచారణ జరపగా ఒక్క కేసులోనూ ఇస్లామ్ లోకి బలవంతంగా మార్పిడి జరగలేదని ఎస్పీ వివరించారు. సుల్లుయా తాలూకా మందీకోలు గ్రామానికి చెందిన సతీష్ ఆచార్య తన సొంత సంకల్పంతోనే ఎవరి ఒత్తిడి లేకుండా ఇస్లామ్ మతాన్ని స్వీకరించినట్లు తమ దర్యాప్తులో తేలిందని ఎస్పీ పేర్కొన్నారు.

Read More