మరో రికార్డు బద్దలు కొట్టిన హాషిమ్ ఆమ్లా

వన్ డే క్రికెట్ లో అతివేగంగా 7000 పరుగుల మైలురాయిని అందుకున్నాడు హషీం అమ్లా. ప్రపంచ మేటి బ్యాట్స్ మ్యాన్ భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ పేరుతో ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. దక్షిణాఫ్రికా ప్రముఖ బ్యాట్స్ మన్, మాజీ కెప్టేన్ హాషిమ్ ఆమ్లా కేవలం 150 మ్యాచుల్లో 7000 పరుగులు పూర్తి చేసి కొత్త రికార్డు సృష్టించాడు. భారత కెప్టేన్ విరాట్ కోహ్లీ గత సంవత్సరం 161 మ్యాచుల్లో 7000 పరుగులు పూర్తి చేసి నెలకొల్పిన రికార్డు ఇప్పుడు తిరగరాశాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లాండ్ తో ఆడుతూ ఈ రికార్డును సాధించాడు. వన్ డే ఇంటర్నేషనల్ మ్యాచుల్లో అతివేగంగా 2000 పరుగులు, 3000 పరుగులు, 4000 పరుగులు, 5000 పరుగులు, 6000 పరుగులు సాధించిన రికార్డులు కూడా ఆమ్లా పేరనే ఉండడం విశేషం.

Read More

షేన్ వాన్ ప్రశంసలు పొందిన ఆరేళ్ళ బౌలింగ్ సంచలనం

ఆరేళ్ళ అలీ మికాల్ ఖాన్ ఇంటర్నెట్ లో సంచలనమైపోయాడు. అద్భుతమైన బౌలింగ్ ప్రతిభతో క్రికెట్ దిగ్గజాల ప్రశంసలు పొందాడు. పాకిస్తాన్ లోని క్వెట్టాకు చెందిన ఈ పిల్లవాడు తన తండ్రితో కలిసి క్వెట్టా క్రికెట్ క్లబ్బులో ప్రాక్టిస్ చేస్తుంటాడు. తండ్రి అబ్దుల్లాహ్ ఖాన్ స్వయంగా ఈ పిల్లవాడికి కోచింగ్ ఇస్తున్నారు. బౌలింగ్ లో షేన్ వాన్ అని అందరూ పిలిచే ఈ అబ్బాయి లెగ్ స్పిన్, గూగ్లీ, ఫ్లిప్పర్, స్లయిడర్ వంటి బంతులు సునాయాసంగా వేయగలడు. తండ్రి కంప్యూటర్ ఇంజనీర్. కాని క్రికెట్ పట్ల అలీ ఖాన్ కు ఉన్న ఆసక్తి చూసి కోచింగ్ ఇస్తున్నాడు. అలీ ఖాన్ బౌలింగ్ చేస్తున్న ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. వసీం అక్రం, విరాట్ కోహ్లీ, షెన్ వాన్ వంటి ప్రముఖులు ఆ వీడియో చూశారు. షేన్…

Read More

బౌలింగ్ లో రషీద్ ఖాన్ మరో ప్రపంచ రికార్డు

ఆఫ్గనిస్తాన్ కు చెందిన లెగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్ అతి తక్కువ మ్యాచుల్లో 100 వికెట్లు సాధించిన బౌలర్ గా చరిత్ర సృష్టించాడు. కేవలం 44 మ్యాచుల్లో ఈ రికార్డు సాధించాడు. ఇంతకు ముందు ఈ రికార్డు ఆస్ట్రేలియాకు చెందిన మిషెల్ స్టార్క్ పేర ఉంది. ఆయన 52 మ్యాచుల్లో 100 వికెట్లు పడగొట్టాడు. అంతర్జాతీయ క్రికెట్టులో రషీద్ ఖాన్ రెండవ స్థానానికి తన రేటింగ్ మెరుగుపరచుకున్నాడు. వెస్టిండీస్ బ్యాట్స్ మన్ షాయ్ హోప్ ను 23 పరుగులకు ఎల్బీడబ్ల్యు చేసి 100 వ వికెట్టు సాధించాడు. 19 సంవత్సరాల రషీద్ ఖాన్ ఆప్గనిస్తాన్ టీమును అసోసియేట్ స్థాయి నుంచి పూర్తిస్థాయి క్రికెట్ దేశం స్థాయికి పెంచాడు. కేవలం 26 మ్యాచుల్లో 50 వికెట్లు సాధించాడు. మరో 17 మ్యాచుల్లో 99కి చేరుకున్నాడు. 2019 వరల్డ్ కప్…

Read More