రాయ్‌పూర్ : జనసంఘ్ నాయకుడు దీన్ దయాళ్ ఉపాధ్యాయపై సోషల్ మీడియా సైట్లో కామెంట్ చేస్తూ పోస్టు పెట్టారని చత్తీస్ఘడ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కారు ఓ ఐఏఎస్ అధికారిపై బదిలీ వేటు వేసింది. ప్రస్తుతం బీజేపీ నేతలు దీన్ దయాళ్ ఉపాధ్యాయ శత జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్న వేళ చత్తీస్ఘడ్ రాష్ట్రంలో పనిచేస్తున్న 2012 బ్యాచ్ ఐఏఎస్ అధికారి శివ్ అనంత్ తయాల్ “ఈయన గురించి ఎంతో వెతికాను కానీ ఈయన చేసిన గొప్ప పనులు ఏమిటో నాకు తెలియడం లేదు” అంటూఫేస్ బుక్ లో ఓ పోస్టు పెట్టారు. అంతే…సదరు పోస్టు పెట్టిన ఐఏఎస్ అధికారిపై చర్యలు తీసుకోవాలని బీజేపీ నేతలు డిమాండు చేశారు. దీనిపై స్పందించిన బీజేపీ రాష్ట్ర సర్కారు కాంకేర్ జిల్లా పరిషత్ సీఈఓగా పనిచేస్తున్న శివ్ అనంత్ తయాల్…
Read MoreCategory: సోషల్ మీడియా
సోషల్ మీడియాలో యూపీ డీజీపీ జావెద్ అహ్మద్‌పై ప్రశంసల వర్షం
లక్నో : ఉత్తరప్రదేశ్ రాష్ట్ర డీజీపీ జావెద్ అహ్మద్‌పై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. యూపీలో టేసర్ గన్ల ప్రయోగాన్ని డీజీపీ నిర్వహించారు. ఈ సందర్భంగా టేసర్ గన్ ప్రయోగాన్ని మొదటగా తనపైనే చేయాలని జావెద్ అహ్మద్ సహచరులను కోరారు. డీజీపీ విజ్ఞప్తితో ఆయనపై ప్రయోగం చేశారు. టేసర్ గన్‌తో గురి చూసి షూట్ చేస్తే అందులో నుంచి రెండు ఎలక్ట్రోడ్లు లక్ష్యం వైపు వెళ్లి విద్యుత్‌ను విడుదల చేస్తాయి. దీంతో టార్గెట్ వ్యక్తి తాత్కాలికంగా స్ప హ కోల్పోతాడు. ఆ విధంగా డీజీపీ కూడా కిందపడిపోయారు. తర్వాత నెమ్మదిగా తేరుకున్నారు. ఐపీఎస్ అధికారులు ఈ వీడియోను అధికారిక ట్విట్టర్లో పోస్టు చేయడంతో జావెద్ అహ్మద్ చాలా ధైర్యవంతుడని నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తారు.
Read More