రవిశంకర్ కి ఒక చట్టం – సజ్జాద్ నోమాని కి మరో చట్టమా?

శాంతిదూతలుగా ప్రచారం చేసుకునే శ్రీశ్రీ రవిశంకర్ వంటి బాబాలు దేశంలో రక్తపాతం జరుగుతుందని, సిరియాగా మారిపోతుందని బాహాటంగా బెదిరింపులు చేస్తున్నా ఏమీ చేయని పాలనా యంత్రాంగం ఇప్పుడు ముస్లిం పర్సనల్ లా బోర్డు చైర్మన్ పై దేశద్రోహం కేసు పెట్టింది. హైదరాబాదులో బోర్డు సమావేశంలో ప్రసంగిస్తూ మౌలానా సజ్జాద్ నోమాని దేశంలో ముస్లిములపై దాడులు పెరుగుతున్నాయని, రోహింగ్యా ముస్లిముల మాదిరిగా ఇక్కడి ముస్లిమును కూడా వేధించే కుట్రలు జరుగుతున్నాయని, మారుమూల గ్రామాల్లో కూడా ఆయుధశిక్షణ ఇస్తున్న సమాచారం తనవద్ద ఉందని జాగ్రత్తలు చెప్పారు. ఈ వ్యాఖ్యలు మతవర్గాల మధ్య చిచ్చుపెట్టే వ్యాఖ్యలంటూ షియా వక్ఫ్ బోర్డు చైర్మనుగా పదవిలో ఉన్న వసీమ్ రిజ్వి చేసిన ఫిర్యాదు మేరకు ఏకంగా దేశద్రోహం కేసు పెట్టారు. బాబరీ మస్జిదు విషయంలో బిజేపి అనుకూల ప్రకటనలిస్తున్న వసీం రిజ్వి ఫిర్యాదు చేసాడంటే…

Read More

ముస్లిములను ఆకట్టుకోడానికి మోడీ మరో విఫల యత్నం

ఈశాన్య రాష్ట్రాల్లో బిజేపి విజయం తర్వాత ఢిల్లీలో బిజేపి ప్రధాన కార్యాలయంలో ప్రసంగిస్తున్న మోడీ దూరం నుంచి అజాన్ వినబడగానే, అజాన్ ముగిసే వరకు తన ప్రసంగాన్ని ఆపేశారు. మోడీ ప్రసంగం మధ్యలో అజాన్ వినిపించింది. రెండు నిముషాల పాటు మోడీ ప్రసంగాన్ని ఆపేసి మౌనంగా నిలబడ్డారు. అజాన్ ముగిసిన తర్వాత మళ్ళీ తన ప్రసంగం కొనసాగించారు. ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలలో “రమజాన్ కు లైట్లు పెడితే హిందూ దీపావళికి కూడా లైట్లు పెట్టాలి” అంటూ మతతత్వం రెచ్చగొట్టిన  మోడీ… గుజరాత్ ఎన్నికలలో మరింత నేరుగా “వారికి మస్జిద్ కావాలో మందిరం కావాలో తేల్చుకోమనండి” అన్న మోడీ అకస్మాత్తుగా ‘అజాన్ సెంటిమెంట్’ చూపడం ఎవ్వరూ సీరియస్ గా తీసుకోవడం లేదు. ఇంతకు ముందు 2017 గుజరాత్ ఎన్నికల ప్రచార సభల్లో కూడా మోడీ ప్రసంగం మధ్యలో అజాన్ వినిపిస్తే ప్రసంగాన్ని…

Read More

రవిశంకర్ కు దీటైన జవాబిచ్చిన పర్సనల్ లా బోర్డు

మందిరానికి వ్యతిరేకంగా కోర్టు తీర్పు వస్తే అమలు చేయడం కష్టమని, దేశంలో రక్తపాతం జరుగుతుందని, దేశం మరో సిరియాగా మారొచ్చంటూ శ్రీశ్రీ రవిశంకర్ చేసిన వ్యాఖ్యలకు ముస్లిం పర్సనల్ లా బోర్డు దీటైన జవాబిచ్చింది. “దేశంలో ప్రజలు కోర్టు తీర్పుకు కట్టుబడి ఉంటారని, శాంతి భద్రతలను కాపాడే బాధ్యత భద్రతా దళాలద”ని జవాబిచ్చింది. కోర్టు బయట రాజీ పడాలంటూ శ్రీ శ్రీ రవిశంకర్ తీవ్రంగా బెదిరించిన తర్వాత పర్సనల్ లా బోర్డు ప్రతిస్పందన వచ్చింది. ఎవరి వద్దనైనా పరిష్కారం ఫార్మూలా ఏదైనా ఉంటే సుప్రీంకోర్టుకు సమర్పించాలని పర్సనల్ లా బోర్డు ఎగ్జిక్యూటివ్ సభ్యుడు మౌలానా ఖాలిద్ రషీద్ ఫారంగీ చెప్పారు. కోర్టు తీర్పు తర్వాత సిరియా వంటి పరిస్థితి వస్తుందన్న మాటలను కొట్టిపారేస్తూ, సిరియాలో బయటి దేశాల జోక్యం వల్ల అంతర్యుద్ధం జరుగుతుందని, బాబరీ మస్జిదు సమస్యలో…

Read More

మతోన్మాద శక్తుల కుట్రలు, ముస్లిం పేర్లతో ఫేక్ ఐడీలు

వాడి పేరు దినేష్ శర్మ. మరోసారి జాగ్రత్తగా చూడండి. వాడి పేరు దినేష్ శర్మ. కాని అలీ ఖాన్ పేరుతో ఫేస్ బుక్ లో ఫేక్ ఐడి పెట్టుకున్నాడు. ఇలాంటి వేలాది దొంగ ఐడీలు సృష్టించింది మతతత్వ పార్టీ బిజెపీ. ఎందుకంటే మతతత్వ మంటలు ఎగదోయడానికి. ఈ దినేష్ ఫేస్ బుక్కులో ఒక హిందూ దేవాలయం గురించి పెట్టిన అభ్యంతరకరమైన పోస్టు వల్ల పశ్చిమ బెంగాల్లోని 24 పరగణా జిల్లాలో మతకలహాలు భగ్గుమన్నాయి. కేంద్రం వెంటనే 300 మంది పారా మిలిటరీ బలగాలను తరలించింది. ఈ అభ్యంతరకరమైన పోస్టు వల్ల మతకలహాలు చెలరేగినందుకు మరోవైపు బిజేపి నేతలకు కూడా చేతినిండా పని దొరికింది. పశ్చిమ బెంగాల్ గవర్నర్ కేశరీ నాథ్ త్రిపాఠి బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో దురుసుగా మాట్లాడారని స్వయంగా ఆమెయే చెప్పారు. బిజేపి బ్లాక్ ప్రెసిడెంటులా…

Read More

భారత చరిత్ర కాషాయీకరణ ప్రయత్నాలు ప్రారంభం

భారతదేశం అనేక దాడులు, వలసలతో ఏర్పడిన దేశం. బహుళ మతాలు, సంస్కృతులు, భాషల దేశం. కానీ చరిత్రను వక్రీకరించి దిశగా ప్రధాని ఒక కమిటీ వేశారని తెలుస్తోంది. భారతదేశం హిందురాష్ట్రగా మార్చే క్రమంలో భాగమే ఈ కమిటీ అని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రాచీన చరిత్ర తిరగ రాయడానికే ఈ కమిటీ వేశారని కమిటి చైర్మన్ కే.ఎన్.దీక్షిత్ చెప్పినట్లు తెలుస్తోంది. అలాగే సాంస్కృతిక శాఖ మంత్రి మహేష్ శర్మ కమిటి ఉద్దేశ్యాన్ని స్పష్టంగా ప్రకటించేశాడు. భారత చరిత్ర తిరగరాసే ప్రయత్నాల్లో భాగమే ఇదని చెప్పకనే చెప్పేశాడు. రాయిటర్స్ వార్తా సంస్థతో మాట్లాడుతూ ఆరెస్సెస్ ప్రతినిథి మన్మోహన్ వైద్య భారత చరిత్ర అసలు రంగు కాషాయమేనని అన్నాడు. సాంస్కృతిక మార్పులు తీసుకురావడానికి చరిత్రను తిరగరాయాలని చెప్పాడు. ఆరెస్సెస్ చరిత్ర పరిశోధన విభాగం అధిపతి బాల్ ముకుంద్ పాండే తాను క్రమం…

Read More

ఇరాన్ కు సన్నిహితమవుతున్న ఖతర్?

అరబ్బు దేశాలకు ఖతర్ కు మధ్య కొనసాగుతున్న ఉద్రికత్త కొత్త రూపు ధరిస్తోంది. ఇరాన్, టర్కీ దేశాలకు సన్నిహితంగా ఖతర్ మారుతోంది. దీనివల్ల మధ్యప్రాచ్య రాజకీయాల్లో పెనుమార్పులు రావచ్చు. సౌదీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఈజిప్ట్, బహ్రయీన్ తదితర అరబ్బు దేశాలు ఖతర్ తో దౌత్య సంబంధాలు తెంచుకున్నాయి. ఖతర్ ఉగ్రవాద సంస్థలకు సహాయపడుతుందన్నది ఆరోపణ. ముఖ్యంగా ముస్లిమ్ బ్రదర్ హుడ్ విషయమై ఈ దేశాలకు అభ్యంతరాలున్నాయి. ఖతర్ ఈ ఆరోపణలను బలంగా ఖండించింది. కాని ఖతర్ ఆహారపదార్థాలను ఈ దేశాల నుంచే దిగుమతి చేసుకోవాలి. ఈ సంక్షోభంలో ఖతర్ తనకు మద్దతిచ్చే మిత్రదేశాల కోసం చూస్తోంది. టర్కీ, ఇరాన్  దేశాలు అవసరమైన మద్దతు అందించడానికి సిద్ధంగా ఉన్నాయి. సమస్య పరిష్కారానికి టర్కీ సహాయం చేస్తానంది. అవసరమైన ఆహారపదార్థాలు అందించడానికి ఇరాన్ ముందుకు వచ్చింది.

Read More

పాకిస్తాన్ లో ముందస్తు ఎన్నికలకు డిమాండ్ చేసిన ఇమ్రాన్ ఖాన్

దేశంలో ముందస్తు ఎన్నికలు జరపాలని పాకిస్తాన్ తెహ్రీకె ఇన్సాఫ్ పార్టీ చైర్మన్ ఇమ్రాన్ ఖాన్ డిమాండ్ చేశారు. ఇస్లామాబాద్ లో ఒక సభలో మాట్లాడుతూ ఆయన ఈ డిమాండ్ చేశారు. ఢిల్లీ లోని కేజ్రీవాల్ ప్రభుత్వం మాదిరిగానే పాకిస్తాన్ లో ని ఖైబర్ పాఖ్తుం ఖ్వాన్ రాష్ట్రంలో ప్రజారంజకంగా పరిపాలించి మంచి పేరు సంపాదించిన ఇమ్రాన్ ఖాన్ పార్టీ సమరోత్సాహం తో ఉంది. కొత్త ప్రధాని షాహిద్ ఖాఖాన్ అబ్బాసీపై కూడా అవినీతి ఆరోపణలున్నాయని పేర్కొంటూ నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాకిస్తాన్ ముస్లిమ్ లీగ్ వల్ల పాకిస్తాన్ సైన్యానికి చెడ్డపేరు వస్తోందని ఆరోపించారు. దేశ ఆర్థిక వ్యవస్థ నాశనమవుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Read More

ట్రంప్ ను ఐసిస్ తో పోల్చిన లండన్ మేయర్ సాదిఖ్ ఖాన్

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఉగ్రవాద సంస్థ ఐయస్ఐయస్ వంటి భాష వాడుతున్నారని లండన్ మేయర్ సాదిక్ ఖాన్ విమర్శించారు. ముస్లిములు అమెరికాలో ప్రవేశించకుండా సరిహద్దులు పూర్తిగా మూసేయాలని డోనాల్డ్ ట్రంప్ అనడాన్ని ఉటంకిస్తూ లేబర్ పార్టీ కాన్ఫరెన్సులో సాదిక్ ఖాన్ ఈ మాటలు అన్నారు. అమెరికా అధ్యక్షుడితో ఈ విషయమై తనకు వాదన ఇష్టం లేదని సాదిఖ్ ఖాన్ అన్నారు. ముస్లిములు అమెరికాలో ప్రవేశించకుండా పూర్తిగా మూసేయాలని పిలుపునిచ్చిన డోనాల్డ్ ట్రంప్ లండన్ మేయరు సాదిక్ ఖాన్ అందుకు మినహాయింపని చెప్పడంతో మేయరు మరింత ఆగ్రహించారు. తాను మినహాయింపేమీ కాదని చెబుతూ, “ట్రంప్ ఏం మాట్లాడుతున్నారో కాస్త ఆలోచించుకోవాలని” అన్నారు. “ఎందుకంటే మీరు మాట్లాడుతున్నది ఐయస్ఐయస్ భాషలా ఉంది” అని వేలెత్తి చూపారు. పాశ్చాత్యులు ఇస్లామ్ ను ద్వేషిస్తారని ఐయస్ఐయస్ చెబుతుంది. అమెరికా అధ్యక్షుడిగా మీరు కూడా…

Read More

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ విద్యార్ధి ఎన్నికల్లో ‘లాల్-నీల్’ విజయభేరి

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ విద్యార్థి ఎన్నికల్లో హోరాహోరిగా పోటీ నడిచింది. వామపక్ష, దళిత, ముస్లిమ్ సమైక్యతతో ఏర్పడిన అలయెన్స్ ఆఫ్ సోషల్ జస్టిస్ తరఫున పోటీ చేసిన శ్రీరాగ్ ఘనవిజయం సాధించాడు. బారతీయ జనతాపార్టీకి అనుబంధ విద్యార్థి సంఘం ఏబివిపి అభ్యర్థి కే. పల్సానియా ఓడిపోక తప్పలేదు. అలయెన్స్ ఆఫ్ సోషల్ జస్టిస్ లో వివిధ విద్యార్థి సంఘాలున్నాయి. స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్, దళిత్ స్టూడెంట్స్ యూనియన్, ట్రయిబల్ స్టూడెంట్స్ ఫోరమ్, తెలంగాణ విద్యార్థి వేదిక, ముస్లిమ్ స్టూడెంట్స్ ఫెడరేషన్ మాత్రమే కాక సారూప్య భావాలు కలిగిన అనేకమంది మద్దతిచ్చారు. ఈ గ్రూపులు రిసెర్చ్ స్కాలర్ రోహిత్ వేములకు మద్దతుగా నిలబడిన గ్రూపులు. ఎన్నికల్లో దాదాపు అన్ని పదవుల్లోను అలయెన్స్ ఘనవిజయం సాధించింది. జనరల్ సెక్రటరీగా అలయెన్స్ కు చెందిన ఆరిఫ్…

Read More

ఒక్క ముస్లిమ్ సభ్యుడూ లేని తెదేపా పొలిట్ బ్యూరో

ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలుగుదేశం పోలిట్ బ్యూరో సభ్యుల పేర్లు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముస్లిములు దాదాపు పదిశాతం ఉన్నప్పటికీ ఒక్క ముస్లిమ్ పేరుకు  కూడా అందులో చోటు దక్కలేదు. చంద్రబాబునాయుడు మంత్రివర్గంలో కూడా ఒక్క ముస్లిమ్ పేరు కనబడదు. తెలుగుదేశానికి చెందిన ఒక నాయకుడు ఈ విషయమై మాట్లాడుతూ నంద్యాల ఎన్నికల్లో పార్టీకి ముస్లింలు పూర్తి మద్దతు ఇచ్చినా మరోసారి మోసపోయామని అన్నాడు. నిజానికి నంద్యాల ఎన్నికల వరకు చంద్రబాబునాయుడుకు ముస్లిములు అస్సలు గుర్తుకు రాలేదని, నంద్యాల ఎన్నికల కోసమే ఎన్ ఎం డీ ఫారూక్ ను శాసనమండలి ఛైర్మన్ గా నియమించారని, ఇచ్చిన ఒకట్రెండు పదవులు కూడా ముస్లిమ్ ఓట్ల కోసమే చేశారన్న ఆరోపణలు బలంగా వినిపించాయి. నంద్యాల ఎన్నికలు ముగియగానే మరిచిపోయారని, 2014 ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ కేవలం ఒకే ఒక్క…

Read More