జమాఅతె ఇస్లామీ హింద్ షరతులతో కూడిన మద్దతు

గతంలో పనితీరు, భవిష్యత్తులో పరిపాలన పట్ల నిబద్దత ఆధారంగా మాత్రమే తాము మద్దతు ఇస్తామని జమాఅతె ఇస్లామీ హింద్ తెలంగాణా అండ్ ఒడిశా అధ్యక్షులు హామిద్ ముహమ్మద్ ఖాన్ అన్నారు. యువకులకు ఉద్యోగాలు, పంటలకు ఇన్సూరెన్స్, పోలీసు సంస్కరణలు, తెలంగాణా సంస్కృతికి పరిరక్షణ, మైనారిటీలకు సబ్ ప్లాన్, ముస్లిములకు జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లు, పౌరసదుపాయాలు కల్పించడం ప్రధాన డిమాండ్లుగా జమాఅత్ పేర్కొంది. 1994 తర్వాతి నుంచి పాలకపక్షాల పనితీరును జమాఅత్ సమీక్షిస్తోంది. సెక్యులర్ పార్టీల అభ్యర్థుల నిబద్దతపై కూడా పరిశీలిస్తోంది. ఈ పరిశీలన ప్రకారం ఒక నివేదిక రూపొందించి, కేంద్ర నాయకత్వానికి పంపిస్తారు. కేంద్ర నాయకత్వం ఎవరికి మద్దతివ్వాలన్నది ఈ రిపోర్టు ఆధారంగా నిర్ణయం తీసుకుంటుందని హామిద్ ముహమ్మద్ ఖాన్ అన్నారు. జమాఅత్ ఏ రాజకీయ పార్టీతోను ఎన్నికల వేదికలను పంచుకోవడం జరగదని, కాని జమాఅత్…

Read More

అనాథ ముస్లిం బాలికలకు మతాంతర వివాహాలు చేసిన యూపీ ప్రభుత్వం

ఉత్తరప్రదేశ్ సామూహిక వివాహాల పథకంలో భాగంగా లక్నోలో నలుగురు అనాథ ముస్లిం అమ్మాయిలను హిందూ అబ్బాయిలతో వివాహాలు జరిపించిన సంఘటనపై న్యాయవిచారణ జరగాలని ముస్లిం నేతలు డిమాండ్ చేస్తున్నారు. స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం కోర్టులో ఈ వివాహాలు జరిగాయి. ఆ తర్వాత అగ్ని ప్రదక్షిణలు కూడా జరిపించారు. ఈ కార్యక్రమంలో మరో 27 హిందూ జంటలకు కూడా వివాహాలు జరిగాయి. ఈ నలుగురు ముస్లిం అమ్మాయిలు ఆరేళ్ళ వయసున్నప్పుడు అనాథశరణాలయంలో చేరారు. ముస్లిం పేర్లున్నప్పటికీ అనాథ శరణాలయంలో ఉన్నప్పుడు వారు ముస్లిం ఆచారాలేవీ పాటించేవారు కాదంటూ ప్రభుత్వ అధికారులు వివరణ ఇస్తున్నారు. ఆరేళ్ళ అమ్మాయిలు స్వయంగా ఒక మత ఆచారాల్ని ఎలా పాటించగలరో వాళ్ళ విజ్ఞతకే తెలుసు. పైగా వివాహం తర్వాత వారు భర్తల మతాన్నే అనుసరిస్తారని కూడా ఈ అధికారులు సెలవిచ్చారు. ఈ మొత్తం…

Read More

మతవివక్ష చూపించిన తాజ్ గ్రూప్ హొటెల్

గౌహతీ లోని తాజ్ వివంటా హోటల్లో ముగ్గురు ముస్లిములకు దారుణమైన మతవివక్ష ఎదురైంది. ఈ ముగ్గురు ముస్లిముల్లో ఒకరు ఆర్మీ మెడికల్ కార్ప్స్ కు చెందిన వారు. వారి మొబైల్లో పార్లమెంటు సభ్యుడు ఒవైసీ ప్రసంగం ఉండడమే ఈ మతవివక్షకు, వేధింపులకు కారణం. హోటలు సిబ్బంది వారిని వేధించడమే కాదు, జైలుకు పంపేస్తామని బెదిరించారట. ఢిల్లీ ఫ్లయిట్ మిస్సవ్వడంతో మధ్యాహ్నం 2 గంటలకు హోటలుకు వెళ్ళిన ఈ ముగ్గురు ఆ తర్వాత బయటకు వెళ్ళి 4 గంటలకు తిరిగి వచ్చేసరికి హోటల్లో పోలీసు బలగాలు స్వాగతమిచ్చాయి. వారి పట్ల హొటెల్ సిబ్బంది దురుసుగా వ్యవహరించడం ప్రారంభించారు. మీడియాతో మాట్లాడడానికి ప్రయత్నిస్తే హొటెల్ సెక్యురిటీ అధికారి జైలుకు పంపిస్తానని వార్నింగిచ్చాడు. వారిపైన నిఘా పెట్టి, వేధింపులకు గురి చేశారు. వారి మొబైల్ ఫోన్లు లాక్కున్నారు. వారి మొబైల్ లో…

Read More

కాంగ్రెస్ అభ్యర్థులు కూడా ముస్లిం నాయకులను దూరంగా ఉంచుతున్నారా?

దేశంలో ముస్లిముల పట్ల ఎలాంటి వివక్ష నెలకొందో, ఎలాంటి మానసిక వేధింపులు కొనసాగుతున్నాయో కాంగ్రెస్ నాయకుడు గులాంనబీ ఆజాద్ ఆవేదన అద్దం పడుతుంది. తన పార్టీకే చెందిన హిందూ అభ్యర్థులు కూడా ఎన్నికల ప్రచారానికి తనను పిలవడం లేదని ఆయన వాపోయారు. అలీగఢ్ ముస్లిం యూనివర్శిటీ మాజీ విద్యార్థుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం భారతదేశంలో సమాజం రెండుగా చీలిపోయిందని, తనకు వ్యక్తిగతంగా కూడా వివక్ష అనుభవానికి వచ్చిందని చెప్పారు. ఈ విద్వేష రాజకీయాలకు నేను కూడా బాధితుడినే. 1857 తర్వాతి నాటి పరిస్థితి ఇప్పుడు ఉందని ఆయన అన్నారు. అప్పట్లో బ్రిటీషు వారు హిందూ ముస్లిములను విభజించారని చెప్పారు.

Read More

“ముస్లిం మహిళల కోసం BJP పోరాటం, హిందూ మహిళల విషయంలో మౌనం!” సిపిఎం నాయకుడు సీతారాం ఏచూరి ప్రశ్న

బాబరీ మస్జిద్ విధ్వంసం, శబరిమలలో మహిళల ప్రవేశం రెండింటి మధ్య పోలికల గురించి సిపిఎం ప్రధాన కార్యదర్శి ఏచూరి సీతారాం వివరించారు. బాబరీమస్జిద్ ను కూలదోసిన కాషాయదళాలే ఇప్పుడు వోట్ల రాజకీయాల కోసం శబరిమలలో హింసాత్మక ఆందోళనలకు దిగుతున్నాయని ఆరోపించారు. కేరళలోని వామపక్ష ప్రభుత్వం శబరిమలలో సుప్రీంకోర్టు ఉత్తర్వులను అమలు చేసే ప్రయత్నాలు చేస్తుందని, కాని, ఆరెస్సెస్; బిజేపిలు మతరాజకీయాలు నడుపుతున్నాయని విమర్శించారు. సుప్రీంకోర్టు హిందూ మహిళలకు ఇచ్చిన హక్కును బిజేపి నిరాకరిస్తుందని ఆయన విమర్శించారు. ముస్లిం మహిళల కోసం త్రిపుల్ తలాఖ్ చట్టం తెచ్చిన వారు హిందూ మహిళల సమాన హక్కుల విషయంలో మాత్రం మౌనం ఎందుకు వహిస్తున్నారని ప్రశ్నించారు.

Read More

ముంబయి హజ్ హౌస్ పై అత్యంత ఎత్తయిన జాతీయపతాకం!

ముంబయి హజ్ హౌస్ పై జాతీయపతాకాన్ని ఇటీవల కేంద్రమంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ ఆవిష్కరించారు. హజ్ హౌస్ భవనంపై ఎగురుతున్న ఈ జాతీయ పతాకం నేలకు 350 అడుగుల ఎత్తున ఎగురుతోంది. 20 అడుగుల వెడల్పు, 30 అడుగుల పొడవున్న జాతీయ పతాకమిది. అత్యంత ఎత్తున ఎగురుతున్న జాతీయ పతాకం ఇదే. హజ్ యాత్రికుల నుంచి సేకరించిన నిధులతో నిర్మించిన ముంబయి హజ్ హౌస్ భారత హజ్ కమిటీకి ప్రధాన కార్యాలయం. ముంబయి CST వద్ద ఈ భవనం ఉంది. ఈ భవనం ఎత్తు 300 అడుగులు. దానిపై 60 అడుగుల ఎత్తున్న జెండా కర్రకు ఈ జాతీయ పతాకం ఎగురుతోంది. ఇది చాలా పెద్ద జాతీయ పతాకం, దీని బరువు, సైజు వల్ల ప్రతిరోజు జాతీయ పతాకాన్ని పొద్దుట, సాయంత్రం అవనతం చేసి,  ఆవిష్కరించడం కష్టమవుతుంది…

Read More

హర్యానా మస్జిద్ నిర్వాహకుల పై కక్షసాధింపు

హర్యానాలోని పాల్వాల్ లో ఉన్న ఖులఫా – ఎ – రాషిదీన్ మస్జిదును పాకిస్తాన్ లోని ఒక ఉగ్రవాద సంస్థ నుంచి వచ్చిన నిధులతో కట్టారన్న ఆరోపణలు వచ్చాయి. కాని ఈ మస్జిదును స్థానిక ప్రజల విరాళాలతో కట్టారని గ్రామస్తులు అంటున్నారు. నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజన్సీ ఈ మస్జిదులో సోదాలు నిర్వహించింది. ఈ మస్జిదు గురించి వచ్చిన ఆరోపణలను గ్రామస్తులు తీవ్రంగా ఖండిస్తున్నారు. గ్రామపెద్ద రమేష్ ప్రజాపతి కూడా ఈ ఆరోపణలను ఖండిస్తూ మస్జిదు స్థలాన్ని చట్టబద్దంగా సేకరించారని, తమగ్రామ ప్రజలే కాక చుట్టు ఉన్న గ్రామాల ప్రజలు మస్జిదు నిర్మాణానికి నిధులిచ్చారని తెలియజేశారు. ఈ మస్జిదు భూమిని కబ్జా చేయాలనుకుంటున్న వారికి, గ్రామస్తులకు మధ్య కోర్టులో కేసు నడుస్తోంది. అందుకే ఈ ఉగ్రవాద సంస్థల నిదులన్న ఆరోపణలతో వేధిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అంతేకాదు, దేశానికి ద్రోహం…

Read More

లవ్ జిహాద్ శుద్ధ అబద్ధమని ఒప్పుకున్న NIA

కేరళలో మతాంతర వివాహాలపై విచారణ జరిపిన నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజన్సీ లవ్ జిహాద్ కు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవని తేల్చి చెప్పింది. మతతత్వ శక్తుల అబద్ధ ప్రచారాలను బట్టబయలు చేసింది. కొన్ని సందర్భాలలో వధువు / వరుడు మతం మారడం జరిగినా అది వారి వ్యక్తిగత నిర్ణయమే కానీ కుట్రపూరితంగా లవ్ జిహాద్ లాంటిది ఏదీ లేదని స్పష్టం చేసింది. ఈ విషయమై సుప్రీంకోర్టులో మరో రిపోర్టు ఏదీ NIA సమర్పించడం లేదు. ఈ విషయంలో మరింత విచారణ అవసరం లేదంటూ కేసు క్లోజ్ చేసింది. లవ్ జిహాద్, కుట్రపూరితంగా మతం మార్చడానికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవని, మూడు కేసుల్లో  మతం మార్చడానికి జరిగిన ప్రయత్నాలు విఫలమైన సంఘటనలు కూడా తమ దృష్టికి వచ్చాయని, అవేవీ లవ్ జిహాద్ పరిధిలోకి రావని అధికారులు చెప్పారు.…

Read More

కాంగ్రెస్ లోకి వలసవస్తున్న బిజేపి నాయకులు

రాజస్థాన్ బిజేపి సీనియర్ నాయకుడు మాజీ కేంద్ర మంత్రి జస్వంత్ సింగ్ కుమారుడు మాన్వేంద్ర సింగ్ బిజేపిని వదిలి కాంగ్రెస్ లో చేరాడు. బిజేపి నేతలు పార్టీని వదిలి బయటకు రావడం ఎందుకు జరుగుతుందో ముఖ్యమంత్రి వసుంధర రాజే ఆలోచించుకోవాలని రాజస్థాన్ కాంగ్రెస్ నాయకుడు సచిన్ పైలట్ సలహా ఇచ్చాడు. మరోవైపు హర్యానాలోను ఇదే పరిస్థితి. మాస్టర్ హరిసింగ్, యోగేష్ సిహాగ్ లు పార్టీ వదిలి బయటకు వచ్చారు. నరేంద్రమోడీ ప్రభుత్వం అన్నివిధాల విఫలమైందని మాస్టర్ హరిసింగ్ ఆరోపించాడు. ప్రభుత్వంలో పారదర్శకత లేదని యోగేష్ ఆరోపించి రాజీనామా చేశాడు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహూల్ గాంధీని కలిసి మాన్వేంద్ర సింగ్ కాంగ్రెస్ లో చేరాడు. అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ తదితర నేతల సమక్షంలో ఆయన కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. రానున్న ఎన్నికల్లో మాన్వేంద్రసింగ్ వల్ల రాజపుత్…

Read More

‘ఫత్వా’ నిషేధంపై సుప్రీంకోర్టు స్టే

ఉత్తరాఖండ్ హైకోర్టు ఫత్వాలను నిషేధిస్తూ తీర్పు ఇచ్చింది. అన్ని మతసముదాయాలు, పంచాయతులు, గ్రూపులు ఎవరైనా గాని ఫత్వాలు జారీ చేయరాదంటూ ఉత్తరాఖండ్ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని మతవర్గాలకు అంటూ ఫత్వా అనే పదం వాడడం ఒక వైరుధ్యం. ఎందుకంటే ఫత్వా అనేది ఇస్లాంకు సంబంధించింది. ఇస్లాంకు సంబంధించిన ధార్మిక వ్యవహారాలకు సంబంధించి ఎవరైనా ఏదన్నా మార్గనిర్దేశం అడిగితే ముఫ్తీగా యోగ్యత ఉన్న మతపెద్ద ఆ వ్యవహారంలో తెలియజేసే అభిప్రాయమే ఫత్వా. ఆగస్ట్ 30 న ఉత్తరాఖండ్ హైకోర్టు ఈ ఉత్తర్వు జారీ చేసిన తర్వాత జమిఅతె ఉలమాయే హింద్ దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్ళింది. సుప్రీంకోర్టు ఈ విషయమై ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వానికి, హైకోర్టుకు నోటీసులు జారీ చేసింది. ఉత్తరాఖండ్ హైకోర్టు ఈ తీర్పు చెప్పడానికి కారణం, రూర్కీలోని లస్కర్ లో పంచాయతి ఒక రేప్…

Read More