హజ్ యాత్రకు ధరఖాస్తులు ప్రారంభం

హజ్ 2019 యాక్షన్ ప్లాన్ ను హజ్ కమిటి వెబ్ సైటులో ఉంచింది. hajcommittee.gov.in లో ఈ వివరాలున్నాయి. లాటరీ తేదీలు, చెల్లింపుల తేదీలు, హజ్ ఎంబార్కింగ్ పాయింట్ల వివరాలు, హజ్ ఫ్లయిట్ల వివరాలు అందులో ఉన్నాయి. హజ్ యాక్షన్ ప్లాన్ 2019 ప్రకారం హజ్ ధరఖాస్తులను అక్టోబర్ 18 నుంచి స్వీకరిస్తున్నారు. హజ్ కమిటీ వెబ్ సైటు నుంచి ధరఖాస్తు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. పాస్ పోర్టు కాపీ, అడ్వాన్స్ పేమెంట్ డీడీలతో ధరఖాస్తును నింపి నవంబర్ 17 లోగా ఇవ్వవలసి ఉంటుంది. ధరఖాస్తు చేసుకోవాలనుకునే వారు hajcommittee.gov.in వెబ్ సైటుకు వెళ్ళి, పేజికి ఎడమవైపున ఉన్న హజ్ 2019 కు సంబంధించిన డౌన్ లోడ్ల నుంచి Download Haj Application Form 2019 క్లిక్ చేయాలి. ఈ ధరఖాస్తు PDF ఫార్మాటులో స్క్రీనుపై కనిపిస్తుంది.…

Read More

హీరాగ్రూప్ పై ఆరోపణల వెల్లువ

హీరాగ్రూప్ సియిఓ, మేనేజింగ్ డైరెక్టర్ నౌహీరా షేఖ్ కు వ్యతిరేకంగా బలమైన సాక్ష్యాధారాలున్నాయని హైదరాబాద్ పోలీసు కమీషనర్ అంజనీకుమార్ చెప్పారు. వివిధ స్కీముల పేరుతో హీరాగ్రూప్ ప్రజలను మోసం చేసిందన్నారు. బలమైన సాక్ష్యాధారాలు ఉండడం వల్లనే ఆమెను అరెస్టు చేశామన్నారు. అక్టోబర్ 15వ తేదీన న్యూఢిల్లీలో ఆమెను అరెస్టు చేశారు. నాంపల్లి కోర్టులో ఆమెను ప్రవేశపెట్టడం జరిగింది. వివిధ పేర్లతో నౌహీరా షేఖ్ 15 కంపెనీలు నడుపుతున్నట్లు తెలిసింది. మహిళా ఎంపవర్మెంట్ పార్టీ పెట్టి కర్నాకట ఎన్నికల్లో అన్ని స్థానాలకు పోటీ చేశారామె. దేశవ్యాప్తంగా ఆమె కంపనీ కార్యాలయాలున్నాయి. విదేశాల్లో కూడా ఉన్నాయి. కర్నాటక ఎన్నికల తర్వాతి నుంచి హీరా గోల్డ్ కంపెనీ ఇన్వెస్టర్లకు ప్రాఫిట్లు పంపడం ఆపేసింది. అనేకమంది ఫిర్యాదులు చేశారు. ఆమెపై విచారణను కొట్టివేయాలని సుప్రీంకోర్టుకు పెట్టుకున్న అర్జీని కోర్టు తిరస్కరించింది. ఆమెకు వ్యతిరేకంగా…

Read More

బిజెపి కి దగ్గరవుతున్న కెసిఆర్ – హైదరాబాద్ లో వాజపేయి స్మారకం!

బాబ్రీ మస్జిద్ కూల్చివేతకు మూకలను రెచ్చగొట్టింది వాజపేయి అనీ… గుజరాత్ లో అమాయక ముస్లిం పౌరుల ఊచకోతను ప్రధాని హోదాలో చోద్యం చూసింది వాజపేయి అని భారతీయులందరికీ తెలుసు. అలాంటి వాజపేయికి ఒక స్మారక కేంద్రాన్ని, విగ్రహాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించడం పలు అనుమానాలకు దారి తీస్తోంది. ఈ స్మారక కేంద్రం కోసం ప్రభుత్వం ఎకరా స్థలం కేటాయిస్తుందట. గురువారం శాసనమండలి సమావేశానికి హాజరైన సందర్భంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు దివంగత వాజపేయికి ఘనంగా నివాళి అర్పించారు. దేశ ప్రధానుల్లో వాజపేయి విలక్షణమైన నేత అని, చరిత్రలో ఆయన చిరస్థాయిగా నిలిచిపోతారని సీఎం కేసీఆర్ కొనియాడారు. వాజపేయి అంతటి గొప్ప వ్యక్తి జీవితం గురించి ప్రజలకు తెలియజెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు. వాజపేయి స్మారకార్థం.. ఎకరం స్థలం కేటాయించాలని, విగ్రహం నెలకొల్పాలని రాష్ట్ర…

Read More

లౌకికవాదంపై బిజేపి దాడులను ఖండించిన ముస్లిం న్యాయవాదుల సంఘం

బిజెపి ప్రభుత్వం లౌకిక వాదంపై దాడి చేస్తోందని ఆంధ్రప్రదేశ్ ముస్లిం న్యాయవాదుల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు మహ్మద్ జవహర్అలీ మండిపడ్డారు. కాకినాడ ముస్లిం వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసోసియేషన్ పంక్షన్ హాలులో జరిగిన పాత్రికేయుల సమావేశంలో జవహర్అలీ మాట్లాడుతూ ప్రపంచంలో నే భారత దేశ రాజ్యాంగం అతిపెద్ద రాజ్యాంగా ప్రసిద్ధి గాంచింది. అటువంటి రాజ్యాంగాన్ని బిజెపి ప్రభుత్వం ఉల్లంఘిస్తూ, లౌకిక వాదానికి తిలోదకాలు ఇస్తూ అణగారిన వర్గాల మైనారిటీల మనోభావాలు దెబ్బతీస్తున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. అదేవిధంగా మైనారిటీ షెడ్యూల్ తెగల మనోభావాలను పణంగా పెట్టి ఓట్లు దండుకునే పరిస్థితి నెలకొందని అన్నారు. దీనిలో భాగంగానే బిజెపి ప్రభుత్వం ముస్లిం మైనారిటీలపై దాడి చేస్తుందన్నారు. మన దేశం ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్న తరుణంలో ఆయా సమస్యలు పక్కన పెట్టి మైనార్టీ లకు సంబంధించిన పర్సనల్ లా విషయాలలో జోక్యం చేసుకోవడాన్ని…

Read More

TRS ముస్లిములకు టిక్కట్లు నిరాకరిస్తున్నదని విమర్శలు

తెలంగాణాలో అసెంబ్లీ రద్దుచేసి ఎన్నికలకు సిద్ధమైన కేసీఆర్ 105 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. ఇందులో కేవలం ఇద్దరు మాత్రమే ముస్లిములున్నారు. ముస్లిములను రాజకీయాల్లోకి రానీయకూడదన్న నియమం ఏమైనా ఉందా? పద్నాలుగు శాతం రిజర్వేషన్ల గురించి మాట్లాడిన కేసీఆర్ తన చేతుల్లో ఉన్న టిక్కట్ల పంపిణీ విషయంలో అయినా ఈ సూత్రం పాటించవచ్చు కదా. గత అసెంబ్లీ ఎన్నికల్లోను టిఆర్ యస్ ముస్లిములకు టిక్కట్లు ఇవ్వలేదు. 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణాలో 12.68 శాతం ముస్లిములున్నారు. పది జిల్లాల్లో ఐదింట పెద్ద సంఖ్యలో ఉన్నారు. హైదరాబాదులో 43.45 శాతం. నిజమాబాద్ లో 15.35 శాతం. రంగారెడ్డిలో 11.66 శాతం. మెదక్లో 11.29 శాతం, అదిలాబాద్ లో 10.07 శాతం ఉన్నారు. 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కనీసం 35 నియోజకవర్గాల్లో ముస్లిములదే నిర్ణయాధికారం. అలాగే 17 లోక్…

Read More

ఓటర్ల జాబితాలో ముస్లిం పేర్ల తొలగింపుపై ఆందోళన

ఓటర్ల నమోదులో ముస్లింల మీద సాగుతున్న వివక్షను వెంటనే సరిదిద్డాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (CEO) ని ముస్లిం ఆలోచనాపరుల వేదిక (ఎంటిఎఫ్) కోరింది. సకాలంలో అలా జరగని పక్షంలో ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం ముందు ఆందోళనను చేపడతామని ఎంటిఎఫ్ కన్వీనర్ ఏ యం ఖాన్ యజ్దానీ ఒంగోలులో హెచ్చరించారు. ఆంధ్రా ముస్లింలు – రాజకీయ దశదిశ -2019 అనే పేరుతో ఎంటిఎఫ్ శని, ఆదివారాల్లో ఒంగోలులో ముస్లిం రాజకీయ మేధోమధన సదస్సు నిర్వహించింది. పదమూడు జిల్లాల నుండి దాదాపు 65 మంది ముస్లిం ఆలోచనాపరులు పాల్గొన్న ఈ సదస్సులో రాజకీయ, ఆర్ధిక, సాంస్కృతిక రంగాలలో ముస్లింలకు జరుగుతున్న అన్యాయాల మీద వక్తలు ఆందోళన వ్యక్తం చేశారు. దేశ జనాభాలో ముస్లింలు 14.2 శాతం వున్నారని అధికారిక గణాంకాలు చెపుతుండగా, ఆంధ్రప్రదేశ్ ఓటర్ల జాబితాలో…

Read More

జలీల్ ఖాన్ కు వఖ్ఫ్ బోర్డ్ తో సరిపెట్టిన ఆంధ్రా ముఖ్యమంత్రి

ఆంధ్రా మంత్రివర్గంలో ఖాళీలు ఉన్నా, బిజెపి తో తెదెపా తెగతెంపులు చేసుకున్నా చంద్రబాబు నాయుడు మాత్రం ముస్లిమ్ సమాజానికి ఒక్క మంత్రిపదవి కూడా ఇచ్చేలా కనబడడం లేదు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇలా మొదటిసారి జరిగిందని పలువురు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. చంద్రబాబునాయుడు ముస్లిమ్ సమాజంపై ఇలా ఒక ప్రయోగం చేస్తున్నారని పలువురు భావిస్తున్నారు. అయితే ప్రస్తుతానికి చిన్నాచితకా పదవులు మాత్రం ఇవ్వడానికి ఓకే అన్నట్లు ఉంది పరిస్థితి. మండలి చైర్మన్-లుగా, పార్టీ విప్-లుగా చిన్నచిన్న పదవులు మాత్రం ముస్లిమ్ సమాజానికి చెందిననాయకులకు ఇస్తున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వఖ్ఫ్ బోర్డ్ లో నియామకాలు చేస్తోంది. విజయవాడ వెస్ట్ శాసనసభ్యుడు జలీల్ ఖాన్ ను వఖ్ఫ్ బోర్డ్ చైర్మన్ గా నియమించింది. బోర్డ్ సభ్యులను కూడా నామినేట్ చేసింది. ముస్లిమ్ సమాజంపట్ల ఈ నిర్లక్ష్య్ వైఖరితో స్పష్టమైన సంకేతం పంపుతున్నారని…

Read More

తెలంగాణా ఉర్దూ అకాడమీ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల

ఉర్దూ సబ్జక్టులో డిగ్రీ ఉన్న అభ్యర్థులకు తెలంగాణ ఉర్దూ అకాడమీ ఉద్యోగాలు ప్రకటించింది. ఉర్దూ అకాడమీలో గ్రేడ్ 1, గ్రేడ్ 2 ఆఫీసర్ల నియామకానికి ప్రకటన విడుదల చేసింది. మొత్తం 66 ఖాళీలున్నాయి. గ్రేడ్ 1 ఆఫీసర్ ఖాళీలు 6, గ్రేడ్ 2 ఆఫీసర్ ఖాళీలు 60 ఉన్నాయి. ముఖ్యమంత్రి కార్యాలయం, అసెంబ్లీ, శాసనమండలి, జనరల్ ఆడ్మినిస్ట్రేషన్, మైనారిటీ వెల్ఫేర్, ఐటి అండ్ పబ్లిక్ రిలేషన్స్ లలో గ్రేడ్ 1 అధికారులను నియమిస్తున్నారు. ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఉర్దూ ఒక సబ్జక్టుగా డిగ్రీ పూర్తి చేసి, మెట్రిక్యులేషన్ స్థాయిలో తెలుగు ఒక సబ్జక్టుగా చదివి ఉండాలి. జులై 1 నాటికి 21 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాల మధ్య వయసులో ఉన్నవారు ధరఖాస్తు చేసుకోవచ్చు. ధరఖాస్తు ఫీజు: గ్రేడ్ 1 ఆఫీసర్లకు 600 రుపాయలు,…

Read More

మస్జిదు కోసం భూమి ఇచ్చిన హిందూ సోదరులు

మతోన్మాద శక్తులు మతవర్గాల మధ్య చిచ్చుపెట్టాలని ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ దేశంలో మతసామరస్యానికి అత్యుత్తమ ఉదాహరణలు మన ముందుకు వస్తూనే ఉన్నాయి. బోధన్ నుంచి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్న గ్రామం భవానీపేట్ లో ముస్లిముల ఇళ్ళు 60 ఉన్నాయి. ఇప్పటి వరకు ఈ ఊళ్ళో మస్జిదు లేదు. మస్జిదు లేనందువల్ల నమాజు కోసం దూర ప్రాంతాలకు వెళ్ళవలసి వచ్చేది. ముస్లిముల ఇళ్ళకు వచ్చే బంధువులు కూడా మస్జిదు లేకపోవడం చూసి చింతించేవారు. ముస్లిము సోదరుల ఆరాధనకు మస్జిదు లేకపోవడం చూసిన స్థానిక హిందు సోదరులు ఒక సమావేశం నిర్వహించి మస్జిదు నిర్మించాలని నిర్ణయించారు. మాజీ ఎంపిటీసి పోచిరెడ్డి తన భూమి మస్జిదుకు ఇస్తానని ముందుకు వచ్చారు. మస్జిదు నిర్మాణానికి నడుం కట్టిన హిందు సోదరులు పెట్టిన షరతేమిటంటే ముస్లిములు క్రమం తప్పకుండా నమాజు చదవాలని!…

Read More

అరబ్ షేఖ్ ఔదార్యంతో లింబాద్రి కి కొత్త జీవితం

నిజామాబాద్ జిల్లా ఆర్మూరుకు చెందిన లింబాద్రి పొట్టకూటి కోసం దుబాయ్ వెళ్ళాడు. ఒక అరబ్ షేక్ వద్ద పనిచేసేవాడు. అతను దుబాయ్ వెళ్ళింది 1995లో. 2007లో జరిగిన ఒక ఘర్షణలో దుబాయ్ కి చెందిన ఒక అరబ్బు వృద్ధుడు లింబాద్రి చేతిలో చనిపోయాడు. లింబాద్రి జైలు పాలయ్యాడు. దుబాయ్ లో హత్యకు మరణమే శిక్ష. అయితే హతుని దగ్గరి బంధువులు క్షమాభిక్ష ప్రసాదిస్తే అతను విడుదల కావచ్చు. రక్తపరిహారం చెల్లించి కూడా విడుదల కావచ్చు. కాని ఆ రెండు లింబాద్రికి సాధ్యం కాలేదు. అతనితో ఎలాంటి పరిచయం లేక పోయినా లింబాద్రి దయానీయ స్థితి చూసి ఒక అరబ్బు షేకు చలించిపోయాడు. అతని తరఫున తాను కోటి 80 లక్షల రూపాయల రక్తపరిహారం చెల్లించి లింబాద్రికి విముక్తి లభించేలా చేశాడు. న్యాయస్థానం లింబాద్రికి క్షమాభిక్ష ప్రసాదించి విడుదల…

Read More