రవిశంకర్ కు దీటైన జవాబిచ్చిన పర్సనల్ లా బోర్డు

మందిరానికి వ్యతిరేకంగా కోర్టు తీర్పు వస్తే అమలు చేయడం కష్టమని, దేశంలో రక్తపాతం జరుగుతుందని, దేశం మరో సిరియాగా మారొచ్చంటూ శ్రీశ్రీ రవిశంకర్ చేసిన వ్యాఖ్యలకు ముస్లిం పర్సనల్ లా బోర్డు దీటైన జవాబిచ్చింది. “దేశంలో ప్రజలు కోర్టు తీర్పుకు కట్టుబడి ఉంటారని, శాంతి భద్రతలను కాపాడే బాధ్యత భద్రతా దళాలద”ని జవాబిచ్చింది. కోర్టు బయట రాజీ పడాలంటూ శ్రీ శ్రీ రవిశంకర్ తీవ్రంగా బెదిరించిన తర్వాత పర్సనల్ లా బోర్డు ప్రతిస్పందన వచ్చింది. ఎవరి వద్దనైనా పరిష్కారం ఫార్మూలా ఏదైనా ఉంటే సుప్రీంకోర్టుకు సమర్పించాలని పర్సనల్ లా బోర్డు ఎగ్జిక్యూటివ్ సభ్యుడు మౌలానా ఖాలిద్ రషీద్ ఫారంగీ చెప్పారు. కోర్టు తీర్పు తర్వాత సిరియా వంటి పరిస్థితి వస్తుందన్న మాటలను కొట్టిపారేస్తూ, సిరియాలో బయటి దేశాల జోక్యం వల్ల అంతర్యుద్ధం జరుగుతుందని, బాబరీ మస్జిదు సమస్యలో…

Read More

భారత చరిత్ర కాషాయీకరణ ప్రయత్నాలు ప్రారంభం

భారతదేశం అనేక దాడులు, వలసలతో ఏర్పడిన దేశం. బహుళ మతాలు, సంస్కృతులు, భాషల దేశం. కానీ చరిత్రను వక్రీకరించి దిశగా ప్రధాని ఒక కమిటీ వేశారని తెలుస్తోంది. భారతదేశం హిందురాష్ట్రగా మార్చే క్రమంలో భాగమే ఈ కమిటీ అని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రాచీన చరిత్ర తిరగ రాయడానికే ఈ కమిటీ వేశారని కమిటి చైర్మన్ కే.ఎన్.దీక్షిత్ చెప్పినట్లు తెలుస్తోంది. అలాగే సాంస్కృతిక శాఖ మంత్రి మహేష్ శర్మ కమిటి ఉద్దేశ్యాన్ని స్పష్టంగా ప్రకటించేశాడు. భారత చరిత్ర తిరగరాసే ప్రయత్నాల్లో భాగమే ఇదని చెప్పకనే చెప్పేశాడు. రాయిటర్స్ వార్తా సంస్థతో మాట్లాడుతూ ఆరెస్సెస్ ప్రతినిథి మన్మోహన్ వైద్య భారత చరిత్ర అసలు రంగు కాషాయమేనని అన్నాడు. సాంస్కృతిక మార్పులు తీసుకురావడానికి చరిత్రను తిరగరాయాలని చెప్పాడు. ఆరెస్సెస్ చరిత్ర పరిశోధన విభాగం అధిపతి బాల్ ముకుంద్ పాండే తాను క్రమం…

Read More

హాదియా పెళ్ళి చట్టబద్దమేనన్న సుప్రీంకోర్టు

తన ఇష్టమైన మతాన్ని ఎన్నుకునే స్వేచ్ఛ, తన జీవిత భాగస్వామిని ఎంచుకునే స్వేచ్ఛ భారత బహుళత్వానికి ప్రాణం వంటివని సుప్రీంకోర్టు చెప్పింది. హాదియా కేసులో సుప్రీంకోర్టు కేరళ హైకోర్టు తీర్పును కొట్టివేసింది. హాదియా పెళ్ళి చెల్లదంటూ కేరళ హైకోర్టు ఇంతకు ముందు తీర్పు చెప్పింది. హాదియా, షఫీ జహాంల పెళ్ళిని హైకోర్టు రద్దు చేయవలసింది కాదని భారత ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రాతో పాటు మరో ఇద్దరు న్యాయమూర్తులున్న ధర్మాసనం అభిప్రాయపడింది. సుప్రీంకోర్టులో కూడా హాదియా పెళ్ళి రద్దు చేయించే ప్రయత్నాలు న్యాయవాదులు చేశారు కాని సుప్రీంకోర్టు వ్యక్తిగత స్వేచ్ఛల విషయంలో ఆ వాదనలను అంగీకరించలేదు. పాతికేళ్ళ వయసున్న యువతి తన ఇష్టప్రకారం పెళ్ళి చేసుకోలేకపోవడం, ఆమె బలహీనురాలని, ఒత్తిడికి లొంగిపోతుందంటు హైకోర్టు వ్యాఖ్యానించడం, పెళ్ళి వంటి ముఖ్యమైన నిర్ణయాల్లో తల్లిదండ్రుల ఆమోదం చాలా అవసరమని చెప్పడం,…

Read More

దాద్రి నిందితులందరికీ బెయిల్!

ఉత్తరప్రదేశ్ దాద్రీలో ఆఖ్లాఖ్ పై మత విద్వేష గూండాలు దాడి చేసి చంపిన దుర్ఘటన జరిగి రెండేళ్ళయ్యింది. ఈ సంఘటన జరిగింది 2015 సెప్టెంబరు 28న. ఆఖ్లాఖ్ ఇంట్లో గొడ్డుమాంసం తిన్నారని మత విద్వేష శక్తులు మైకులో చేసిన ప్రకటన తర్వాత ఈ హత్యాకాండ జరిగింది. ఆఖ్లాఖ్, అతని కుమారుడు దానిష్, ఆ కుటుంబంలోని మహిళలు అందరిపై గుంపు దాడి చేసింది. దాడిలో ఆఖ్లాఖ్ చనిపోయాడు. ఇంత దారుణానికి కారణమేమిటి? ఆఖ్లాఖ్ ఇంట ఉన్న మాంసం గొడ్డు మాంసం కాదని, అది మేకమాంసమని తర్వాత ఫోరెన్సిక్ విచారణలో తేలింది. కాని ఏడాది తర్వాత వచ్చిన మరో రిపోర్ట్ లో ఆ మాంసం గొడ్డుమాంసమేనని చెప్పారు. ఈ దుర్ఘటన జరిగిన వెంటనే వివిధ సెక్షన్ల క్రింద కేసులు నమోదయ్యాయి. పోలీసులు 20 మందిని అరెస్టు చేశారు. అందులో ఇద్దరు…

Read More

ట్రంప్ ను ఐసిస్ తో పోల్చిన లండన్ మేయర్ సాదిఖ్ ఖాన్

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఉగ్రవాద సంస్థ ఐయస్ఐయస్ వంటి భాష వాడుతున్నారని లండన్ మేయర్ సాదిక్ ఖాన్ విమర్శించారు. ముస్లిములు అమెరికాలో ప్రవేశించకుండా సరిహద్దులు పూర్తిగా మూసేయాలని డోనాల్డ్ ట్రంప్ అనడాన్ని ఉటంకిస్తూ లేబర్ పార్టీ కాన్ఫరెన్సులో సాదిక్ ఖాన్ ఈ మాటలు అన్నారు. అమెరికా అధ్యక్షుడితో ఈ విషయమై తనకు వాదన ఇష్టం లేదని సాదిఖ్ ఖాన్ అన్నారు. ముస్లిములు అమెరికాలో ప్రవేశించకుండా పూర్తిగా మూసేయాలని పిలుపునిచ్చిన డోనాల్డ్ ట్రంప్ లండన్ మేయరు సాదిక్ ఖాన్ అందుకు మినహాయింపని చెప్పడంతో మేయరు మరింత ఆగ్రహించారు. తాను మినహాయింపేమీ కాదని చెబుతూ, “ట్రంప్ ఏం మాట్లాడుతున్నారో కాస్త ఆలోచించుకోవాలని” అన్నారు. “ఎందుకంటే మీరు మాట్లాడుతున్నది ఐయస్ఐయస్ భాషలా ఉంది” అని వేలెత్తి చూపారు. పాశ్చాత్యులు ఇస్లామ్ ను ద్వేషిస్తారని ఐయస్ఐయస్ చెబుతుంది. అమెరికా అధ్యక్షుడిగా మీరు కూడా…

Read More

ఒక్క ముస్లిమ్ సభ్యుడూ లేని తెదేపా పొలిట్ బ్యూరో

ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలుగుదేశం పోలిట్ బ్యూరో సభ్యుల పేర్లు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముస్లిములు దాదాపు పదిశాతం ఉన్నప్పటికీ ఒక్క ముస్లిమ్ పేరుకు  కూడా అందులో చోటు దక్కలేదు. చంద్రబాబునాయుడు మంత్రివర్గంలో కూడా ఒక్క ముస్లిమ్ పేరు కనబడదు. తెలుగుదేశానికి చెందిన ఒక నాయకుడు ఈ విషయమై మాట్లాడుతూ నంద్యాల ఎన్నికల్లో పార్టీకి ముస్లింలు పూర్తి మద్దతు ఇచ్చినా మరోసారి మోసపోయామని అన్నాడు. నిజానికి నంద్యాల ఎన్నికల వరకు చంద్రబాబునాయుడుకు ముస్లిములు అస్సలు గుర్తుకు రాలేదని, నంద్యాల ఎన్నికల కోసమే ఎన్ ఎం డీ ఫారూక్ ను శాసనమండలి ఛైర్మన్ గా నియమించారని, ఇచ్చిన ఒకట్రెండు పదవులు కూడా ముస్లిమ్ ఓట్ల కోసమే చేశారన్న ఆరోపణలు బలంగా వినిపించాయి. నంద్యాల ఎన్నికలు ముగియగానే మరిచిపోయారని, 2014 ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ కేవలం ఒకే ఒక్క…

Read More

సింగపూర్ మొదటి మహిళా అధ్యక్షురాలిగా ఎన్నికైన హలీమా యాఖూబ్

సింగపూర్ అధ్యక్షురాలిగా హలిమా యాకూబ్ ఎన్నికయ్యారు. సెప్టెంబరు 14వ తేదీన ఆమె పదవీబాధ్యతలు స్వీకరించారు. హలీమా యాకూబ్ తండ్రి భారతీయుడు, తల్లి మాలే మహిళ. తండ్రి కేవలం వాచ్ మెన్. ఎనిమిదేళ్ళ వయసులోనే తండ్రి మరణించారు. తల్లి అనేక కష్టాలకోర్చి పెంచి పెద్ద చేసింది. 1954లో జన్మించిన హలీమా సింగపూర్ చైనీస్ గర్ల్స్ స్కూలులో ఆమె చదువుకున్నారు. నేషనల్ యూనివర్శిటీ సింగపూర్ నుంచి న్యాయశాస్త్రం అభ్యసించారు. నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రేసులో లీగల్ ఆఫీసరుగా పనిచేశారు. 2001లో రాజకీయాల్లో ప్రవేశించిన హలీమా జురాంగ్ గ్రూప్ రిప్రజంటేషన్ కాన్సీట్యుయెన్సీ నుంచి పార్లమెంటుకు ఎన్నికయ్యారు. 2011లో ఆమె సింగపూరులో మంత్రిగా కేబినేటులో చేరారు. 2015లో సింగపూరులోని పి.ఏ.పి. పార్టీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కమిటీలో చేరారు. 2015 సాధారణ ఎన్నికల్లో పీపుల్స్ యాక్షన్ పార్టీ తరఫున పోటీ చేసిన ఒకే ఒక్క…

Read More

జనసంఘ్ నేతపై ఫేస్ బుక్‌ పోస్ట్ పెట్టినందుకు… ఐఏఎస్ అధికారి బదిలీ

రాయ్‌పూర్ : జనసంఘ్ నాయకుడు దీన్ దయాళ్ ఉపాధ్యాయపై సోషల్ మీడియా సైట్‌లో కామెంట్ చేస్తూ పోస్టు పెట్టారని చత్తీస్‌ఘడ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కారు ఓ ఐఏఎస్ అధికారిపై బదిలీ వేటు వేసింది. ప్రస్తుతం బీజేపీ నేతలు దీన్ దయాళ్ ఉపాధ్యాయ శత జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్న వేళ చత్తీస్‌ఘడ్ రాష్ట్రంలో పనిచేస్తున్న 2012 బ్యాచ్ ఐఏఎస్ అధికారి శివ్ అనంత్ తయాల్‌ “ఈయన గురించి ఎంతో వెతికాను కానీ ఈయన చేసిన గొప్ప పనులు ఏమిటో నాకు తెలియడం లేదు” అంటూఫేస్ బుక్ లో ఓ పోస్టు పెట్టారు. అంతే…సదరు పోస్టు పెట్టిన ఐఏఎస్ అధికారిపై చర్యలు తీసుకోవాలని బీజేపీ నేతలు డిమాండు చేశారు. దీనిపై స్పందించిన బీజేపీ రాష్ట్ర సర్కారు కాంకేర్ జిల్లా పరిషత్ సీఈఓగా పనిచేస్తున్న శివ్ అనంత్ తయాల్…

Read More

బీజేపీ ఎమ్మెల్యేకు యూపీ గవర్నరు ప్రచారం…రాజ్యాంగ విధులకు తూట్లు

ఉత్తరప్రదేశ్ : ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర గవర్నరు అయిన రామ్ నాయక్ ఓ బీజేపీ ఎమ్మెల్యేకు మద్ధతుగా ప్రజల్లో ప్రచారం చేసి వివాదాస్పదంగా నిలిచారు. గవర్నరుగా రాజ్యాంగ విధిని నిర్వహిస్తున్న రామ్ నాయక్ ఫిలిబిత్ పట్టణంలో జరిగిన బహిరంగ సభలో బీజేపీ ఎమ్మెల్యే రాంశరణ్ వర్మకు మద్ధతుగా ప్రచారం చేయడమే కాకుండా ఆయన చేసిన మంచి పనులకు మద్ధతు ఇవ్వాలని ప్రజలను కోరి విమర్శల పాలయ్యారు. బీజేపీ ఎమ్మెల్యే రాంశరణ్ భవనాలు, మరుగుదొడ్లు, బస్ స్టేషన్లు, స్కూలు భవనాలు నిర్మించి మంచి పనులు చేశారని గవర్నరు కితాబునిచ్చారు. తాను గవర్నరుగా ఎవరికి ఓటు వేయాలో చెప్పడం తగదంటూనే బీజేపీ పార్టీ నేతలా మాట్లాడారు. ఎమ్మెల్యే నిధులు రూ.6కోట్లతో చేపట్టిన పనులకు గవర్నరు శంకుస్థాపన చేసి ఈ వ్యాఖ్యలు చేశారు.…

Read More

గో తీవ్రవాద బాధిత కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వాలని గవర్నరుకు వినతి

అహ్మదాబాద్ : గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ సమీపంలోని వట్వా గ్రామంలో ఆవును రవాణా చేశారనే ఆరోపణతో ముహమ్మద్ అయూబ్ కుటుంబంపై దాడి చేసి చంపిన కేసులో బాధిత కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వాలని సోషల్ డెమోక్రాటిక్ పార్టీ ఆఫ్ ఇండియా గుజరాత్ గవర్నరు, జిల్లా కలెక్టర్లకు వినతిపత్రం సమర్పించింది. అయూబ్ (29), సమీర్ షేఖ్ (36) లనే ఇద్దరిపై దాడి చేసి దారుణంగా హతమార్చారు.

Read More