TRS ముస్లిములకు టిక్కట్లు నిరాకరిస్తున్నదని విమర్శలు

తెలంగాణాలో అసెంబ్లీ రద్దుచేసి ఎన్నికలకు సిద్ధమైన కేసీఆర్ 105 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. ఇందులో కేవలం ఇద్దరు మాత్రమే ముస్లిములున్నారు. ముస్లిములను రాజకీయాల్లోకి రానీయకూడదన్న నియమం ఏమైనా ఉందా? పద్నాలుగు శాతం రిజర్వేషన్ల గురించి మాట్లాడిన కేసీఆర్ తన చేతుల్లో ఉన్న టిక్కట్ల పంపిణీ విషయంలో అయినా ఈ సూత్రం పాటించవచ్చు కదా. గత అసెంబ్లీ ఎన్నికల్లోను టిఆర్ యస్ ముస్లిములకు టిక్కట్లు ఇవ్వలేదు. 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణాలో 12.68 శాతం ముస్లిములున్నారు. పది జిల్లాల్లో ఐదింట పెద్ద సంఖ్యలో ఉన్నారు. హైదరాబాదులో 43.45 శాతం. నిజమాబాద్ లో 15.35 శాతం. రంగారెడ్డిలో 11.66 శాతం. మెదక్లో 11.29 శాతం, అదిలాబాద్ లో 10.07 శాతం ఉన్నారు. 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కనీసం 35 నియోజకవర్గాల్లో ముస్లిములదే నిర్ణయాధికారం. అలాగే 17 లోక్…

Read More

NRC లో పేరు లేకపోయినా వోటు వేయవచ్చన్న ఎన్నికల కమిషన్

ఆగష్టు 1వ తేదీన ఎన్నికల కమీషన్ ఒక ముఖ్యమైన ప్రకటన చేసింది. అస్సాంలో ప్రచురించిన ఎన్నార్సీలో పేర్లు లేని వారు కూడా ఎన్నికల చట్టాల ప్రకారం ఓటు వేయడానికి అర్హులై ఉంటే ఓటు వేయవచ్చని వివరణ ఇచ్చింది. రానున్న సాధారణ ఎన్నికల లోపు ఎన్నార్సీ తుది జాబితా సిద్ధం కాకపోతే వీళ్ళకు ఓటు వేసే హక్కు ఉంటుంది. ఎన్నికల ప్రధానాధికారి ఓ.పి.రావత్ ఈ విషయం తెలియజేశారు. ఓటర్ల నమోదు ప్రక్రియకు NRC కి సంబంధం లేదని అన్నారు. 2019 ఎన్నికల్లో ఓటర్ల నమోదు విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటున్నామని అన్నారు. ప్రస్తుతం ప్రచురించింది ముసాయిదా NRC మాత్రమేనని అన్నారు. ఎన్నికల ప్రధానాధికారి చేసిన ఈ ప్రకటన మొత్తం ఎన్నార్సీ వ్యవహారంలో కీలక మలుపు కాబోతుంది. 40 లక్షల మంది ఎన్నార్సీలో పేర్లు లేనివారున్నారు. వీళ్ళల్లో చాలా మందికి…

Read More

టీచర్ల అవమానాలు తట్టుకోలేక ఆత్మహత్యకు ఒడిగట్టిన అర్ష్

కాన్పూర్ లోని ఢిల్లీ పబ్లిక్ స్కూలుకు చెందిన విద్యార్థి అర్ష్ ఆత్మహత్యా ప్రయత్నం చేశాడు. దానికి కారణం స్కూలు ప్రిన్సిపాలు, టీచర్లు. ముస్లిమ్ అయినందుకు ప్రతిరోజు అవమానపరుస్తూ, అనుమానిస్తూ, బ్యాగులు చెక్ చేస్తూ నరకం చూపించారీ ఉపాధ్యాయులు. దుర్బాషలాడ్డం, ఒంటరిగా ఉంచి శిక్షించడం జరిగేది. ఇతర విద్యార్థులెవ్వరూ తనతో మాట్లాడకుండా టీచర్లు అడ్డుకునేవారని, స్కూల్లో చేరి రెండు నెలలైనా టీచర్లు కట్టడి చేయడం వల్ల ఎవ్వరూ తనతో మాట్లాడేవారు కాదని ఆ అబ్బాయి తెలిపాడు. చివరకు అవమానాలు సహించలేక నిద్రమాత్రలు, ఫినైల్ తాగి ఆత్మహత్యా ప్రయత్నం చేశాడు. ఆ అబ్బాయి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

Read More

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ విద్యార్ధి ఎన్నికల్లో ‘లాల్-నీల్’ విజయభేరి

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ విద్యార్థి ఎన్నికల్లో హోరాహోరిగా పోటీ నడిచింది. వామపక్ష, దళిత, ముస్లిమ్ సమైక్యతతో ఏర్పడిన అలయెన్స్ ఆఫ్ సోషల్ జస్టిస్ తరఫున పోటీ చేసిన శ్రీరాగ్ ఘనవిజయం సాధించాడు. బారతీయ జనతాపార్టీకి అనుబంధ విద్యార్థి సంఘం ఏబివిపి అభ్యర్థి కే. పల్సానియా ఓడిపోక తప్పలేదు. అలయెన్స్ ఆఫ్ సోషల్ జస్టిస్ లో వివిధ విద్యార్థి సంఘాలున్నాయి. స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్, దళిత్ స్టూడెంట్స్ యూనియన్, ట్రయిబల్ స్టూడెంట్స్ ఫోరమ్, తెలంగాణ విద్యార్థి వేదిక, ముస్లిమ్ స్టూడెంట్స్ ఫెడరేషన్ మాత్రమే కాక సారూప్య భావాలు కలిగిన అనేకమంది మద్దతిచ్చారు. ఈ గ్రూపులు రిసెర్చ్ స్కాలర్ రోహిత్ వేములకు మద్దతుగా నిలబడిన గ్రూపులు. ఎన్నికల్లో దాదాపు అన్ని పదవుల్లోను అలయెన్స్ ఘనవిజయం సాధించింది. జనరల్ సెక్రటరీగా అలయెన్స్ కు చెందిన ఆరిఫ్…

Read More

జికా, డెంగ్యూ, హెపటైటిస్ లకు వ్యాక్సిన్ కనిపెట్టిన డా. ముంతాజ్

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది ప్రజలను పీడిస్తున్న భయంకరమైన వైరసులు జికా, డెంగ్యూ, హెపటైటిస్ సి లకు వ్యాక్సిన్ కనిపెట్టిన శాస్త్రవేత్తల బృందంలో బీహారుకు చెందిన డా. ముంతాజ్ నయ్యర్ ఒకరు. యూనివర్శిటీ ఆఫ్ సౌతాంప్టన్ లో ఈ పరిశోధన జరిగింది. ఈ పరిశోధనా పత్రంలో ఫస్ట్ ఆథర్ గా ఉన్న డా. ముంతాజ్ నయ్యర్ మాట్లాడుతూ తాను భారతదేశం నుంచి వచ్చాననీ, భారతదేశంలో వేలాది డెంగూ కేసులు ప్రతి సంవత్సరం రిపోర్టవుతాయని, ఈ పరిశోధన వారికి సాంత్వన కలిగిస్తుందని అన్నాడు. బీహారులోని ఒక చిన్న ఊరి నుంచి బ్రిటన్ వరకు వెళ్ళిన ముంతాజ్ నయ్యర్ సాధించిన విజయాలు అనేకమంది యువకులకు స్ఫూర్తి దాయకమైనవి. హైస్కూలు వరకు ఆయన చదువకున్న ఊరు ఒక కుగ్రామం. 2016 వరకు అక్కడ కనీసం కరంటు సరఫరా కూడా లేదు. అంటే రాత్రులు చీకట్లోనే…

Read More

పదకొండు రూపాయలకే సివిల్స్ కోచింగ్ ఇస్తున్న ముతి ఉర్ రహ్మాన్

కేవలం పదకొండు రూపాయలు మాత్రమే తీసుకుని ఐయేయస్, ఐపియస్ కోచింగ్ ఇస్తున్న ముతి ఉర్ రహ్మాన్ సమాజానికి చేస్తున్న సేవ అసాధారణమైనది. బడుగు బలహీనవర్గాల విద్యార్థులకు అవసరమైన కోచింగ్ ఆయన ఉచితంగానే అందిస్తున్నారని చెప్పాలి. సివిల్స్ కోచింగ్ ఇచ్చే కేంద్రాలు దేశమంతటా చాలా ఉన్నాయి. భారీగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఇలాంటి కోచింగ్ కేంద్రాల్లో చేరాలంటే పేద విద్యార్థులకు సాధ్యం కాదు. సివిల్ సర్వీసెస్ అధికారులుగా సమాజానికి సేవ చేసే అవకాశం వారికి దొరకదు. అలాంటి పరిస్థితుల్లో ముతి ఉర్ రహ్మాన్ ఆపద్బాంధవుడిలా పేదవిద్యార్థులను ఆదుకుంటున్నారు. బీహారులోని పాట్నాకు చెందిన ముతి ఉర్ రహ్మాన్ ఐయేయస్, ఐపియస్ పరీక్షలు రాయాలనుకునే వారికి గురు రహ్మాన్ గా పేరు సంపాదించుకున్నారు. భారీగా ఫీజులు చెల్లించలేని పేద విద్యార్థులకు కేవలం పదకొండు రూపాయల ఫీజుతో ముతి ఉర్ రహ్మాన్ నాణ్యమైన కోచింగ్…

Read More

ఢిల్లీలో ప్రభుత్వ పాఠశాలలకు హైటెక్ సదుపాయాలు

న్యూఢిల్లీ : ఢిల్లీలో జరిగిన ఎన్నికల్లో విజయదుందుభి మోగించి అధికారంలోకి వచ్చిన ఆమ్ ఆద్మీపార్టీ విద్యావ్యవస్థ అభివృద్ధికి చర్యలు చేపట్టింది. అత్యున్నత ప్రమాణాలతో ప్రభుత్వ ఉన్నతపాఠశాలలను తీర్చిదిద్దేందుకు ఆప్ సర్కారు కార్యక్రమాలు చేపట్టింది. 500 పాఠశాలల్లో విద్యార్థుల తల్లిదండ్రుల, ఉపాధ్యాయులతో సమావేశాలు జరిపి విద్యావ్యవస్థలో కీలక మార్పులు తీసుకువచ్చేందుకు ప్రణాళిక రూపొందించింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఒక్కో తరగతి గదికి కేవలం 35 మంది విద్యార్థులు ఉండేలా చర్యలు చేపట్టింది. ప్రభుత్వ పాఠశాలల భవనాలు ప్రైవేటు పాఠశాలలను తలపించేలా నిర్మాణం చేపట్టిన ఆప్ సర్కారు అందరి ప్రశంసలు అందుకుంటోంది.

Read More