పెరుగుతున్న చమురు ధరలు… ఆర్థిక సంక్షోభం నుంచి కోలుకోనున్న గల్ఫ్ దేశాలు

లండన్: అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు ధరలు పెరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా విశ్లేషకుల అంచనాలకు భిన్నంగా చమురు ధరలు పెరిగాయి. గత వారం అల్జీరియాలో జరిగిన వివిధ దేశాలు నిర్వహించిన సమావేశంలో చమురు ఉత్పత్తిలో కోత విధించేందుకు సౌదీ అరేబియాతోపాటు పలు గల్ఫ్ దేశాలు అంగీకరించాయి. గత రెండేళ్లుగా క్షీణిస్తున్న ధరలను ఊతం అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాయి. రోజుకి 7.5 లక్షల బ్యారళ్ల మేర చమురు ఉత్పత్తిలో కోత పెట్టేందుకు సౌదీ అరేబియా అంగీకరించింది. ఈ నేపథ్యంలో న్యూయార్క్‌ మార్కెట్లో చమురు బ్యారల్‌ దాదాపు 1 శాతం ఎగసి 48.70 డాలర్లకు చేరింది.

Read More

ఫోర్బ్స్ కోటీశ్వరుల జాబితాలో నలుగురు భారతీయ ముస్లిమ్ లు

న్యూఢిల్లీ : ఫోర్బ్స్ జాబితాలోకి ఎక్కిన వందమంది భారత బిలియనీర్ల జాబితాలో నలుగురు ముస్లిమ్ పారిశ్రామికవేత్తలున్నారు. ఇందులో ముగ్గురు పాత వారు కాగా, దక్షిణ భారతదేశానికి చెందిన యువ NRI డాక్టర్ షంషీర్ వాయలీల్ తాజాగా బిలియనీర్ల జాబితాలోకి ఎక్కారు. 39 ఏళ్ల షంషీర్ వందమంది ఫోర్బ్స్ యువ ధనవంతుల జాబితాలో మూడోవ్యక్తిగా నిలిచారు. అజీమ్ ప్రేమ్ జీ, ఎంఏ యూసుఫ్ అలీ, యూసుఫ్ హమీద్ ల పేర్లు ఫోర్బ్స్ జాబితాలో కొనసాగుతున్నారు. డాక్టర్ షంషీర్ మన భారతదేశంతోపాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లలో వీపీఎస్ హెల్త్ కేర్ పేరిట నెట్ వర్కింగ్ హాస్పిటల్స్, క్లినిక్ లు, ఫార్మాస్యూటికల్ తయారీ యూనిట్లు, ఫార్మసీ కేంద్రాలు నిర్వహిస్తున్నారు. 1.27 బిలియన్ల సంపదతో షంషీర్ ఫోర్బ్స్ జాబితాలో 98వ స్థానంలో నిలిచారు. వైద్యరంగంలో డాక్టర్ షంషీర్ చేసిన సేవలకు గుర్తింపుగా మన…

Read More