సింగపూర్ మొదటి మహిళా అధ్యక్షురాలిగా ఎన్నికైన హలీమా యాఖూబ్

సింగపూర్ అధ్యక్షురాలిగా హలిమా యాకూబ్ ఎన్నికయ్యారు. సెప్టెంబరు 14వ తేదీన ఆమె పదవీబాధ్యతలు స్వీకరించారు. హలీమా యాకూబ్ తండ్రి భారతీయుడు, తల్లి మాలే మహిళ. తండ్రి కేవలం వాచ్ మెన్. ఎనిమిదేళ్ళ వయసులోనే తండ్రి మరణించారు. తల్లి అనేక కష్టాలకోర్చి పెంచి పెద్ద చేసింది. 1954లో జన్మించిన హలీమా సింగపూర్ చైనీస్ గర్ల్స్ స్కూలులో ఆమె చదువుకున్నారు. నేషనల్ యూనివర్శిటీ సింగపూర్ నుంచి న్యాయశాస్త్రం అభ్యసించారు. నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రేసులో లీగల్ ఆఫీసరుగా పనిచేశారు. 2001లో రాజకీయాల్లో ప్రవేశించిన హలీమా జురాంగ్ గ్రూప్ రిప్రజంటేషన్ కాన్సీట్యుయెన్సీ నుంచి పార్లమెంటుకు ఎన్నికయ్యారు. 2011లో ఆమె సింగపూరులో మంత్రిగా కేబినేటులో చేరారు. 2015లో సింగపూరులోని పి.ఏ.పి. పార్టీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కమిటీలో చేరారు. 2015 సాధారణ ఎన్నికల్లో పీపుల్స్ యాక్షన్ పార్టీ తరఫున పోటీ చేసిన ఒకే ఒక్క…

Read More

14 సం. కే విమానం నడిపి ప్రపంచ రికార్డ్ సాధించిన మన్సూర్

షార్జాలో పుట్టి పెరిగిన 14 సంవత్సరాల కుర్రాడు మన్సూర్ అనీస్ ప్రపంచంలోనే పిన్నవయస్కుడైన పైలట్. కేవలం 7 సంవత్సరాల వయసులోనే ఈ కుర్రాడి శిక్షణ ప్రారంభమైంది. న్యూఢిల్లీలో ఆ కుర్రాడి మేనమాట ఉంటారు. ఆయన ప్రొఫెషనల్ పైలట్. తన మేనల్లుడికి కంప్యూటర్ ఫ్లయిట్ సిమ్యులేటర్ పరిచయం చేశారు. కంప్యూటరు సిమ్యులేటరుతో విమానాన్ని ఎలా నడపాలో నేర్పడం ప్రారంభించారు. మన్సూర్ అనీస్ కు విమానం నడపడం చాలా నచ్చింది. పదమూడేళ్ళ వయసులో తాను పైలట్ కావాలని నిర్ణయించుకున్నాడు. తన తల్లితో కలిసి కెనడాలోని లాంగ్లే సిటీకి వెళ్ళాడు. అక్కడ ఏఏఏ ఏవియేషన్ అకాడమీలో ఫ్లయింగ్ శిక్షణ కోసం చేరాడు. ఇంత చిన్న వయసులో ఉన్న కుర్రాడిని చేర్చుకోవడం కుదరదని చీఫ్ ఫ్లయిట్ ఇనస్ట్రక్టర్ చెప్పాడు. కాని మన్సూర్ నిరుత్సాహ పడలేదు. ఫ్లయింగ్ సిమ్యులేషన్ లో చాలా నేర్చుకున్నాడు. విమానాన్ని…

Read More