70 లక్షల ఉద్యోగం సాధించిన ఎలక్ట్రీషియన్ కుమారుడు అమీర్ అలీ

జామియా మిల్లియా ఇస్లామియా విద్యార్థి ముహమ్మద్ ఆమిర్ అలీ ఏటా దాదాపు 70 లక్షల జీతంతో ఉద్యోగం లభించింది. జామియాలో మెకానికల్ ఇంజనీరింగ్ డిప్లమా చదువుతున్న ఆమిర్ అలీ బి.టెక్ లో ప్రవేశించడానికి ప్రయత్నించి విఫలమయ్యాడు. కాని విజ్ఞాన సాంకేతిక శాస్త్రాల పట్ల అతనికి ఉన్న ఆసక్తి కొత్త కొత్త విషయాలను కనుగొనే కుతూహలాన్ని పెంచింది. అతని తండ్రి జామియాలో ఎలక్ట్రీషియన్. ఎలక్ట్రిక్ పరికరాలు పనిచేసే తీరు గురించి అనేక ప్రశ్నలు వేసేవాడు. డిప్లమా చదువుతున్న అలీ ఎలక్ట్రికల్ వెహికల్స్ కు సంబంధించిన ప్రాజెక్టుపై పనిచేయడం ప్రారంభించాడు. ఆ ప్రాజెక్టు అమెరికాలోని కంపెనీ దృష్టిని ఆకర్షించింది. నార్త్ కరోలినాలోని ఫ్రిస్సన్ మోటార్ వర్క్స్ లో బ్యాటరీ మేనేజిమెంట్ సిస్టమ్ ఇంజనీరుగా ఉద్యోగమిచ్చింది. ఎలక్ట్రిక్ వాహనాలను ఎలాంటి ఖర్చు లేకుండా చార్జింగ్ చేసే ప్రాజెక్టుపై ప్రస్తుతం పనిచేస్తున్నాడు.

Read More

దాద్రి నిందితులందరికీ బెయిల్!

ఉత్తరప్రదేశ్ దాద్రీలో ఆఖ్లాఖ్ పై మత విద్వేష గూండాలు దాడి చేసి చంపిన దుర్ఘటన జరిగి రెండేళ్ళయ్యింది. ఈ సంఘటన జరిగింది 2015 సెప్టెంబరు 28న. ఆఖ్లాఖ్ ఇంట్లో గొడ్డుమాంసం తిన్నారని మత విద్వేష శక్తులు మైకులో చేసిన ప్రకటన తర్వాత ఈ హత్యాకాండ జరిగింది. ఆఖ్లాఖ్, అతని కుమారుడు దానిష్, ఆ కుటుంబంలోని మహిళలు అందరిపై గుంపు దాడి చేసింది. దాడిలో ఆఖ్లాఖ్ చనిపోయాడు. ఇంత దారుణానికి కారణమేమిటి? ఆఖ్లాఖ్ ఇంట ఉన్న మాంసం గొడ్డు మాంసం కాదని, అది మేకమాంసమని తర్వాత ఫోరెన్సిక్ విచారణలో తేలింది. కాని ఏడాది తర్వాత వచ్చిన మరో రిపోర్ట్ లో ఆ మాంసం గొడ్డుమాంసమేనని చెప్పారు. ఈ దుర్ఘటన జరిగిన వెంటనే వివిధ సెక్షన్ల క్రింద కేసులు నమోదయ్యాయి. పోలీసులు 20 మందిని అరెస్టు చేశారు. అందులో ఇద్దరు…

Read More

బాంబు ప్రేలుడు బాధితులకు ఉచితసేవలందించిన ముస్లిమ్ వైద్యునిపై దాడి

మాంచెస్టర్ బాంబు పేలుడు సంఘటనలో గాయపడిన వారికి స్వచ్చందంగా సేవలందించిన ముస్లిమ్ సర్జన్ పై దాడి జరిగింది. నాసర్ కుర్దీ బాంబుపేలుడు బాధితులకు సేవలందించిన వైద్యుడు. ఆయన నమాజుకు వెళుతుండగా వెనుక నుంచి వచ్చిన ముష్కరుడు మెడపై కత్తితో బలంగా పొడిచాడు. వెంటనే ఆయన్ను ఆయన ఆర్ధోపెడిక్ సర్జన్ గా పనిచేసే ఆసుపత్రికే తీసుకెళ్ళారు. ఈ సంఘటన తర్వాత ఆయన మాట్లాడుతూ దేవుడి దయవల్ల బతికాను. ఆ కత్తిపోటు ఒక రక్తనాళంపై పడి ఉండవచ్చు, మెడ అనేది తలకు, శరీరానికి మధ్య ఉండే సున్నితమైన భాగం, అయినా అదృష్టవశాత్తు కేవలం కండరాల్లోనే కత్తి గుచ్చుకుంది అన్నాడు. సిరియాకు చెందిన ఈ సర్జన్ మాట్లాడుతూ తనపై దాడి చేసిన వ్యక్తి పట్ల తనకు కోపం కాని, ద్వేషం కాని లేవని, తాను అతన్ని క్షమించేశానని చెప్పాడు. కాని ఉగ్రవాద…

Read More

గాంధీ జయంతి వేళ గాడ్సే విగ్రహాన్ని ఆవిష్కరించిన హిందూమహా సభ

మీరట్ : అఖిలభారత హిందూమహాసభ  కార్యాలయంలో మన దేశ జాతిపిత మహాత్మాగాంధీకి తీవ్ర అవమానం జరిగింది. స్వాతంత్య్ర సమరాన్ని ముందుండి నడిపించి దేశానికి స్వాతంత్రం సాధించి పెట్టిన మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్ పట్టణంలో అఖిలభారత హిందూ మహాసభ సభ్యులు అక్టోబరు 2వతేదీన ‘ధిక్కార్ దివస్’ ను నిర్వహించి విమర్శలు ఎదుర్కొన్నారు. మహాత్మాగాంధీ హంతకుడైన నాథురాం గాడ్సే విగ్రహాన్ని మీరట్ లోని శారదా రోడ్డులోని హిందూమహాసభ కార్యాలయంలో ఆవిష్కరించారు. 2014వ సంవత్సరంలోనే గాడ్సే విగ్రహాన్ని ఆవిష్కరించాలని హిందూమహాసభ నిర్వాహకులు నిర్ణయించినా పోలీసులు కోర్టు ఉత్తర్వులతో అడ్డుకున్నారు. రెండు అడుగుల ఎత్తుతో 50 కిలోల బరువున్న గాడ్సే విగ్రహాన్ని తయారు చేయించి మీరట్ మహాసభ కార్యాలయానికి తీసుకువచ్చి పూలమాలలు వేసి, శాలువా కప్పి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మహాసభ యూపీ విభాగం అధ్యక్షుడు యోగేంద్రవర్మ, జాతీయ ఉపాధ్యక్షుడు…

Read More

అమెరికా దాడిలో 13 మంది ఆఫ్ఘాన్ పౌరులు మృతి 

ఆఫ్ఘనిస్థాన్ (సెప్టెంబర్ 28) : ఆఫ్ఘనిస్థాన్ లో ఐసిస్ తీవ్రవాదులను లక్ష్యంగా చేసుకొని అమెరికన్ వాయుసేన జరిపిన వైమానిక దాడిలో 13 మంది ఆఫ్ఘాన్ పౌరులు మృతి చెందారని అధికార వర్గాల సమాచారం. నాన్ గర్హార్ రాష్ట్రంలోని అచిన్ జిల్లాలో ఓ జనావాస ప్రాంతంలో హజ్ యాత్రకు వెళ్లి తిరిగి వస్తున్న గిరిజన నాయకుడికి స్వాగతం చెప్పేందుకు ప్రజలు గుమిగూడినపుడు ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. అయితే స్థానిక రాజకీయ నాయకుడు సిన్వారీ, ఆరుగురు ఐసిస్ తీవ్రవాదులు మరణించారని, 12 మంది ప్రజలకు కేవలం గాయాలయ్యాయని చెప్పుకురాగా ఆచిన్ జిల్లా పోలీసు ఉన్నతాధికారి ముహమ్మద్ అలీ మాత్రం అమెరికా  జరిపిన దాడిలో 15 మంది సాయుధులు మరణించారని  సమర్థించారు. కాగా తమ బలగాలు ఆఫ్ఘనిస్థాన్ లో జరిపిన దాడుల్లో పౌరులు మరణించారని వచ్చిన ఆరోపణలపై తాము దర్యాప్తు చేస్తున్నామని ఆఫ్ఘనిస్థాన్ లో  యూఎస్ బ్రిగేడియర్ జనరల్ ఛార్లెస్ క్లెవ్ ల్యాండు…

Read More

నా పేరు ఖాన్…నేను టెర్రరిస్టును కాను..

నవీ ముంబై : ఓ ముస్లిమ్ కుటుంబం అద్దెకు ఉంటున్న ఫ్లాట్ నుంచి ఖాళీ చేయించేందుకు ఆయనపై టెర్రరిస్టు ముద్ర వేసి ఆయన జీవితాన్ని దుర్భరం చేసిన ఉదంతం నవీ ముంబై నగరంలో జరిగింది. నవీ ముంబై నగరంలో ఓ టెర్రరిస్టు అనుమానాస్పదంగా సంచరిస్తున్నాడంటూ కొందరు వ్యక్తులు వాట్సాప్ గ్రూప్ ద్వారా అందించిన సమాచారంతో ముంబయి పోలీసులు హై అలెర్ట్ ప్రకటించారు. ‘‘నా పేరు సయీద్ షేర్అలీ ఖాన్ అని…నేను టెర్రరిస్టును కాదు’’ అంటూ డ్రైవరుగా పనిచేస్తున్న సయీద్ షేర్ అలీ ఖాన్ తన భార్య నహీద్, నలుగురు పిల్లలతో కలిసి ఓ ప్లకార్డు చేతపట్టుకొని విరార్ పోలీసుల ముందుకు వచ్చాడు. తాను టెర్రరిస్టు అంటూ ప్రచారం జరుగుతుందని కుటుంబసభ్యులు, స్నేహితులు, గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చిన ఫోన్ కాల్స్ తో ఇంటి నుంచి అడుగు బయటపెట్టలేకపోయానంటూ…

Read More

గో తీవ్రవాద బాధిత కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వాలని గవర్నరుకు వినతి

అహ్మదాబాద్ : గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ సమీపంలోని వట్వా గ్రామంలో ఆవును రవాణా చేశారనే ఆరోపణతో ముహమ్మద్ అయూబ్ కుటుంబంపై దాడి చేసి చంపిన కేసులో బాధిత కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వాలని సోషల్ డెమోక్రాటిక్ పార్టీ ఆఫ్ ఇండియా గుజరాత్ గవర్నరు, జిల్లా కలెక్టర్లకు వినతిపత్రం సమర్పించింది. అయూబ్ (29), సమీర్ షేఖ్ (36) లనే ఇద్దరిపై దాడి చేసి దారుణంగా హతమార్చారు.

Read More

మాలెగాఁవ్ పేలుళ్ల కేసులో కల్నల్ పురోహిత్ కు బెయిల్ నిరాకరణ

ముంబయి : 2008వ సంవత్సరంలో మాలెగాఁవ్ లో జరిగిన పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడైన కల్నల్ శ్రీకాంత్ పురోహిత్ పెట్టుకున్న బెయిల్ పిటిషన్ ను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కోర్టు తోసిపుచ్చింది. మాలెగాఁవ్ పేలుళ్ల కేసులో కల్నల్ పురోహిత్ ప్రమేయం ఉందని ప్రాథమిక సాక్ష్యాధారాలు లభించినందున వాదోపవాదాల దశలో పురోహిత్ కు బెయిల్ ఇవ్వవద్దని ఎన్ఐఏ అధికారులు కోర్టును అభ్యర్థించారు. దీంతో పురోహిత్ బెయిల్ ను నిరాకరిస్తూ స్పెషల్ జడ్జి ఎస్డీ టేకాలే ఉత్తర్వులు జారీ చేశారు. ముస్లిమ్ చేనేత కార్మికులు ఎక్కువగా నివాసముంటున్న మాలెగాఁవ్ లో 2008 సెప్టెంబరు 29 న జరిగిన పేలుళ్లలో ఏడుగురు మరణించగా, వందమంది గాయపడ్డారు. 2006 అభినవ భారత్ ట్రస్టు పేరిట ఏర్పాటు చేసి సాధ్వీ  ప్రఙ్ఞా సింగ్ ఠాకూర్ తోపాటు కల్నల్ పురోహిత్ లు పేలుళ్లకు పాల్పడ్డారని తేలింది.

Read More