బాంబు ప్రేలుడు బాధితులకు ఉచితసేవలందించిన ముస్లిమ్ వైద్యునిపై దాడి

మాంచెస్టర్ బాంబు పేలుడు సంఘటనలో గాయపడిన వారికి స్వచ్చందంగా సేవలందించిన ముస్లిమ్ సర్జన్ పై దాడి జరిగింది. నాసర్ కుర్దీ బాంబుపేలుడు బాధితులకు సేవలందించిన వైద్యుడు. ఆయన నమాజుకు వెళుతుండగా వెనుక నుంచి వచ్చిన ముష్కరుడు మెడపై కత్తితో బలంగా పొడిచాడు. వెంటనే ఆయన్ను ఆయన ఆర్ధోపెడిక్ సర్జన్ గా పనిచేసే ఆసుపత్రికే తీసుకెళ్ళారు. ఈ సంఘటన తర్వాత ఆయన మాట్లాడుతూ దేవుడి దయవల్ల బతికాను. ఆ కత్తిపోటు ఒక రక్తనాళంపై పడి ఉండవచ్చు, మెడ అనేది తలకు, శరీరానికి మధ్య ఉండే సున్నితమైన భాగం, అయినా అదృష్టవశాత్తు కేవలం కండరాల్లోనే కత్తి గుచ్చుకుంది అన్నాడు. సిరియాకు చెందిన ఈ సర్జన్ మాట్లాడుతూ తనపై దాడి చేసిన వ్యక్తి పట్ల తనకు కోపం కాని, ద్వేషం కాని లేవని, తాను అతన్ని క్షమించేశానని చెప్పాడు. కాని ఉగ్రవాద…

Read More

చైనాలో ముస్లిములపై ఆంక్షలన్న పుకార్లు

ముస్లిములు తమ ఖుర్ ఆన్ గ్రంథ ప్రతులను, నమాజు చేసుకునే తివాచీలు (జానిమాజు) లను ప్రభుత్వానికి అప్పజెప్పాలని, లేకపోతే తీవ్రమైన సమస్యలు ఎదురవుతాయని చైనా ప్రభుత్వం నిర్బంధం చేసినట్లు పుకార్లు వస్తున్నాయి. ముస్లిములు తమ మతసంబంధమైన వస్తువులన్నింటిని అప్పజెప్పాలని ఆదేశాలు జారీ అయ్యాయట. చైనాలోని గ్జియాంగ్ జిన్ ప్రాంతంలో ఉయిగుర్ ముస్లిమ్ జనాభా ఉంది. ఉయిగుర్ ముస్లిములందరూ తమ ఖుర్ఆన్ కాపీలను, నమాజు చేసుకునే జానిమాజులు తదితర ధార్మిక వస్తువులన్నీ ప్రభుత్వానికి అప్పజెప్పాలన్న నోటిఫికేషన్లు జారీ అయ్యాయన్న పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ ఆదేశాలు కజాక్, కిర్గిజ్ ముస్లిములకు కూడా వర్తిస్తాయని చెప్పబడుతోంది. చైనా ప్రభుత్వం ఈ ఆరోపణలను కొట్టివేసింది. ఉయిగుర్ ముస్లిములు ఖుర్ఆన్ కాపీలు, నమాజు చేసుకునే జానిమాజులు స్వాధీనం చేయాలంటూ ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదని వివరణ ఇచ్చింది. ఈ విషయమై వచ్చిన మీడియా…

Read More

జికా, డెంగ్యూ, హెపటైటిస్ లకు వ్యాక్సిన్ కనిపెట్టిన డా. ముంతాజ్

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది ప్రజలను పీడిస్తున్న భయంకరమైన వైరసులు జికా, డెంగ్యూ, హెపటైటిస్ సి లకు వ్యాక్సిన్ కనిపెట్టిన శాస్త్రవేత్తల బృందంలో బీహారుకు చెందిన డా. ముంతాజ్ నయ్యర్ ఒకరు. యూనివర్శిటీ ఆఫ్ సౌతాంప్టన్ లో ఈ పరిశోధన జరిగింది. ఈ పరిశోధనా పత్రంలో ఫస్ట్ ఆథర్ గా ఉన్న డా. ముంతాజ్ నయ్యర్ మాట్లాడుతూ తాను భారతదేశం నుంచి వచ్చాననీ, భారతదేశంలో వేలాది డెంగూ కేసులు ప్రతి సంవత్సరం రిపోర్టవుతాయని, ఈ పరిశోధన వారికి సాంత్వన కలిగిస్తుందని అన్నాడు. బీహారులోని ఒక చిన్న ఊరి నుంచి బ్రిటన్ వరకు వెళ్ళిన ముంతాజ్ నయ్యర్ సాధించిన విజయాలు అనేకమంది యువకులకు స్ఫూర్తి దాయకమైనవి. హైస్కూలు వరకు ఆయన చదువకున్న ఊరు ఒక కుగ్రామం. 2016 వరకు అక్కడ కనీసం కరంటు సరఫరా కూడా లేదు. అంటే రాత్రులు చీకట్లోనే…

Read More

పదకొండు రూపాయలకే సివిల్స్ కోచింగ్ ఇస్తున్న ముతి ఉర్ రహ్మాన్

కేవలం పదకొండు రూపాయలు మాత్రమే తీసుకుని ఐయేయస్, ఐపియస్ కోచింగ్ ఇస్తున్న ముతి ఉర్ రహ్మాన్ సమాజానికి చేస్తున్న సేవ అసాధారణమైనది. బడుగు బలహీనవర్గాల విద్యార్థులకు అవసరమైన కోచింగ్ ఆయన ఉచితంగానే అందిస్తున్నారని చెప్పాలి. సివిల్స్ కోచింగ్ ఇచ్చే కేంద్రాలు దేశమంతటా చాలా ఉన్నాయి. భారీగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఇలాంటి కోచింగ్ కేంద్రాల్లో చేరాలంటే పేద విద్యార్థులకు సాధ్యం కాదు. సివిల్ సర్వీసెస్ అధికారులుగా సమాజానికి సేవ చేసే అవకాశం వారికి దొరకదు. అలాంటి పరిస్థితుల్లో ముతి ఉర్ రహ్మాన్ ఆపద్బాంధవుడిలా పేదవిద్యార్థులను ఆదుకుంటున్నారు. బీహారులోని పాట్నాకు చెందిన ముతి ఉర్ రహ్మాన్ ఐయేయస్, ఐపియస్ పరీక్షలు రాయాలనుకునే వారికి గురు రహ్మాన్ గా పేరు సంపాదించుకున్నారు. భారీగా ఫీజులు చెల్లించలేని పేద విద్యార్థులకు కేవలం పదకొండు రూపాయల ఫీజుతో ముతి ఉర్ రహ్మాన్ నాణ్యమైన కోచింగ్…

Read More

ఇంగ్లండ్ ప్రధాని చర్చిల్ ఇస్లామ్ స్వీకరించాలనుకున్నారా…!?

లండన్ : రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటన్ దేశానికి ప్రధానమంత్రిగా పనిచేసిన సర్ విన్‌స్టన్ చర్చిల్ ఇస్లాం స్వీకరించాలనుకున్నారా…అవునని తాజాగా వెలుగుచూసిన లేఖ ఈ విషయాన్ని బహిర్గతం చేసింది. సర్ విన్‌స్టన్ చర్చిల్ తాను ఇస్లాం మతాన్ని స్వీకరించాలనే కోరికను వ్యక్తం చేయగా దాన్ని అతని కుటుంబం వ్యతిరేకించిందని తాజాగా వెల్లడైన లేఖతో తేలింది. బ్రిటిష్ సామ్రాజ్య ప్రధాన రక్షకుడైన ప్రధాన మంత్రి సర్ విన్‌స్టన్ చర్చిల్ ఇస్లాం మతాన్నివిపరీతంగా అభిమానించే వాడని వెల్లడైంది. రెండవ ప్రపంచ యుద్ధంలో  బ్రిటన్ దేశాన్ని విజయం వైపు నడిపించిన ప్రధాన మంత్రి ఇస్లాం మతమంటే తనకిష్టమని చెప్పి అందులోకి మారేందుకు చేసిన యత్నాన్ని అతని కుటుంబం నచ్చజెప్పి మతం మారకుండా అడ్డుకుందని సమాచారం. ‘‘నేను మీలో ఇస్లాంపై మీలో ఉన్న ధోరణిని గమనించానని… దయచేసి మీరు ఇస్లాం మతంలోకి  మారకండి..’’అంటూ…

Read More