మతస్వేచ్ఛను కాపాడే మరో గొప్ప తీర్పు

హిందూధర్మం వదిలి ఇతర మతాన్ని స్వీకరించిన మహిళ కూడా హిందూ వారసత్వ చట్టం ప్రకారం హిందూ తండ్రి ఆస్తిలో హక్కు కలిగి ఉంటుందని గుజరాత్ హైకోర్టు తీర్పు చెప్పింది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్.యస్.రెడ్డి, జస్టిస్ వి.యం.పంచోలిలు ఈ తీర్పు నిచ్చారు. వడోదరలోని నైనా హిందూ ధర్మాన్ని వదిలి నసీం బానుగా మారింది. ఫిరోజ్ ఖాన్ ను పెళ్ళి చేసుకుంది. ఈ వివాహం 1991లో జరిగింది. ఆమె తండ్రి భీఖా పాటిల్ 2004లో మరణించారు. ఆయనకు కొంత భూమి ఉంది. ఆ భూమిలో తన వాటా కోసం ఆమె అడిగినప్పుడు ఆమె అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు ఇవ్వమన్నారు. మతం మార్చుకున్నాక వారసత్వ హక్కు ఉండదన్నారు. అక్కడి డిప్యూటి కలెక్టరు వారసత్వ హక్కు ఉంటుందని చెప్పినా జిల్లా కలెక్టరు, రాష్ట్ర రెవిన్యూ సెక్రటరీలు దానికి ఒప్పుకోలేదు. ఆమెకు…

Read More

మతోన్మాద శక్తుల కుట్రలు, ముస్లిం పేర్లతో ఫేక్ ఐడీలు

వాడి పేరు దినేష్ శర్మ. మరోసారి జాగ్రత్తగా చూడండి. వాడి పేరు దినేష్ శర్మ. కాని అలీ ఖాన్ పేరుతో ఫేస్ బుక్ లో ఫేక్ ఐడి పెట్టుకున్నాడు. ఇలాంటి వేలాది దొంగ ఐడీలు సృష్టించింది మతతత్వ పార్టీ బిజెపీ. ఎందుకంటే మతతత్వ మంటలు ఎగదోయడానికి. ఈ దినేష్ ఫేస్ బుక్కులో ఒక హిందూ దేవాలయం గురించి పెట్టిన అభ్యంతరకరమైన పోస్టు వల్ల పశ్చిమ బెంగాల్లోని 24 పరగణా జిల్లాలో మతకలహాలు భగ్గుమన్నాయి. కేంద్రం వెంటనే 300 మంది పారా మిలిటరీ బలగాలను తరలించింది. ఈ అభ్యంతరకరమైన పోస్టు వల్ల మతకలహాలు చెలరేగినందుకు మరోవైపు బిజేపి నేతలకు కూడా చేతినిండా పని దొరికింది. పశ్చిమ బెంగాల్ గవర్నర్ కేశరీ నాథ్ త్రిపాఠి బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో దురుసుగా మాట్లాడారని స్వయంగా ఆమెయే చెప్పారు. బిజేపి బ్లాక్ ప్రెసిడెంటులా…

Read More

భారత చరిత్ర కాషాయీకరణ ప్రయత్నాలు ప్రారంభం

భారతదేశం అనేక దాడులు, వలసలతో ఏర్పడిన దేశం. బహుళ మతాలు, సంస్కృతులు, భాషల దేశం. కానీ చరిత్రను వక్రీకరించి దిశగా ప్రధాని ఒక కమిటీ వేశారని తెలుస్తోంది. భారతదేశం హిందురాష్ట్రగా మార్చే క్రమంలో భాగమే ఈ కమిటీ అని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రాచీన చరిత్ర తిరగ రాయడానికే ఈ కమిటీ వేశారని కమిటి చైర్మన్ కే.ఎన్.దీక్షిత్ చెప్పినట్లు తెలుస్తోంది. అలాగే సాంస్కృతిక శాఖ మంత్రి మహేష్ శర్మ కమిటి ఉద్దేశ్యాన్ని స్పష్టంగా ప్రకటించేశాడు. భారత చరిత్ర తిరగరాసే ప్రయత్నాల్లో భాగమే ఇదని చెప్పకనే చెప్పేశాడు. రాయిటర్స్ వార్తా సంస్థతో మాట్లాడుతూ ఆరెస్సెస్ ప్రతినిథి మన్మోహన్ వైద్య భారత చరిత్ర అసలు రంగు కాషాయమేనని అన్నాడు. సాంస్కృతిక మార్పులు తీసుకురావడానికి చరిత్రను తిరగరాయాలని చెప్పాడు. ఆరెస్సెస్ చరిత్ర పరిశోధన విభాగం అధిపతి బాల్ ముకుంద్ పాండే తాను క్రమం…

Read More

హాదియా పెళ్ళి చట్టబద్దమేనన్న సుప్రీంకోర్టు

తన ఇష్టమైన మతాన్ని ఎన్నుకునే స్వేచ్ఛ, తన జీవిత భాగస్వామిని ఎంచుకునే స్వేచ్ఛ భారత బహుళత్వానికి ప్రాణం వంటివని సుప్రీంకోర్టు చెప్పింది. హాదియా కేసులో సుప్రీంకోర్టు కేరళ హైకోర్టు తీర్పును కొట్టివేసింది. హాదియా పెళ్ళి చెల్లదంటూ కేరళ హైకోర్టు ఇంతకు ముందు తీర్పు చెప్పింది. హాదియా, షఫీ జహాంల పెళ్ళిని హైకోర్టు రద్దు చేయవలసింది కాదని భారత ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రాతో పాటు మరో ఇద్దరు న్యాయమూర్తులున్న ధర్మాసనం అభిప్రాయపడింది. సుప్రీంకోర్టులో కూడా హాదియా పెళ్ళి రద్దు చేయించే ప్రయత్నాలు న్యాయవాదులు చేశారు కాని సుప్రీంకోర్టు వ్యక్తిగత స్వేచ్ఛల విషయంలో ఆ వాదనలను అంగీకరించలేదు. పాతికేళ్ళ వయసున్న యువతి తన ఇష్టప్రకారం పెళ్ళి చేసుకోలేకపోవడం, ఆమె బలహీనురాలని, ఒత్తిడికి లొంగిపోతుందంటు హైకోర్టు వ్యాఖ్యానించడం, పెళ్ళి వంటి ముఖ్యమైన నిర్ణయాల్లో తల్లిదండ్రుల ఆమోదం చాలా అవసరమని చెప్పడం,…

Read More

దాద్రి నిందితులందరికీ బెయిల్!

ఉత్తరప్రదేశ్ దాద్రీలో ఆఖ్లాఖ్ పై మత విద్వేష గూండాలు దాడి చేసి చంపిన దుర్ఘటన జరిగి రెండేళ్ళయ్యింది. ఈ సంఘటన జరిగింది 2015 సెప్టెంబరు 28న. ఆఖ్లాఖ్ ఇంట్లో గొడ్డుమాంసం తిన్నారని మత విద్వేష శక్తులు మైకులో చేసిన ప్రకటన తర్వాత ఈ హత్యాకాండ జరిగింది. ఆఖ్లాఖ్, అతని కుమారుడు దానిష్, ఆ కుటుంబంలోని మహిళలు అందరిపై గుంపు దాడి చేసింది. దాడిలో ఆఖ్లాఖ్ చనిపోయాడు. ఇంత దారుణానికి కారణమేమిటి? ఆఖ్లాఖ్ ఇంట ఉన్న మాంసం గొడ్డు మాంసం కాదని, అది మేకమాంసమని తర్వాత ఫోరెన్సిక్ విచారణలో తేలింది. కాని ఏడాది తర్వాత వచ్చిన మరో రిపోర్ట్ లో ఆ మాంసం గొడ్డుమాంసమేనని చెప్పారు. ఈ దుర్ఘటన జరిగిన వెంటనే వివిధ సెక్షన్ల క్రింద కేసులు నమోదయ్యాయి. పోలీసులు 20 మందిని అరెస్టు చేశారు. అందులో ఇద్దరు…

Read More

బాంబు ప్రేలుడు బాధితులకు ఉచితసేవలందించిన ముస్లిమ్ వైద్యునిపై దాడి

మాంచెస్టర్ బాంబు పేలుడు సంఘటనలో గాయపడిన వారికి స్వచ్చందంగా సేవలందించిన ముస్లిమ్ సర్జన్ పై దాడి జరిగింది. నాసర్ కుర్దీ బాంబుపేలుడు బాధితులకు సేవలందించిన వైద్యుడు. ఆయన నమాజుకు వెళుతుండగా వెనుక నుంచి వచ్చిన ముష్కరుడు మెడపై కత్తితో బలంగా పొడిచాడు. వెంటనే ఆయన్ను ఆయన ఆర్ధోపెడిక్ సర్జన్ గా పనిచేసే ఆసుపత్రికే తీసుకెళ్ళారు. ఈ సంఘటన తర్వాత ఆయన మాట్లాడుతూ దేవుడి దయవల్ల బతికాను. ఆ కత్తిపోటు ఒక రక్తనాళంపై పడి ఉండవచ్చు, మెడ అనేది తలకు, శరీరానికి మధ్య ఉండే సున్నితమైన భాగం, అయినా అదృష్టవశాత్తు కేవలం కండరాల్లోనే కత్తి గుచ్చుకుంది అన్నాడు. సిరియాకు చెందిన ఈ సర్జన్ మాట్లాడుతూ తనపై దాడి చేసిన వ్యక్తి పట్ల తనకు కోపం కాని, ద్వేషం కాని లేవని, తాను అతన్ని క్షమించేశానని చెప్పాడు. కాని ఉగ్రవాద…

Read More

టీచర్ల అవమానాలు తట్టుకోలేక ఆత్మహత్యకు ఒడిగట్టిన అర్ష్

కాన్పూర్ లోని ఢిల్లీ పబ్లిక్ స్కూలుకు చెందిన విద్యార్థి అర్ష్ ఆత్మహత్యా ప్రయత్నం చేశాడు. దానికి కారణం స్కూలు ప్రిన్సిపాలు, టీచర్లు. ముస్లిమ్ అయినందుకు ప్రతిరోజు అవమానపరుస్తూ, అనుమానిస్తూ, బ్యాగులు చెక్ చేస్తూ నరకం చూపించారీ ఉపాధ్యాయులు. దుర్బాషలాడ్డం, ఒంటరిగా ఉంచి శిక్షించడం జరిగేది. ఇతర విద్యార్థులెవ్వరూ తనతో మాట్లాడకుండా టీచర్లు అడ్డుకునేవారని, స్కూల్లో చేరి రెండు నెలలైనా టీచర్లు కట్టడి చేయడం వల్ల ఎవ్వరూ తనతో మాట్లాడేవారు కాదని ఆ అబ్బాయి తెలిపాడు. చివరకు అవమానాలు సహించలేక నిద్రమాత్రలు, ఫినైల్ తాగి ఆత్మహత్యా ప్రయత్నం చేశాడు. ఆ అబ్బాయి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

Read More

ట్రంప్ ను ఐసిస్ తో పోల్చిన లండన్ మేయర్ సాదిఖ్ ఖాన్

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఉగ్రవాద సంస్థ ఐయస్ఐయస్ వంటి భాష వాడుతున్నారని లండన్ మేయర్ సాదిక్ ఖాన్ విమర్శించారు. ముస్లిములు అమెరికాలో ప్రవేశించకుండా సరిహద్దులు పూర్తిగా మూసేయాలని డోనాల్డ్ ట్రంప్ అనడాన్ని ఉటంకిస్తూ లేబర్ పార్టీ కాన్ఫరెన్సులో సాదిక్ ఖాన్ ఈ మాటలు అన్నారు. అమెరికా అధ్యక్షుడితో ఈ విషయమై తనకు వాదన ఇష్టం లేదని సాదిఖ్ ఖాన్ అన్నారు. ముస్లిములు అమెరికాలో ప్రవేశించకుండా పూర్తిగా మూసేయాలని పిలుపునిచ్చిన డోనాల్డ్ ట్రంప్ లండన్ మేయరు సాదిక్ ఖాన్ అందుకు మినహాయింపని చెప్పడంతో మేయరు మరింత ఆగ్రహించారు. తాను మినహాయింపేమీ కాదని చెబుతూ, “ట్రంప్ ఏం మాట్లాడుతున్నారో కాస్త ఆలోచించుకోవాలని” అన్నారు. “ఎందుకంటే మీరు మాట్లాడుతున్నది ఐయస్ఐయస్ భాషలా ఉంది” అని వేలెత్తి చూపారు. పాశ్చాత్యులు ఇస్లామ్ ను ద్వేషిస్తారని ఐయస్ఐయస్ చెబుతుంది. అమెరికా అధ్యక్షుడిగా మీరు కూడా…

Read More

ముస్లింల పట్ల మీడియా వ్యతిరేక కథనాలను ప్రచురిస్తోంది : అమెరికన్ జర్నలిస్టు తగౌరి

లాస్ ఏంజల్స్: ముస్లింల పట్ల మీడియా వ్యతిరేక కథనాలను ప్రచురిస్తోందని అమెరికాలో టీవీ జర్నలిస్టు తగౌరి ఆవేదన వ్యక్తం చేశారు. అమెరికాలో ప్రముఖ మ్యాగజైన్ ప్లేబాయ్ మొదటిసారిగా ఒక హిజాబ్ పాటించే ముస్లిం మహిళ కథనాన్ని అక్టోబరు సంచికలో ప్రచురించింది. అమెరికాలో ముస్లింల పట్ల ఉన్న వివక్షను ఎదుర్కొంటూ ఒక మహిళ ఎదిగిన తీరును మ్యాగజైన్ అభినందించింది. లిబియా నుంచి వచ్చిన తగౌరి హిజాబ్ పాటిస్తూ  అమెరికా టీవీ  చానెళ్లలో యాంకరింగ్ చేయడమే లక్ష్యంగా కృషి  చేశారని ప్రశంసించింది. ఈ కథనంపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు, పొగడ్తలు వెల్లువెత్తాయి. తగౌరిని సోషల్ మీడియాలో లక్షకు పైగా ఫాలోవర్లు అనుసరిస్తున్నారు. అశ్లీల పత్రికగా పేరున్న ప్లేబాయ్ గత కొంత కాలంగా ఎటువంటి పోర్న్ చిత్రాలను ప్రచురించడం లేదు. ఈ నేపథ్యంలో హిజాబ్ పాటించే ముస్లిమ్ మహిళ ఫోటోతో కథనం ప్రచురించడం…

Read More