షిల్లాంగ్ లో శిక్కు వ్యతిరేక అల్లర్లను ఖండించిన ముస్లిమ్ సంస్థలు

మేఘాలయ రాజధాని షిల్లాంగ్ లో సిక్కు వ్యతిరేక అల్లర్లను ప్రముఖ ముస్లిమ్ సంస్థలు తీవ్రంగా ఖండించాయి. జమాఅత్ ఎ ఇస్లామి హింద్ సెక్రటరీ జనరల్ ముహమ్మద్ సలీమ్ ఇంజనీర్ ఈ అల్లర్లను ఖండిస్తూ, షిల్లాంగ్ లో సిక్కు సోదరులపై దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాము. మేఘాలయలో సిక్కులు మైనారిటీ సముదాయం. కేవలం ఒక చిన్న వీధి తగాదా సిక్కులపై దాడులకు, హింసాకాండకు కారణం కావడం చాలా శోచనీయం, మతోన్మాదానికి గురైన సంఘవిద్రోహ శక్తులు ప్రజల్లో చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నాయని అన్నారు. భారతదేశం వంటి బహుళమతాలు, జాతుల దేశంలో మైనారిటీలను కాపాడే బాధ్యత మెజారిటీ సముదాయంపై ఉంటుందని ఆయన గుర్తు చేశారు. మేఘాలయ ప్రభుత్వం రాజ్యాంగబాధ్యతలను నిర్వర్తించాలని, ప్రజల ప్రాణాలను, గౌరవమర్యాదలను, ఆస్తిపాస్తులను కాపాడాలని పిలుపునిచ్చారు. షిల్లాంగ్ అల్లర్లలో బాధ్యులను గుర్తించి కఠినంగా శిక్షించాలని కోరారు. మేఘాలయ ప్రగతి వికాసాల్లో…

Read More

ముస్లిం ప్రాంతానికి స్వయం నిర్ణయాధికార బిల్లును ఆమోదించిన ఫిలిప్పిన్స్ పార్లమెంటు

ఫిలిప్పిన్స్ లోని మిండానో దీవి దక్షిణ కొరియా అంత ఉంటుంది. ఫిలిప్పిన్స్ లో అత్యంత వెనుకబడిన ప్రాంతమిది. కాని ఇక్కడ నికెల్ గనులున్నాయి. పెద్ద పెద్ద పండ్లతోటలున్నాయి. పామాయిల్ ప్లాంటేషన్లుగా ప్రభుత్వం మార్చాలని భావిస్తున్న విశాల భూభాగాలున్నాయి. కాని ఇక్కడ ఫాక్షన్ ఘర్షణలు, మరోవైపు ముస్లిం కమ్యునిస్టు తిరుగుబాటుదారుల దాడులతో పెట్టుబడిదారులెవ్వరు ఇటు రావడానికి ఇష్టపడరు. ముస్లిం మైనారిటీలకు స్వయం పాలనాధికారం ఇవ్వడం యాభై సంవత్సరాలుగా కొనసాగుతున్న ఘర్షణలను నివారించే గొప్ప నిర్ణయాన్ని ఫిలిప్పిన్స్ ప్రభుత్వం తీసుకుంది. వేర్పాటువాద తిరుగుబాటుదారుల సమస్యను అధిగమించడానికి తీసుకున్న నిర్ణయమిది. 2014లో మోరో ఇస్లామిక్ లిబరేషన్ ఫ్రంట్ కు, ప్రభుత్వానికి మధ్య కుదిరిన ఒప్పందం ఫలితంగా ఫిలిప్పిన్స్ పార్లమెంటు ఈ స్వయంపాలన బిల్లును ఆమోదించింది. బాంగ్సామోరో గా పిలువబడే ఈ ప్రాంతం కొండలు, అడవులు, దీవులతో నిండి ఉన్న ప్రాంతం. ఇక్కడ…

Read More

ఇఫ్తార్ చేస్తున్న అమాయకులపై మతోన్మాదుల దాడులు

ఝార్ఖండ్ లోని కొడెర్మాజిల్లాలో ఇఫ్తార్ చేస్తున్న వారిపై మతోన్మాద మూకలు దాడులకు పాల్పడ్డాయి. దాదాపు 20 ముస్లిం కుటుంబాలు ప్రాణభయంతో ఇళ్ళు వదిలి పారిపోవలసి వచ్చింది. ఈ సంఘటన మే 25 సాయంత్రం జరిగింది. ఇఫ్తార్ చేస్తున్నప్పుడు ఈ గుండాలు దాడులకు తెగబడ్డారు. మహిళలు పిల్లలతో సహా అందరిపై విరుచుకుపడ్డారు. మస్జిదును ద్వంసం చేయడమే కాదు అక్కడ నమాజు చేస్తున్న వారిపై దాడులు చేశారు. కోడెర్మ పోలీసు స్టేషను పరిధిలోని కొల్గార్మా గ్రామంలో ఈ సంఘటన జరిగింది. ఈ గ్రామంలో మొత్తం 250 ఇళ్ళున్నాయి. అందులో 20 ఇళ్ళు ముస్లిములవి. ఊళ్ళో మస్జిదు నిర్మాణాన్ని కొందరు వ్యతిరేకిస్తూ వచ్చారని తెలిసింది. గత సంవత్సరం ఏప్రిల్ లో కూడా ఇలాగే గుండాల గుంపులు దాడులు చేసాయి. ఇంతకు ముందు జరిగిన దాడిపై పోలీసు ఫిర్యాదు చేసిన ముస్లిములను ఆ…

Read More

ISIS నుంచి విముక్తి పొందిన సిరియా రాజధాని

సిరియా రాజధాని డమస్కస్ ఇప్పుడు పూర్తిగా సిరియా ప్రభుత్వ అధీనంలోకి వచ్చింది. 2011 లో సిరియా అంతర్యుద్ధం ప్రారంభమైన  తర్వాత డమస్కస్ పై అసద్ ప్రభుత్వం పూర్తి నియంత్రణ పొందడం ఇదే మొదటిసారి. ఇప్పుడు సిరియా సైన్యాలు దక్షిణాన ఉన్న తిరుగుబాటు దారులను అణిచేయడానికి పురోగమిస్తున్నాయి. దక్షిణాన ఇస్రాయీల్ సరిహద్దులున్నాయి. ఈ యుద్ధంలో సిరియాకు ప్రధాన మిత్రపక్షం ఈరాన్ పై అంతర్జాతీయ ఒత్తిడి పెంచే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సిరియా నుంచి ఈరాన్ సైన్యాలను ఉపసంహరించాలన్న ఒత్తిడి పెరుగుతోంది. కాని సిరియా ప్రభుత్వం కోరినంత కాలం సిరియాలో తమ సైన్యం ఉంటుందని, ఎవరి ఒత్తిళ్ళకు లొంగేది లేదని ఈరాన్ ప్రకటించింది. ఈ ప్రకటన ట్రంప్ ప్రభుత్వానికి కంపరమెత్తించే ప్రకటన. అసద్ ను గద్దె దించాలని ప్రయత్నించి విఫలమైన ట్రంప్ ఈరాన్ తో అణు ఒప్పందం నుంచి వైదొలిగిన విషయం…

Read More

బహ్రెయిన్ సౌదీల మధ్య ౩౦ వేల కోట్ల వంతెన

బహ్రెయిన్ సౌదీ అరేబియాల మధ్య కొత్తగా కడుతున్న బ్రిడ్జి ఖర్చు 4 బిలియన్ అమెరికన్ డాలర్లు అంటే దాదాపు 30 వేల కోట్ల రూపాయలు. గల్ప్ గేట్ వే ఇన్వెస్టర్స్ కాన్ఫరెన్సులో బహ్రెయిన్ మంత్రి ఈ విషయం తెలియజేశారు. ఈ బ్రిడ్జికి అయ్యే ఖర్చు మొత్తం ప్రయివేటు రంగమే భరిస్తుంది. టెండర్ల ప్రక్రియ ప్రారంభమైందని తెలియజేశారు. రెండు దేశాల మధ్య బ్రిడ్జి నిర్మించాలన్న ప్రతిపాదనపై 2016లోనే ఒప్పందం కుదిరింది. ఈ బ్రిడ్జి కింగ్ ఫహద్ కాజ్ వే పక్కనే నిర్మిస్తారు. కింగ్ హమద్ బ్రిడ్జిగా దీన్ని పిలుస్తున్నారు. ఇన్ ఫ్రాస్టక్చర్ కోసం బహ్రెయిన్ ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టుల గురించి ఈ సందర్భంగా మంత్రి చెప్పారు. అంతేకాదు మొదటిసారిగా ప్రయివేటు రంగానికి కూడా అనుమతిస్తున్నట్లు తెలియజేశారు.  

Read More

22 ఏళ్ళకే సివిల్స్ సాధించిన ఎలెక్ట్రిషన్ కుమారుడు హసన్

కేవలం 22 సంవత్సరాల వయసులోనే సివిల్ సర్వీసు పరీక్షల్లో సత్తా చూపాడు గుజరాత్ కు చెందిన హసన్ సఫీన్. మొదటి ప్రయత్నంలోనే UPSC 570 ర్యాంకు సాధించాడు. GPSC లో కూడా 34వ ర్యాంకు సాధించాడు. GPSC ర్యాంకు తర్వాత జిల్లా రిజిష్ట్రార్ అయ్యాడు. గుజరాత్ బనస్ కాంతా జిల్లాకు చెందిన సఫీన్ పదవతరగతి వరకు కానోదర ఊళ్ళోనే ప్రభుత్వ పాఠశాలలో చదివాడు. పాలన్ పూర్ నుంచి బి.టెక్ చేశాడు. ఐదవ తరగతిలో ఉన్నప్పుడు తమ ఊరికి వచ్చిన కలెక్టరును చూశాడు. ఆయనెవరని అడిగితే ఆయన జిల్లాకు రాజు వంటి వాడని బంధువులు చెప్పారు. ఆయనలా రాజవ్వాలంటే ఏం చేయాలని అడిగితే పరీక్షలు పాసవ్వాలని చెప్పారు. అయితే నేను కూడా అలాంటి రాజునే అవ్వాలని అప్పుడే నిర్ణయించుకున్నాడు. బి.టెక్ లో చేరినా కేవలం లాజికల్ రీజనింగ్ నేర్చుకునే…

Read More

పిండిమిల్లుకు వచ్చినందుకు దళితుడి తల నరికిన వర్ణాహంకారి

ఉత్తరాఖండ్ : తనను ప్రశ్నించాడనే కోపంతో ఓ దళితుడి తలను నరికిన ఘటన ఉత్తరాఖండ్ రాష్ట్రంలో జరిగింది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని కదారియా గ్రామానికి చెందిన సోహన్ రామ్ అనే దళిత వ్యక్తి గోధుమ పిండి పట్టించుకునేందుకు పిండిమిల్లుకు వచ్చాడు. ఇదే సమయంలో స్కూల్లో ఉపాధ్యాయుడిగా పని చేసే లలిత్ కర్నాటక్ అనే వ్యక్తి కూడా వచ్చాడు. దళితుడైన సోహన్ పిండి ఆడించుకునేందుకు అక్కడికి రావడంవల్ల ఆ ప్రదేశం మొత్తం అపవిత్రం అయిందని, కులం తక్కువవాడిని ఎందుకు రానిస్తారంటూ లలిత్ వ్యాఖ్యలు చేశాడు.దీంతో, అవమానానికి గురైన సోహన్ ‘ఎందుకలా నోరు పారేసుకుంటారు?’ అని ప్రశ్నించాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన లలిత్ అక్కడే ఉన్న పెద్ద కొడవలితో అతని మెడపై ఒక్క వేటు వేశాడు. అంతటితో ఆగని లలిత్…అదే ఆవేశంతో…సోహన్ తలను మొండెం నుంచి వేరు చేశాడు. దీంతో…

Read More