శిక్ష విన్నాక కోర్టులోనే విషం తాగి మరణించిన బోస్నియా యుద్ధనేరస్తుడు

బోస్నియా ముస్లిములపై అమానుషమైన నేరాలకు పాల్పడిన క్రోషియా సైనికాధికారి స్లోబోడన్ ప్రయిజాక్ కోర్టుహాల్లో విషం తాగి మరణించాడు. యుద్ధనేరాలకు గాను కోర్టు 20 సంవత్సరాల కారాగారవాస శిక్ష విధించింది. ఈ తీర్పుపై అప్పీలును అంతర్జాతీయ న్యాయస్థానం తిరస్కరించిన వెంటనే ఆత్మహత్య చేసుకున్నాడు. ఐక్యరాజ్యసమితి న్యాయమూర్తులు బోస్నియాపై జరిగిన యుద్ధనేరాలను విచారిస్తున్నారు. ఆరుగురు మాజీ రాజకీయనేతలు, సైనికాధికారులు యుద్ధనేరస్తులుగా విచారణ ఎదుర్కుంటున్నారు. 1990లో యుగోస్లోవియా ముక్కలైనప్పుడు జరిగిన నేరాలివి. 72 సంవత్సరాల స్లోబోడన్ తనకు వ్యతిరేకంగా వచ్చిన తీర్పును నిరసిస్తూ నినాదాలు చేసి విషం తాగాడు.

Read More

మతతత్వం గురించి మోడీని హెచ్చరించిన ఒబామా

మతపరంగా  ప్రజలు చీలిపోరాదని ప్రధాని నరేంద్రమోడీకి వ్యక్తిగతంగా, ప్రయివేటుగా తాను హెచ్చరించినట్లు అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా అన్నారు. ఇదే మాట అమెరికాలో ప్రజలకు కూడా చెబుతున్నానని అన్నారు. ప్రజలు తమ మధ్య వున్న తేడాలను భూతద్దంలో చూస్తారు. తమ మధ్య వున్న సారూప్యాన్ని పట్టించుకోరు. ఈ సారుప్యాన్ని మనం మరిచిపోరాదు అన్నారు. మతసహనం గురించి వ్యక్తిగతంగా చెప్పిన మాటలకు మోడీ ఎలా ప్రతిస్పందించారని అడిగినప్పుడు జవాబిస్తూ ప్రయివేటు సంభాషణలో అవతలి వారు ఏం చెప్పారన్నది బయటపెట్టడం భావ్యం కాదని అన్నారు. భారతదేశంలో మెజారిటీ ప్రజలు, ప్రభుత్వం దేశంలోని మైనారిటీ ప్రజలను ముఖ్యంగా ముస్లిములను జాతిలో భాగంగా కలిసిపోయేలా వ్యవహరించాలని అన్నారు. భారతదేశంలో ముస్లిమ్ ప్రజలు భారతీయులుగా కలగలిసిపోయారు. దీన్ని మరింత ప్రోత్సహించాలని చెప్పారు. ప్రజాస్వామ్యంలో అధ్యక్షుడు లేదా ప్రధాని ముఖ్యం కాదని, పౌరుడే ముఖ్యమని, ప్రతి…

Read More

ట్రంప్ పై మండిపడిన లండన్ మేయర్ సాదిఖ్ ఖాన్, బ్రిటన్ ప్రధాని థెరెసా మే

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒక యాంటీ ముస్లిమ్ వీడియో రీ ట్వీట్ చేసి తన అసలు రూపం బయటపెట్టుకున్నాడు. అమెరికా అధ్యక్షుడి వైఖరిని నిరసించిన బ్రిటన్ ప్రధానిపై మండిపడుతూ థెరిసా మే మా గురంచి కాదు, బ్రిటన్ లో చోటు చేసుకుంటున్న విధ్వంసక ఉగ్రవాదంపై దృష్టిపెట్టండి అన్నాడు. లండన్ మేయరు సాదిక్ ఖాన్ పై కూడా ఆయన ఇలాంటి దాడులే చేశాడు. కాని బ్రిటన్ ప్రధానిపై ఆయన చేసిన వ్యాఖ్యతో అమెరికాకు చిరకాల మిత్రదేశం బ్రిటన్ తో సంబంధాలు మరింత దిగజారాయని చెప్పాలి. బ్రిటన్ ప్రధాని అమెరికా అధ్యక్షుడి వైఖరిని తీవ్రంగా నిరసించారు. అంతేకాదు పారిస్ పర్యావరణ ఒప్పందం నుంచి తప్పుకోవడాన్ని కూడా ఆమె తప్పుపట్టారు. బ్రిటన్ లో ప్రతిపక్షాలు అమెరికా అధ్యక్షుడి బ్రిటన్ పర్యటన రద్దు చేయాలంటున్నాయి. కమ్యునిటీస్ మినిస్టర్ సాజిద్ జావిద్ మరింత తీవ్రంగా…

Read More

అణుశక్తి పరిజ్ఞానం సౌదీకి ఇవ్వనున్న అమెరికా

సౌదీ అరేబియాకు న్యూక్లియర్ టెక్నాలజీ అందించే ఆలోచనలో అమెరికా వుంది. కాని దీనివల్ల మధ్యప్రాచ్యంలో ఆయుధపోటీ ప్రారంభమవుతుందని కొందరు భయపడుతున్నారు. అణుశక్తి పరిజ్ఞానం పొందడం ద్వారా చమురు ఎగుమతులు మరింత పెంచుకోవాలని సౌదీ ఆలోచిస్తుంది. కాని ఈరాన్ కు పోటీగా యురేనియం శుద్ధి చేసే సామర్థ్యం పెంచుకోవాలని సౌదీ భావిస్తుందని అమెరికా ప్రభుత్వాలు అనుమానిస్తూ వచ్చాయి. ఇప్పుడు ట్రంప్ ప్రభుత్వం ఈ విషయమై మళ్ళీ అవకాశాలు తెరిచింది. సౌదీ శక్తివనరులు చమురుపై ఆధారపడినవి. విద్యుదుత్పత్తి కోసం చమురును మండించడం చాలా ఖరీదైనది. సౌదీ అరేబియా విద్యుదుత్పత్తి కోసమే అణుశక్తి కోరుతుందని చాలా మంది భావిస్తున్నారు. బహుశా సౌదీకి ఆయుధాలు తయారు చేసే ఉద్దేశ్యం లేకపోవచ్చని కూడా నమ్ముతున్నారు. కాని ప్రస్తుతానికి శాంతియుత అవసరాలకే అణుశక్తిని ఉపయోగించుకున్నప్పటికీ ఈరాన్ కు పోటీగా ఆయుధాల తయారీకి భవిష్యత్తులో అవకాశం ఉందన్న…

Read More

భూమిపై ఆంగారకగ్రహం – UAE భారీ ప్రాజెక్టు!

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మార్స్ కాలనీ ఏర్పాటు చేయాలనుకుంటోంది. భూమిపై అంగారక గ్రహం లాంటి వాతావరణం. అక్కడ మనుషులు, రోబోలు పక్కపక్కనే పనిచేసే ఒక అద్భుతం. ఈ కాలనీ ఎలా వుంటుందో ఇటీవల వచ్చిన ఒక వీడియో గేమ్ ద్వారా మనకు తెలుస్తోంది. దుబాయ్ ప్రారంభించిన మార్స్ 2117 ప్రాజెక్టులో భాగంగా ఈ వీడియో గేమ్ విడుదల చేశారు. వచ్చే వంద సంవత్సరాల్లో అంగారక గ్రహంలో కాలనీ ఏర్పాటు చేసే వైజ్ఞానిక పరిశోధనల్లో భాగమిది. ఈ వీడియోలో యునైటెడ్ గవర్నమెంట్ ఆఫ్ మార్స్ తరఫున ఒక హోలోగ్రామ్ ఆహ్వానిస్తుంది. ఈ వీడియోలో భవిష్యత్తులో అంగారక గ్రహంలో వుండే కాలనీ ఎలా వుంటుందో చూపిస్తున్నారు. అక్కడ లేబరెటరీలు, యూనివర్శిటీ, ఎత్తయిన భవనాలతో పాటు ఆరు లక్షల మంది నివాసముండవచ్చని వీడియో చెబుతుంది.   ఇతర గ్రహాల్లో మానవనివాసాలు ఏర్పాటు చేయాలన్నది…

Read More

ఐసిస్ కథ సుఖాంతం – సిరియా పునర్నిర్మాణం ఆరంభం

ఆరేళ్ళపాటు భయంకరంగా కొనసాగిన అంతర్యుద్ధం. దాదాపు కోటి పదిలక్షల మంది ప్రజలు దేశం వదిలి శరణార్థులుగా వెళ్ళిన మానవ విపత్తుల తర్వాత ఇప్పుడు సిరియాలో పునర్నిర్మాణ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. యునిసెఫ్ అత్యవసరమైన సహాయాన్ని చేరవేస్తోంది. తిరుగుబాటుదారుల నుంచి ఉత్తర హమా ప్రాంతం విడుదల పొందింది. అంతర్యుద్ధం ప్రభావం ఇంకా కొనసాగుతోంది. యూనిసెప్ ప్రకారం అంతర్యుద్ధం తర్వాతి నుంచి బాలశ్రామికులు పెరిగిపోయారు. హ్యూమన్ ట్రాఫికింగ్ పెరిగింది. యూనిసెఫ్ బాలల భద్రతకు అవసరమైన చర్యలు తీసుకుంటోంది. యుద్ధం ఆగిపోయినప్పటికీ ఇంకా మంచినీటి వసతి లేదు. విద్యుత్ సరఫరా లేదు. చలికాలంలో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు తప్పని పరిస్థితి వుంది.

Read More

ఈజిప్ట్ – రష్యాల మధ్య రక్షణ ఒప్పందం

ఈజిప్టును కీలుబొమ్మగా ఆడించాలని అమెరికా భావిస్తోంది, కానీ అమెరికాకు మింగుడు పడకుండా ఇప్పుడు ఈజిప్టు రష్యాతో ఒప్పందం చేసుకుంది. ట్రంప్ ఆడ్మినిస్ట్రేషనుకు చెంపదెబ్బలాంటిది ఈ పరిణామం. ఈజిప్టులో ఎయిర్ బేస్, ఎయిర్ స్పేస్ వాడుకోడానికి రష్యాకు అనుమతి ఇచ్చింది. 1973లో సోవియట్ యూనియన్ సైన్యాలను తమ దేశం నుంచి పంపేసిన ఈజిప్టు అమెరికాకు దగ్గరైంది. ఆ తర్వాత రష్యాతో దగ్గరవ్వడం ఇదే మొదటిసారి. ఈ నాలుగు దశాబ్దాల కాలంలో అమెరికా దాదాపు 70 బిలియన్ డాలర్ల సహాయాన్ని ఈజిప్టుకు అందించింది. అందుకు బదులుగా ఈజిప్టులో ఎయిర్ బేసులు, ఎయిర్ స్పేసును అమెరికా మిలిటరీ వాడుకుంటుంది. కాని ఇప్పుడు అమెరికా పలుకుబడి ఇక్కడ క్షీణించిందనే చెప్పాలి. రష్యా ఈ ఎయిర్ బేసులు వాడుకునే అనుమతి సంపాదించుకుంది. ట్రంప్ వచ్చిన తర్వాతి అతిపెద్ద మార్పు ఇది. కాని ఈజిప్టులో రష్యా…

Read More

హలాల్ సర్టిఫికేట్ ఏజన్సీ ప్రారంభించిన టర్కీ

టర్కీలో హలాల్ సర్టిఫికేటు ఇచ్చే ఏజన్సీ స్థాపించడానికి టర్కీ పార్లమెంటు ఆమోదం తెలిపింది. టర్కీలో తయారైన ఆహారం, వస్తువులు ఇస్లామీయ షరిఅత్ ప్రకారం హలాల్ అవునా కాదా నిర్ధారించి ప్రమాణపత్రం జారీ చేసే ఏజన్సీ ఇది. ఈ ఏజన్సీ కార్యాలయాలు విదేశాల్లోను తెరుస్తారు. ప్రస్తుతం 50 మంది సిబ్బందితో ప్రారంభమైన ఈ సంస్థ టర్కీలోని ఇతర సంస్థలకు, విదేశాల్లోని సంస్థలకు కూడా హలాల్ సర్టిఫికేట్ ఇచ్చే ప్రమాణాలను నిర్ధారించి ఆమోదిస్తుంది. ప్రస్తుతం హలాల్ మార్కెట్టు ప్రపంచంలో అతిపెద్ద మార్కెట్టుగా మారింది. హలాల్ అంటే సాధారణంగా ఆహారపదార్థాలే అనుకుంటారు. కాని ఆహారం మాత్రమే కాదు, కాస్మటిక్స్ లో ఆల్కహాల్ లేకపోవడం వంటి ప్రమాణాలు కూడా హలాల్ వస్తువుల ఉత్పత్తిలో ముఖ్యమైనవి. ప్రపంచంలో హలాల్ కాస్మటిక్స్ మార్కెట్ విలువ 26 బిలియన్ డాలర్లు. ప్రపంచంలో హలాల్ మార్కెట్టు 4 ట్రిలియన్…

Read More

లండన్ లో ప్రతిష్టాత్మక డిబేట్ గెలుచుకున్న పేద విద్యార్థిని సెలినా బేగం

బ్రిటన్ లోని అతి పేదకుటుంబానికి చెందిన అమ్మాయి. వలస వచ్చిన కుటుంబానికి చెందిన నిరుపేద తల్లిదండ్రులు. సాధారణ స్కూల్లో చదువుతున్న 16 సంవత్సరాల సెలీనా బేగం బ్రిటన్ లోని ప్రతిష్ఠాత్మకమైన ఇటాన్ డిబేటులో ప్రథమస్థానం సంపాదించింది. ప్రతిష్ఠాత్మకమైన పెద్ద పెద్ద స్కూళ్ళలో చదువుతున్న 200 మంది అభ్యర్థుల కన్నా ఉత్తమ ప్రతిభ కనబరిచింది. ఆమె తండ్రి వికలాంగుడు. తల్లి కుటుంబభారం మోస్తుంది. లండన్ లోని మనోర్ పార్కు ప్రాంతంలో నివసిస్తుంది. కాని ఈ అడ్డంకులేవీ ఆమెను ఆపలేకపోయాయి. ఇతర విద్యార్థులు చాలా చురుకుగా, ఆత్మవిశ్వాసంతో మాట్లాడుతుంటే తనకు మొదట భయమేసిందని, కాని తన ఉపాధ్యాయుడు మిస్టర్ సింగ్ భయపడవద్దు, నువ్వు చాలా బాగా మాట్లాడతావని ధైర్యం చెప్పారు.. ఈ స్థాయి పోటీలో గెలుపొందడం వల్ల తన ఆత్మవిశ్వాసం చాలా పెరిగిందని చెప్పింది. ఆమె సిక్స్ ఫామ్ చదువుతున్న…

Read More

జైలులో అనారోగ్యం పాలవుతున్న ఈజిప్ట్ మాజీ అధ్యక్షుడు

ఈజిప్టు మాజీ అధ్యక్షుడు మోర్సీ ఆరోగ్యం నానాటికి క్షీణిస్తోంది. తనను ఆసుపత్రికి తీసుకెళ్ళాలని, తన ఆరోగ్యం నానాటికి దిగజారుతోందని ఆయన స్వయంగా ప్రకటించారు. ప్రస్తుతం జైల్లో ఉన్న ముహమ్మద్ మోర్సీ కోర్టులో ఈ ప్రకటన చేశారు. వైద్యపరీక్షలు నిర్వహించాలని కోర్టు ఇచ్చిన ఆదేశాన్ని తాను తిరస్కరించడం లేదని చెప్పారు. తన స్వంత ఖర్చులతో వైద్యపరీక్షలు, స్పెషలిస్టు డాక్టర్ల పర్యవేక్షణ అవసరమని, వెంటనే తనను స్పెషాలిటీ ప్రయివేటు ఆసుపత్రికి తరలించాలని కోరారు. ఆయన ఎడమకన్ను పూర్తిగా కనిపించడం లేదు. అయితే జైలు డాక్టర్లు ముందుగా పరీక్షించి వైద్యచికిత్స అవసరమో లేదో సర్టిఫై చేయాలని న్యాయమూర్తి చెప్పారు. ప్రజాస్వామ్యబాద్దంగా ఎన్నికైన ముహమ్మద్ మోర్సీ ప్రభుత్వాన్ని సైన్యం కూలదోసి 2013లో అధికారం కైవసం చేసుకుంది.

Read More