UFC ఫైటర్ ఖబీబ్ కు కొత్త ఆఫర్ల వెల్లువ

UFC ఫైట్ క్లబ్బులో ఐరిష్ ఫైటర్ మెక్ గ్రెగర్ దూషణలకు, ప్రగల్భాలకు రింగులో జవాబిచ్చి ఓడించిన రష్యన్ ఫైటర్ ఖబీబ్ తన మతాన్ని నిందించిన మెక్ గ్రెగర్ టీము సభ్యులపై కూడా తర్వాత దాడికి దిగాడు. UF  దీనిపై ఖబీబ్ పైన, ఆయన టీములోని సభ్యులపైన చర్య తీసుకుంది. కాని వెంటనే అమెరికన్ రాపర్ 50సెంట్ ముందుకు వచ్చి UFC వైఖరిని తప్పు పడుతు ఖబీబ్ పట్ల అన్యాయంగా వ్యవహరంచారని, యుఎఫ్ సీ ఒప్పందాన్ని తెంచుకుని వస్తే తాము 2 మిలియన్ల కాంట్రాక్టు ఖబీబ్ తో చేసుకోడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది. తన సోదరుడిని UFC తొలగించేదయితే తాను కూడా UFC లో ఉండేది లేదని ఇంతకు ముందు ఖబీబ్ ప్రకటించాడు. వెంటనే ఆయనకు ఆఫర్లు రావడం మొదలైంది. UFC ఇప్పుడు కంగారు పడి ఖబీబ్ తో రాజీ కుదుర్చుకునే ప్రయత్నాలు మొదలు పెట్టింది.

Related posts