ముస్లిముల నిర్బంధాలపై చైనాను ప్రశ్నించిన మలేషియా

చైనాలోని ఉఘర్ ప్రాంతంలో ముస్లిముల నిర్బంధాలపై మలేషియా నాయకుడు అన్వర్ ఇబ్రాహీం చైనాను నిలదీశారు. ఉగర్ లో ముస్లిముల మతస్వేచ్ఛను చైనా గుర్తించాలని అన్నారు. జెరుసలేంకు దౌత్యకార్యాలయం మార్చాలని ఆస్ట్రేలియా ఇటీవల చేసిన ప్రకటనను కూడా ఆయన ఖండించారు. మయన్మార్ లో రోహింగ్యలకు మద్దతుగా అందరూ నిలబడాలని విజ్ఞప్తి చేశారు. చైనాలో ఉఘర్ ప్రాంతంలో ముస్లిములను సామూహికంగా నిర్బంధిస్తున్న వార్తలు ఖండించదగ్గవని, ఈ విషయమై ఇంతకుముందు కూడా చైనాకు తన అభిప్రాయాలు తెలియజేశానని ఆయన చెప్పారు. తాము ఎలాంటి హింసను సమర్థించేది లేదని, అది రాజ్య హింస కాని, లేదా వ్యక్తులు, గ్రూపులు  పాల్పడే హింసాకాండ అయినా గాని  అని చెప్పారు. త్వరలో చైనా సందర్శించనున్న అన్వర్ ఇబ్రాహీం తన పర్యటన సందర్భంగా ఈ అంశాన్ని లేవనెత్తుతానని అంటున్నారు.

Related posts