బాబరీ మస్జిద్ విధ్వంసం, శబరిమలలో మహిళల ప్రవేశం రెండింటి మధ్య పోలికల గురించి సిపిఎం ప్రధాన కార్యదర్శి ఏచూరి సీతారాం వివరించారు. బాబరీమస్జిద్ ను కూలదోసిన కాషాయదళాలే ఇప్పుడు వోట్ల రాజకీయాల కోసం శబరిమలలో హింసాత్మక ఆందోళనలకు దిగుతున్నాయని ఆరోపించారు. కేరళలోని వామపక్ష ప్రభుత్వం శబరిమలలో సుప్రీంకోర్టు ఉత్తర్వులను అమలు చేసే ప్రయత్నాలు చేస్తుందని, కాని, ఆరెస్సెస్; బిజేపిలు మతరాజకీయాలు నడుపుతున్నాయని విమర్శించారు. సుప్రీంకోర్టు హిందూ మహిళలకు ఇచ్చిన హక్కును బిజేపి నిరాకరిస్తుందని ఆయన విమర్శించారు. ముస్లిం మహిళల కోసం త్రిపుల్ తలాఖ్ చట్టం తెచ్చిన వారు హిందూ మహిళల సమాన హక్కుల విషయంలో మాత్రం మౌనం ఎందుకు వహిస్తున్నారని ప్రశ్నించారు.
“ముస్లిం మహిళల కోసం BJP పోరాటం, హిందూ మహిళల విషయంలో మౌనం!” సిపిఎం నాయకుడు సీతారాం ఏచూరి ప్రశ్న
