ముంబయి హజ్ హౌస్ పై అత్యంత ఎత్తయిన జాతీయపతాకం!

ముంబయి హజ్ హౌస్ పై జాతీయపతాకాన్ని ఇటీవల కేంద్రమంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ ఆవిష్కరించారు. హజ్ హౌస్ భవనంపై ఎగురుతున్న ఈ జాతీయ పతాకం నేలకు 350 అడుగుల ఎత్తున ఎగురుతోంది. 20 అడుగుల వెడల్పు, 30 అడుగుల పొడవున్న జాతీయ పతాకమిది. అత్యంత ఎత్తున ఎగురుతున్న జాతీయ పతాకం ఇదే. హజ్ యాత్రికుల నుంచి సేకరించిన నిధులతో నిర్మించిన ముంబయి హజ్ హౌస్ భారత హజ్ కమిటీకి ప్రధాన కార్యాలయం. ముంబయి CST వద్ద ఈ భవనం ఉంది. ఈ భవనం ఎత్తు 300 అడుగులు. దానిపై 60 అడుగుల ఎత్తున్న జెండా కర్రకు ఈ జాతీయ పతాకం ఎగురుతోంది. ఇది చాలా పెద్ద జాతీయ పతాకం, దీని బరువు, సైజు వల్ల ప్రతిరోజు జాతీయ పతాకాన్ని పొద్దుట, సాయంత్రం అవనతం చేసి,  ఆవిష్కరించడం కష్టమవుతుంది కాబట్టి చారిత్రక స్థలాల్లో మాదిరిగా ఎల్లప్పుడు జెండా ఎగురుతూ ఉండేలా హజ్ హౌస్ ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకుంది.

Related posts