మతవివక్ష చూపించిన తాజ్ గ్రూప్ హొటెల్

గౌహతీ లోని తాజ్ వివంటా హోటల్లో ముగ్గురు ముస్లిములకు దారుణమైన మతవివక్ష ఎదురైంది. ఈ ముగ్గురు ముస్లిముల్లో ఒకరు ఆర్మీ మెడికల్ కార్ప్స్ కు చెందిన వారు. వారి మొబైల్లో పార్లమెంటు సభ్యుడు ఒవైసీ ప్రసంగం ఉండడమే ఈ మతవివక్షకు, వేధింపులకు కారణం. హోటలు సిబ్బంది వారిని వేధించడమే కాదు, జైలుకు పంపేస్తామని బెదిరించారట. ఢిల్లీ ఫ్లయిట్ మిస్సవ్వడంతో మధ్యాహ్నం 2 గంటలకు హోటలుకు వెళ్ళిన ఈ ముగ్గురు ఆ తర్వాత బయటకు వెళ్ళి 4 గంటలకు తిరిగి వచ్చేసరికి హోటల్లో పోలీసు బలగాలు స్వాగతమిచ్చాయి. వారి పట్ల హొటెల్ సిబ్బంది దురుసుగా వ్యవహరించడం ప్రారంభించారు. మీడియాతో మాట్లాడడానికి ప్రయత్నిస్తే హొటెల్ సెక్యురిటీ అధికారి జైలుకు పంపిస్తానని వార్నింగిచ్చాడు. వారిపైన నిఘా పెట్టి, వేధింపులకు గురి చేశారు. వారి మొబైల్ ఫోన్లు లాక్కున్నారు. వారి మొబైల్ లో అసదుద్దీన్ ఒవైసీ ప్రసంగం ఒకటి చూశారట. అంతే! వాళ్ళు సంఘ విద్రోహ శక్తులు అని నిర్ధారించేశారు! ఈ సంఘటన గురించి తెలిసిన అసదుద్దీన్ ఒవైసీ వెంటనే దీనిపై విచారణ జరిపించాలని అస్సాం ముఖ్యమంత్రికి లేఖ రాశారు. గౌహతీలో తాజ్ హోటల్లో ముస్లిములను వేధించడం, మతవివక్ష చూపించడం కొనసాగుతుందన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.

Related posts