బ్రిటన్లో ముస్లింలు, యూదులపై దాడులు

బ్రిటన్ రాజకీయ నాయకుడు బోరిస్ జాన్సన్ ముస్లిం మహిళల హిజాబ్ గురించి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ ఆగస్ట్ 9వ తేదీన నిరసన ప్రదర్శనలు పెద్ద ఎత్తున జరిగాయి. ఇంగ్లాండులోను, వేల్స్ లోను మతపరమైన విద్వేషం, ముస్లిములపై దాడులు ఇటీవల పెరిగాయి. ఏప్రిల్ 2017 నుంచి మార్చి 2018 వరకు మతపరమైన దాడులు 8336 నేరాలు జరిగాయని పోలీసులు తెలిపారు. ముస్లిములుగా కనబడే వారిపైనే ఎక్కువగా ఇలాంటి దాడులు జరిగాయి. క్రయిం డాటాలో మతపరమైన విద్వేషంతో జరిగే దాడులను కూడా ప్రకటించడం ఇదే మొదటిసారి. ముస్లిం కౌన్సిల్ ఆఫ్ బ్రిటన్ ప్రధాన కార్యదర్శి హారూన్ ఖాన్ మాట్లాడుతూ ఇస్లామోఫోబియాను నివారించడానికి వెంటనే ప్రభుత్వం తగిన ప్రయత్నాలు చేయాలని అన్నారు. బ్రిటన్లో ముస్లిములపై ఎక్కువగా దాడులు జరుగుతుంటే, యూదులపై కూడా దాడులు కొనసాగుతున్నాయి. బ్రిటన్లో ముస్లిం జనాభా కేవలం 5 శాతం. యూద జనాభా కేవలం 0.5 శాతం.

Related posts