పాలస్తీనా దౌత్యకార్యాలయాన్ని మూసేసిన అమెరికా

పాలస్తీనాకు ఉద్దేశించిన దౌత్యకార్యాలయాన్ని అమెరికా మూసేసింది. ఇస్రాయీల్ లోని అమెరికా దౌత్యకార్యాలయంతో దాన్ని కలిపేసింది. ఇస్రాయీల్ లోని దౌత్యకార్యాలయంలో పాలస్తీనా వ్యవహారాల విభాగాన్ని ప్రారంభించింది. జెరుసలేంలో దౌత్యకార్యాలయం ప్రారంభించిన మొదటి దేశం అమెరికా. ఇస్రాయీల్, పాలస్తీనా రెండు దేశాలు జెరుసలేం తమ రాజధాని నగరంగా వాదిస్తున్నాయి. ఇస్రాయీల్ పక్షాన అమెరికా నిలబడింది. ఇప్పుడు పాలస్తీనాలో తమ దౌత్యకార్యాలయం మూసేసి ఇస్రాయీల్ దౌత్య కార్యాలయంతో కలిపిన నిర్ణయం పట్ల పాలస్తీనాలో తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది.

Related posts