జమాఅతె ఇస్లామీ హింద్ షరతులతో కూడిన మద్దతు

గతంలో పనితీరు, భవిష్యత్తులో పరిపాలన పట్ల నిబద్దత ఆధారంగా మాత్రమే తాము మద్దతు ఇస్తామని జమాఅతె ఇస్లామీ హింద్ తెలంగాణా అండ్ ఒడిశా అధ్యక్షులు హామిద్ ముహమ్మద్ ఖాన్ అన్నారు. యువకులకు ఉద్యోగాలు, పంటలకు ఇన్సూరెన్స్, పోలీసు సంస్కరణలు, తెలంగాణా సంస్కృతికి పరిరక్షణ, మైనారిటీలకు సబ్ ప్లాన్, ముస్లిములకు జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లు, పౌరసదుపాయాలు కల్పించడం ప్రధాన డిమాండ్లుగా జమాఅత్ పేర్కొంది. 1994 తర్వాతి నుంచి పాలకపక్షాల పనితీరును జమాఅత్ సమీక్షిస్తోంది. సెక్యులర్ పార్టీల అభ్యర్థుల నిబద్దతపై కూడా పరిశీలిస్తోంది. ఈ పరిశీలన ప్రకారం ఒక నివేదిక రూపొందించి, కేంద్ర నాయకత్వానికి పంపిస్తారు. కేంద్ర నాయకత్వం ఎవరికి మద్దతివ్వాలన్నది ఈ రిపోర్టు ఆధారంగా నిర్ణయం తీసుకుంటుందని హామిద్ ముహమ్మద్ ఖాన్ అన్నారు. జమాఅత్ ఏ రాజకీయ పార్టీతోను ఎన్నికల వేదికలను పంచుకోవడం జరగదని, కాని జమాఅత్ ఎన్నికల ప్రక్రియలో చురుకుగా పాల్గొంటుందని అన్నారు. జమాఅత్ తరఫున ప్రజా మేనిఫెస్టోను ఆయన విడుదల చేశారు.

Related posts