కెనడా మునిసిపల్ ఎన్నికల్లో పలువురు ముస్లిమ్ అభ్యర్థులు

కెనడాలో మేయర్, సిటీ కౌన్సిలర్, స్కూల్ బోర్డ్ ట్రస్టీ పదవులకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇవి పార్టీలతో సంబంధం లేని ఎన్నికలు. ఈ ఎన్నికల్లో ముస్లిములు పెద్ద సంఖ్యలో పోటీ చేస్తున్నారు. దాదాపు 40 మంది ముస్లిం అభ్యర్థులు ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. అట్టావాలో అతీక్ కురేషీ సిటీ కౌన్సిలర్ గా పోటీ చేస్తున్నారు. ఒంటారియాలో మలీహా షాహిద్ అనే ముస్లిం మహిళ సిటీ కౌన్సీలర్ గా పోటీలో ఉన్నారు. కోక్విట్లామ్ లో మేయరు పదవికి పోటీ పడుతున్నారు ఆదిల్ గామర్. కెనడా జనాభాలో ముస్లిములు 3.2 శాతం ఉన్నారు.

Related posts