కాంగ్రెస్ అభ్యర్థులు కూడా ముస్లిం నాయకులను దూరంగా ఉంచుతున్నారా?

దేశంలో ముస్లిముల పట్ల ఎలాంటి వివక్ష నెలకొందో, ఎలాంటి మానసిక వేధింపులు కొనసాగుతున్నాయో కాంగ్రెస్ నాయకుడు గులాంనబీ ఆజాద్ ఆవేదన అద్దం పడుతుంది. తన పార్టీకే చెందిన హిందూ అభ్యర్థులు కూడా ఎన్నికల ప్రచారానికి తనను పిలవడం లేదని ఆయన వాపోయారు. అలీగఢ్ ముస్లిం యూనివర్శిటీ మాజీ విద్యార్థుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం భారతదేశంలో సమాజం రెండుగా చీలిపోయిందని, తనకు వ్యక్తిగతంగా కూడా వివక్ష అనుభవానికి వచ్చిందని చెప్పారు. ఈ విద్వేష రాజకీయాలకు నేను కూడా బాధితుడినే. 1857 తర్వాతి నాటి పరిస్థితి ఇప్పుడు ఉందని ఆయన అన్నారు. అప్పట్లో బ్రిటీషు వారు హిందూ ముస్లిములను విభజించారని చెప్పారు.

Related posts