ఇంగ్లండ్ కరెన్సీ నోటుపై నూర్ ఇనాయత్ ఖాన్ ఫోటో!

ఇంగ్లండ్ లో అతిపెద్ద కరెన్సీ నోట్ అయిన యాభై పౌండ్ల నోటుపై నూర్ ఇనాయత్ ఖాన్ చిత్రం ముద్రించాలని బ్రిటన్ ఆలోచిస్తుంది. ఒక ముస్లిం మహిళ చిత్రం బ్రిటన్ కరెన్సీపై కనిపించడం ఇదే మొదటిసారి అవుతుంది. 2020లో బ్రిటన్ జారీ చేయనున్న 50 పౌండ్ల ప్లాస్టిక్ నోటుపై రెండవ ప్రపంచయుద్ధం హీరోయిన్ గా పేరుపడిన నూర్ ఇనాయత్ ఖాన్ చిత్రం ముద్రించాలని ఆలోచిస్తున్నారు. భారత రాజకుటుంబానికి చెందిన తండ్రి, అమెరికన్ తల్లికి జన్మించిన నూర్ ఇనాయత్ రష్యాలో 1914లో పుట్టారు. ఆ తర్వాత ఫ్రాన్సుకు వెళ్ళారు. అక్కడి నుంచి 1940లో ప్రవేశించారు. బ్రిటన్ సైన్యంలో చేరిన నూర్ ఇనాయత్ ఎయిర్ ఫోర్సుకు శిక్షణ పొందారు. ఆ తర్వాత సీక్రెట్ ఏజంటుగా రిక్రూట్ అయ్యారు. 1943లో నాజీల ఆక్రమణలో ఉన్న ఫ్రాన్సులో పనిచేశారు. నాజీల నిర్బంధంలో పదినెలల పాటు చిత్రహింసలు భరించారు. బ్రిటిష్, అమెరికన్ పైలట్లను కాపాడ్డంలో ఆమె కీలకపాత్ర పోషించారు. బ్రిటిష్ రవాణా శాఖ మంత్రి నుస్రత్ ఘనీ ఈ వివరాలు తెలియజేశారు.

Related posts