అమెరికన్ టీవీలో కొత్త సంచలన హీరో – జకీ

CBS లో వస్తున్న FBI సీరిస్ లో స్పెషల్ ఏజంట్ ఆదం జిదాన్ పాత్ర పోషిస్తున్నాడు జీకో జకీ. వరల్డ్ ట్రేడ్ సెంటరు పై దాడి జరిగినప్పుడు ఆరవతరగతి చదువుతున్న జకీ అప్పుడు, ఆ తర్వాత ముస్లిములపై వివక్షను దగ్గరగా చూశారు. సినిమాల్లో, టీవీలో ముస్లిం టెర్రరిస్టుల కార్యక్రమాలు వెల్లువలా వచ్చాయి. సాధారణంగా అమెరికన్ సినిమాల్లో, టీవీల్లో శ్వేతజాతి అమెరికన్ హీరోగా ఉంటాడు. కాని ఆరడుగుల ఐదంగుళాల ఈ అరబ్ అమెరికన్ హీరోగా ఇప్పుడు కొత్త సీరియల్ వచ్చింది. మొదట ఒక లాటినో నటుడితో ఈ సీరియల్ చేయాలనుకున్నారు. కాని ఈజిప్టు సంతతికి చెందిన జకీ ప్రతిభను చూసిన తర్వాత స్క్రీప్టులోను మార్పులు చేసి మరీ అతణ్ణి తీసుకున్నారు. ముస్లిం పాత్రలు, ముస్లిం నటులు సినిమాల్లో, టీవీల్లో రావడం వల్ల ఇప్పుడున్న ఇస్లామోఫోబియా తగ్గవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Related posts