జమాఅతె ఇస్లామీ హింద్ షరతులతో కూడిన మద్దతు

గతంలో పనితీరు, భవిష్యత్తులో పరిపాలన పట్ల నిబద్దత ఆధారంగా మాత్రమే తాము మద్దతు ఇస్తామని జమాఅతె ఇస్లామీ హింద్ తెలంగాణా అండ్ ఒడిశా అధ్యక్షులు హామిద్ ముహమ్మద్ ఖాన్ అన్నారు. యువకులకు ఉద్యోగాలు, పంటలకు ఇన్సూరెన్స్, పోలీసు సంస్కరణలు, తెలంగాణా సంస్కృతికి పరిరక్షణ, మైనారిటీలకు సబ్ ప్లాన్, ముస్లిములకు జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లు, పౌరసదుపాయాలు కల్పించడం ప్రధాన డిమాండ్లుగా జమాఅత్ పేర్కొంది. 1994 తర్వాతి నుంచి పాలకపక్షాల పనితీరును జమాఅత్ సమీక్షిస్తోంది. సెక్యులర్ పార్టీల అభ్యర్థుల నిబద్దతపై కూడా పరిశీలిస్తోంది. ఈ పరిశీలన ప్రకారం ఒక నివేదిక రూపొందించి, కేంద్ర నాయకత్వానికి పంపిస్తారు. కేంద్ర నాయకత్వం ఎవరికి మద్దతివ్వాలన్నది ఈ రిపోర్టు ఆధారంగా నిర్ణయం తీసుకుంటుందని హామిద్ ముహమ్మద్ ఖాన్ అన్నారు. జమాఅత్ ఏ రాజకీయ పార్టీతోను ఎన్నికల వేదికలను పంచుకోవడం జరగదని, కాని జమాఅత్…

Read More

పాలస్తీనా దౌత్యకార్యాలయాన్ని మూసేసిన అమెరికా

పాలస్తీనాకు ఉద్దేశించిన దౌత్యకార్యాలయాన్ని అమెరికా మూసేసింది. ఇస్రాయీల్ లోని అమెరికా దౌత్యకార్యాలయంతో దాన్ని కలిపేసింది. ఇస్రాయీల్ లోని దౌత్యకార్యాలయంలో పాలస్తీనా వ్యవహారాల విభాగాన్ని ప్రారంభించింది. జెరుసలేంలో దౌత్యకార్యాలయం ప్రారంభించిన మొదటి దేశం అమెరికా. ఇస్రాయీల్, పాలస్తీనా రెండు దేశాలు జెరుసలేం తమ రాజధాని నగరంగా వాదిస్తున్నాయి. ఇస్రాయీల్ పక్షాన అమెరికా నిలబడింది. ఇప్పుడు పాలస్తీనాలో తమ దౌత్యకార్యాలయం మూసేసి ఇస్రాయీల్ దౌత్య కార్యాలయంతో కలిపిన నిర్ణయం పట్ల పాలస్తీనాలో తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది.

Read More

ఇంగ్లండ్ కరెన్సీ నోటుపై నూర్ ఇనాయత్ ఖాన్ ఫోటో!

ఇంగ్లండ్ లో అతిపెద్ద కరెన్సీ నోట్ అయిన యాభై పౌండ్ల నోటుపై నూర్ ఇనాయత్ ఖాన్ చిత్రం ముద్రించాలని బ్రిటన్ ఆలోచిస్తుంది. ఒక ముస్లిం మహిళ చిత్రం బ్రిటన్ కరెన్సీపై కనిపించడం ఇదే మొదటిసారి అవుతుంది. 2020లో బ్రిటన్ జారీ చేయనున్న 50 పౌండ్ల ప్లాస్టిక్ నోటుపై రెండవ ప్రపంచయుద్ధం హీరోయిన్ గా పేరుపడిన నూర్ ఇనాయత్ ఖాన్ చిత్రం ముద్రించాలని ఆలోచిస్తున్నారు. భారత రాజకుటుంబానికి చెందిన తండ్రి, అమెరికన్ తల్లికి జన్మించిన నూర్ ఇనాయత్ రష్యాలో 1914లో పుట్టారు. ఆ తర్వాత ఫ్రాన్సుకు వెళ్ళారు. అక్కడి నుంచి 1940లో ప్రవేశించారు. బ్రిటన్ సైన్యంలో చేరిన నూర్ ఇనాయత్ ఎయిర్ ఫోర్సుకు శిక్షణ పొందారు. ఆ తర్వాత సీక్రెట్ ఏజంటుగా రిక్రూట్ అయ్యారు. 1943లో నాజీల ఆక్రమణలో ఉన్న ఫ్రాన్సులో పనిచేశారు. నాజీల నిర్బంధంలో పదినెలల పాటు…

Read More

బ్రిటన్లో ముస్లింలు, యూదులపై దాడులు

బ్రిటన్ రాజకీయ నాయకుడు బోరిస్ జాన్సన్ ముస్లిం మహిళల హిజాబ్ గురించి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ ఆగస్ట్ 9వ తేదీన నిరసన ప్రదర్శనలు పెద్ద ఎత్తున జరిగాయి. ఇంగ్లాండులోను, వేల్స్ లోను మతపరమైన విద్వేషం, ముస్లిములపై దాడులు ఇటీవల పెరిగాయి. ఏప్రిల్ 2017 నుంచి మార్చి 2018 వరకు మతపరమైన దాడులు 8336 నేరాలు జరిగాయని పోలీసులు తెలిపారు. ముస్లిములుగా కనబడే వారిపైనే ఎక్కువగా ఇలాంటి దాడులు జరిగాయి. క్రయిం డాటాలో మతపరమైన విద్వేషంతో జరిగే దాడులను కూడా ప్రకటించడం ఇదే మొదటిసారి. ముస్లిం కౌన్సిల్ ఆఫ్ బ్రిటన్ ప్రధాన కార్యదర్శి హారూన్ ఖాన్ మాట్లాడుతూ ఇస్లామోఫోబియాను నివారించడానికి వెంటనే ప్రభుత్వం తగిన ప్రయత్నాలు చేయాలని అన్నారు. బ్రిటన్లో ముస్లిములపై ఎక్కువగా దాడులు జరుగుతుంటే, యూదులపై కూడా దాడులు కొనసాగుతున్నాయి. బ్రిటన్లో ముస్లిం జనాభా కేవలం 5…

Read More

కెనడా మునిసిపల్ ఎన్నికల్లో పలువురు ముస్లిమ్ అభ్యర్థులు

కెనడాలో మేయర్, సిటీ కౌన్సిలర్, స్కూల్ బోర్డ్ ట్రస్టీ పదవులకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇవి పార్టీలతో సంబంధం లేని ఎన్నికలు. ఈ ఎన్నికల్లో ముస్లిములు పెద్ద సంఖ్యలో పోటీ చేస్తున్నారు. దాదాపు 40 మంది ముస్లిం అభ్యర్థులు ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. అట్టావాలో అతీక్ కురేషీ సిటీ కౌన్సిలర్ గా పోటీ చేస్తున్నారు. ఒంటారియాలో మలీహా షాహిద్ అనే ముస్లిం మహిళ సిటీ కౌన్సీలర్ గా పోటీలో ఉన్నారు. కోక్విట్లామ్ లో మేయరు పదవికి పోటీ పడుతున్నారు ఆదిల్ గామర్. కెనడా జనాభాలో ముస్లిములు 3.2 శాతం ఉన్నారు.

Read More

అమెరికన్ టీవీలో కొత్త సంచలన హీరో – జకీ

CBS లో వస్తున్న FBI సీరిస్ లో స్పెషల్ ఏజంట్ ఆదం జిదాన్ పాత్ర పోషిస్తున్నాడు జీకో జకీ. వరల్డ్ ట్రేడ్ సెంటరు పై దాడి జరిగినప్పుడు ఆరవతరగతి చదువుతున్న జకీ అప్పుడు, ఆ తర్వాత ముస్లిములపై వివక్షను దగ్గరగా చూశారు. సినిమాల్లో, టీవీలో ముస్లిం టెర్రరిస్టుల కార్యక్రమాలు వెల్లువలా వచ్చాయి. సాధారణంగా అమెరికన్ సినిమాల్లో, టీవీల్లో శ్వేతజాతి అమెరికన్ హీరోగా ఉంటాడు. కాని ఆరడుగుల ఐదంగుళాల ఈ అరబ్ అమెరికన్ హీరోగా ఇప్పుడు కొత్త సీరియల్ వచ్చింది. మొదట ఒక లాటినో నటుడితో ఈ సీరియల్ చేయాలనుకున్నారు. కాని ఈజిప్టు సంతతికి చెందిన జకీ ప్రతిభను చూసిన తర్వాత స్క్రీప్టులోను మార్పులు చేసి మరీ అతణ్ణి తీసుకున్నారు. ముస్లిం పాత్రలు, ముస్లిం నటులు సినిమాల్లో, టీవీల్లో రావడం వల్ల ఇప్పుడున్న ఇస్లామోఫోబియా తగ్గవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Read More

ఎనిమిదేళ్ళ తర్వాత జరుగుతున్న అఫ్ఘానిస్తాన్ ఎన్నికలు

తాలిబన్ ప్రభుత్వం కూలిపోయిన 2001 తర్వాతి నుంచి ఇప్పటి వరకు రెండుసార్లు మాత్రమే అఫ్గనిస్తాన్ లో ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు మూడోసారి జరగబోతున్నాయి. 2015లో జరగవలసిన ఈ ఎన్నికలు వాయిదాలు పడి పడి చిట్టచివరికి ఇప్పుడు జరుగుతున్నాయి. తాలిబన్ సాయుధ దళాల దాడులు ఇంకా కొనసాగుతున్న అఫ్గనిస్తాన్ లో ఎన్నికలు శాంతియుతంగా నిర్వహించడానికి ప్రభుత్వం చాలా ప్రయత్నాలు చేస్తోంది. కాని “ఈ ఎన్నికలు బోగస్ ఎన్నికలని, జరగనీయమ”ని తాలిబాన్లు ప్రకటించారు. ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు దిగువసభకు జరిగే ఎన్నికలు. ఇందులో 250 స్థానాలున్నాయి. వాటిలో 10 స్థానాలు సంచారతెగలకు రిజర్వు చేశారు. ఒక స్థానం హిందువులకు, ఒక స్థానం సిక్కులకు రిజర్వు చేశారు. ఆఫ్ఘానిస్తాన్ లో సైతం మైనారిటీలకు మతపరమైన రిజర్వేషన్లు ఉండడం సంతోషించదగ్గ విషయం. మరో 68 స్థానాలు మహిళలకు రిజర్వు అయ్యాయి. మొత్తం 2565…

Read More

ముస్లిముల నిర్బంధాలపై చైనాను ప్రశ్నించిన మలేషియా

చైనాలోని ఉఘర్ ప్రాంతంలో ముస్లిముల నిర్బంధాలపై మలేషియా నాయకుడు అన్వర్ ఇబ్రాహీం చైనాను నిలదీశారు. ఉగర్ లో ముస్లిముల మతస్వేచ్ఛను చైనా గుర్తించాలని అన్నారు. జెరుసలేంకు దౌత్యకార్యాలయం మార్చాలని ఆస్ట్రేలియా ఇటీవల చేసిన ప్రకటనను కూడా ఆయన ఖండించారు. మయన్మార్ లో రోహింగ్యలకు మద్దతుగా అందరూ నిలబడాలని విజ్ఞప్తి చేశారు. చైనాలో ఉఘర్ ప్రాంతంలో ముస్లిములను సామూహికంగా నిర్బంధిస్తున్న వార్తలు ఖండించదగ్గవని, ఈ విషయమై ఇంతకుముందు కూడా చైనాకు తన అభిప్రాయాలు తెలియజేశానని ఆయన చెప్పారు. తాము ఎలాంటి హింసను సమర్థించేది లేదని, అది రాజ్య హింస కాని, లేదా వ్యక్తులు, గ్రూపులు  పాల్పడే హింసాకాండ అయినా గాని  అని చెప్పారు. త్వరలో చైనా సందర్శించనున్న అన్వర్ ఇబ్రాహీం తన పర్యటన సందర్భంగా ఈ అంశాన్ని లేవనెత్తుతానని అంటున్నారు.

Read More

భారత్ కు అవసరమైనంత చమురు ఇస్తామంటున్న సౌదీ

ఇరాన్ పై అమెరికా ఆంక్షల వల్ల భారత్ కు చమురు కొరత ఏర్పడకుండా అవసరమైనంత ముడి చమురు సరఫరా చేస్తామని సౌదీ ప్రభుత్వం భరోసా ఇచ్చింది. అయితే చెల్లింపుల విధానాన్ని సమీక్షించాలని ప్రధాని మోదీ చేసిన విజ్ఞప్తిపై సౌదీ అరేబియా నుంచి వ్యతిరేక స్పందన వచ్చింది. క్రూడాయిల్ ధరల నియంత్రణ తమ చేతుల్లో లేదని సౌదీ అరేబియా చమురు శాఖ మంత్రి ఖలీద్ ఏ అల్ ఫలీహ్ వ్యాఖ్యానించారు. ప్రపంచానికి చాలినంత క్రూడాయిల్ ఉత్పత్తిని కొనసాగించేందుకు అభ్యంతరం లేదని చెప్పిన ఆయన, ధరల విషయంలో మాత్రం తాము చేయగలిగిందేమీ లేదని, భారత విన్నపాన్ని మన్నించలేమని అన్నారు. తమబోటి వారిపై బయటి నుంచి ఎన్నో వత్తిళ్లు వస్తున్నాయని, తాము కావాలంటే సరఫరాను మాత్రం నియంత్రించగలమని తేల్చి చెప్పారు. కాగా, డాలర్‌ తో పోల్చితే రూపాయి మారకం విలువ రికార్డు…

Read More

UFC ఫైటర్ ఖబీబ్ కు కొత్త ఆఫర్ల వెల్లువ

UFC ఫైట్ క్లబ్బులో ఐరిష్ ఫైటర్ మెక్ గ్రెగర్ దూషణలకు, ప్రగల్భాలకు రింగులో జవాబిచ్చి ఓడించిన రష్యన్ ఫైటర్ ఖబీబ్ తన మతాన్ని నిందించిన మెక్ గ్రెగర్ టీము సభ్యులపై కూడా తర్వాత దాడికి దిగాడు. UF  దీనిపై ఖబీబ్ పైన, ఆయన టీములోని సభ్యులపైన చర్య తీసుకుంది. కాని వెంటనే అమెరికన్ రాపర్ 50సెంట్ ముందుకు వచ్చి UFC వైఖరిని తప్పు పడుతు ఖబీబ్ పట్ల అన్యాయంగా వ్యవహరంచారని, యుఎఫ్ సీ ఒప్పందాన్ని తెంచుకుని వస్తే తాము 2 మిలియన్ల కాంట్రాక్టు ఖబీబ్ తో చేసుకోడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది. తన సోదరుడిని UFC తొలగించేదయితే తాను కూడా UFC లో ఉండేది లేదని ఇంతకు ముందు ఖబీబ్ ప్రకటించాడు. వెంటనే ఆయనకు ఆఫర్లు రావడం మొదలైంది. UFC ఇప్పుడు కంగారు పడి ఖబీబ్ తో…

Read More