ప్రముఖ ముస్లిమ్ రచయిత హారూన్ యాహ్యా అరెస్ట్!

‘హారూన్ యాహ్యా’ అన్న కలంపేరుతో రచనలు చేసే టర్కీ ఇస్లామిక్ రచయిత అద్నాన్ ఒక్తార్ ను, అతని అనుచరులు 150 మందిని అరెస్టు టర్కీ పొలీసులు చేశారు. 90 వ దశకం నుండి రంగురంగుల పుస్తకాల ద్వారా ఇస్లామ్ గురించి, ఖుర్ ఆన్ లో సైన్స్ గురించి ఎన్నో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పుస్తకాలు రచించిన హారూన్ యాహ్యా తన స్వంత టివీ చానల్ కూడా నడుపుతున్నారు. ఈయన టాక్ షోలు కూడా నిర్వహిస్తూ ఉంటారు. ఈయనపై రకరకాల నేరారోపణలు ఉండడం వల్ల టర్కీ పొలీసులు ఈయనను అరెస్ట్ చేశారు. ఓక్తార్ తనపై వచ్చిన ఆరోపణలను తిరస్కరిస్తూ తాను చట్టవ్యతిరేకంగా ఏమీ చేయలేదని, నిజం న్యాయస్థానంలో తేలుతుందని పేర్కొన్నారు. 200 కు పైగా పుస్తకాలు రచించిన హారూన్ యాహ్యా డార్వినిజం అబద్ధమని, ప్రపంచంలోని ఎన్నో అనర్థాలకు నాస్తికత్వమే కారణమని పేర్కోవడం గమనార్హం. ఈయన పుస్తకాలు ఎన్నో భాషలలో లభిస్తాయి.

Related posts