హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ విద్యార్ధి ఎన్నికల్లో ‘లాల్-నీల్’ విజయభేరి

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ విద్యార్థి ఎన్నికల్లో హోరాహోరిగా పోటీ నడిచింది. వామపక్ష, దళిత, ముస్లిమ్ సమైక్యతతో ఏర్పడిన అలయెన్స్ ఆఫ్ సోషల్ జస్టిస్ తరఫున పోటీ చేసిన శ్రీరాగ్ ఘనవిజయం సాధించాడు. బారతీయ జనతాపార్టీకి అనుబంధ విద్యార్థి సంఘం ఏబివిపి అభ్యర్థి కే. పల్సానియా ఓడిపోక తప్పలేదు.

అలయెన్స్ ఆఫ్ సోషల్ జస్టిస్ లో వివిధ విద్యార్థి సంఘాలున్నాయి. స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్, దళిత్ స్టూడెంట్స్ యూనియన్, ట్రయిబల్ స్టూడెంట్స్ ఫోరమ్, తెలంగాణ విద్యార్థి వేదిక, ముస్లిమ్ స్టూడెంట్స్ ఫెడరేషన్ మాత్రమే కాక సారూప్య భావాలు కలిగిన అనేకమంది మద్దతిచ్చారు. ఈ గ్రూపులు రిసెర్చ్ స్కాలర్ రోహిత్ వేములకు మద్దతుగా నిలబడిన గ్రూపులు. ఎన్నికల్లో దాదాపు అన్ని పదవుల్లోను అలయెన్స్ ఘనవిజయం సాధించింది. జనరల్ సెక్రటరీగా అలయెన్స్ కు చెందిన ఆరిఫ్ అహ్మద్, జాయింట్ సెక్రటరీగా ముహమ్మద్ ఆషిక్, కల్చరల్ సెక్రటరీగా జి. అబిషేక్, స్పోర్ట్స్ సెక్రటరీగా శ్రవన్ కుమార్ గెలిచారు.  వైస్ ప్రెసిడెంట్ ఎన్నికలోను సమైక్య కూటమి విజయం సాధించినప్పటికీ సాంకేతిక కారణాల వల్ల ఫలితాలను విత్ హెల్డ్ చేశారు.

ఇంతకు ముందు ఢిల్లీలోని జవహర్ లాల్ విశ్వవిద్యాలయంలోను, హైదరాబాద్ లోని  English and Foreign Languages University లోను బిజేపి అనుబంధ సంస్థ ఏబివిపికి వరుస పరాజయాలు చవిచూడక తప్పలేదు.

Related posts