బాంబు ప్రేలుడు బాధితులకు ఉచితసేవలందించిన ముస్లిమ్ వైద్యునిపై దాడి

మాంచెస్టర్ బాంబు పేలుడు సంఘటనలో గాయపడిన వారికి స్వచ్చందంగా సేవలందించిన ముస్లిమ్ సర్జన్ పై దాడి జరిగింది. నాసర్ కుర్దీ బాంబుపేలుడు బాధితులకు సేవలందించిన వైద్యుడు. ఆయన నమాజుకు వెళుతుండగా వెనుక నుంచి వచ్చిన ముష్కరుడు మెడపై కత్తితో బలంగా పొడిచాడు. వెంటనే ఆయన్ను ఆయన ఆర్ధోపెడిక్ సర్జన్ గా పనిచేసే ఆసుపత్రికే తీసుకెళ్ళారు. ఈ సంఘటన తర్వాత ఆయన మాట్లాడుతూ దేవుడి దయవల్ల బతికాను. ఆ కత్తిపోటు ఒక రక్తనాళంపై పడి ఉండవచ్చు, మెడ అనేది తలకు, శరీరానికి మధ్య ఉండే సున్నితమైన భాగం, అయినా అదృష్టవశాత్తు కేవలం కండరాల్లోనే కత్తి గుచ్చుకుంది అన్నాడు. సిరియాకు చెందిన ఈ సర్జన్ మాట్లాడుతూ తనపై దాడి చేసిన వ్యక్తి పట్ల తనకు కోపం కాని, ద్వేషం కాని లేవని, తాను అతన్ని క్షమించేశానని చెప్పాడు. కాని ఉగ్రవాద సంఘటనల వల్ల ముస్లిములపై విద్వేష దాడులు పెరిగాయని అభిప్రాయపడ్డారు.

Related posts