మయన్మార్ పై మండిపడిన టర్కీ అధ్యక్షుడు ఎర్దోగాన్

మయన్మార్ సైన్యం రోహింగ్యా ముస్లిములపై టెర్రరిజానికి పాల్పడుతున్నాయని టర్కీ అధ్యక్షుడు ఎర్దోగాన్ తీవ్రంగా విమర్శించారు. మయన్మార్ సైనిక దళాల చర్యలను బౌద్ధ ఉగ్రవాదంగా ఆయన చెప్పారు. లక్షలాది రోహింగ్యాలు పొరుగున ఉన్న బంగ్లాదేశ్ కు శరణార్థులుగా చేరుకున్నారు. రాఖినే రాష్ట్రంలో రోహింగ్యాల జాతినిర్మూలనకు మయన్మార్ పాల్పడుతోందని ఆయన అన్నారు. ఇస్తాంబుల్ లో మాట్లాడుతూ ఎర్దోగాన్ ఈ విషయమై అంతర్జాతీయ సమాజం చేతులు ముడుచుకు కూర్చుందని తప్పుపట్టారు. మయన్మార్ నేత ఆంగ్ సాన్ సూకితో ఫోనులో మాట్లాడి సమస్య పరిష్కారానికి ఆయన ప్రయత్నించారు. బౌద్ధులు ఎల్లప్పుడు శాంతిప్రియులుగానే గుర్తింపు పొందినప్పటికీ ఇప్పుడు మయన్మార్ లో బౌద్ధ ఉగ్రవాదమే కనిపిస్తుందని అన్నారు.   రోహింగ్యాలను స్వదేశరహితులను చేసి వారిపై మయన్మార్ పాల్పడుతోందని ఐక్యరాజ్యసమితి కూడా అభిప్రాయపడింది. ఆంగ్ సన్ సూకీ చదువుకున్న ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయం ఆమె పెయింటింగ్ విశ్వవిద్యాలయం…

Read More

దాద్రి నిందితులందరికీ బెయిల్!

ఉత్తరప్రదేశ్ దాద్రీలో ఆఖ్లాఖ్ పై మత విద్వేష గూండాలు దాడి చేసి చంపిన దుర్ఘటన జరిగి రెండేళ్ళయ్యింది. ఈ సంఘటన జరిగింది 2015 సెప్టెంబరు 28న. ఆఖ్లాఖ్ ఇంట్లో గొడ్డుమాంసం తిన్నారని మత విద్వేష శక్తులు మైకులో చేసిన ప్రకటన తర్వాత ఈ హత్యాకాండ జరిగింది. ఆఖ్లాఖ్, అతని కుమారుడు దానిష్, ఆ కుటుంబంలోని మహిళలు అందరిపై గుంపు దాడి చేసింది. దాడిలో ఆఖ్లాఖ్ చనిపోయాడు. ఇంత దారుణానికి కారణమేమిటి? ఆఖ్లాఖ్ ఇంట ఉన్న మాంసం గొడ్డు మాంసం కాదని, అది మేకమాంసమని తర్వాత ఫోరెన్సిక్ విచారణలో తేలింది. కాని ఏడాది తర్వాత వచ్చిన మరో రిపోర్ట్ లో ఆ మాంసం గొడ్డుమాంసమేనని చెప్పారు. ఈ దుర్ఘటన జరిగిన వెంటనే వివిధ సెక్షన్ల క్రింద కేసులు నమోదయ్యాయి. పోలీసులు 20 మందిని అరెస్టు చేశారు. అందులో ఇద్దరు…

Read More

బాంబు ప్రేలుడు బాధితులకు ఉచితసేవలందించిన ముస్లిమ్ వైద్యునిపై దాడి

మాంచెస్టర్ బాంబు పేలుడు సంఘటనలో గాయపడిన వారికి స్వచ్చందంగా సేవలందించిన ముస్లిమ్ సర్జన్ పై దాడి జరిగింది. నాసర్ కుర్దీ బాంబుపేలుడు బాధితులకు సేవలందించిన వైద్యుడు. ఆయన నమాజుకు వెళుతుండగా వెనుక నుంచి వచ్చిన ముష్కరుడు మెడపై కత్తితో బలంగా పొడిచాడు. వెంటనే ఆయన్ను ఆయన ఆర్ధోపెడిక్ సర్జన్ గా పనిచేసే ఆసుపత్రికే తీసుకెళ్ళారు. ఈ సంఘటన తర్వాత ఆయన మాట్లాడుతూ దేవుడి దయవల్ల బతికాను. ఆ కత్తిపోటు ఒక రక్తనాళంపై పడి ఉండవచ్చు, మెడ అనేది తలకు, శరీరానికి మధ్య ఉండే సున్నితమైన భాగం, అయినా అదృష్టవశాత్తు కేవలం కండరాల్లోనే కత్తి గుచ్చుకుంది అన్నాడు. సిరియాకు చెందిన ఈ సర్జన్ మాట్లాడుతూ తనపై దాడి చేసిన వ్యక్తి పట్ల తనకు కోపం కాని, ద్వేషం కాని లేవని, తాను అతన్ని క్షమించేశానని చెప్పాడు. కాని ఉగ్రవాద…

Read More

టీచర్ల అవమానాలు తట్టుకోలేక ఆత్మహత్యకు ఒడిగట్టిన అర్ష్

కాన్పూర్ లోని ఢిల్లీ పబ్లిక్ స్కూలుకు చెందిన విద్యార్థి అర్ష్ ఆత్మహత్యా ప్రయత్నం చేశాడు. దానికి కారణం స్కూలు ప్రిన్సిపాలు, టీచర్లు. ముస్లిమ్ అయినందుకు ప్రతిరోజు అవమానపరుస్తూ, అనుమానిస్తూ, బ్యాగులు చెక్ చేస్తూ నరకం చూపించారీ ఉపాధ్యాయులు. దుర్బాషలాడ్డం, ఒంటరిగా ఉంచి శిక్షించడం జరిగేది. ఇతర విద్యార్థులెవ్వరూ తనతో మాట్లాడకుండా టీచర్లు అడ్డుకునేవారని, స్కూల్లో చేరి రెండు నెలలైనా టీచర్లు కట్టడి చేయడం వల్ల ఎవ్వరూ తనతో మాట్లాడేవారు కాదని ఆ అబ్బాయి తెలిపాడు. చివరకు అవమానాలు సహించలేక నిద్రమాత్రలు, ఫినైల్ తాగి ఆత్మహత్యా ప్రయత్నం చేశాడు. ఆ అబ్బాయి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

Read More

ఇరాన్ కు సన్నిహితమవుతున్న ఖతర్?

అరబ్బు దేశాలకు ఖతర్ కు మధ్య కొనసాగుతున్న ఉద్రికత్త కొత్త రూపు ధరిస్తోంది. ఇరాన్, టర్కీ దేశాలకు సన్నిహితంగా ఖతర్ మారుతోంది. దీనివల్ల మధ్యప్రాచ్య రాజకీయాల్లో పెనుమార్పులు రావచ్చు. సౌదీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఈజిప్ట్, బహ్రయీన్ తదితర అరబ్బు దేశాలు ఖతర్ తో దౌత్య సంబంధాలు తెంచుకున్నాయి. ఖతర్ ఉగ్రవాద సంస్థలకు సహాయపడుతుందన్నది ఆరోపణ. ముఖ్యంగా ముస్లిమ్ బ్రదర్ హుడ్ విషయమై ఈ దేశాలకు అభ్యంతరాలున్నాయి. ఖతర్ ఈ ఆరోపణలను బలంగా ఖండించింది. కాని ఖతర్ ఆహారపదార్థాలను ఈ దేశాల నుంచే దిగుమతి చేసుకోవాలి. ఈ సంక్షోభంలో ఖతర్ తనకు మద్దతిచ్చే మిత్రదేశాల కోసం చూస్తోంది. టర్కీ, ఇరాన్  దేశాలు అవసరమైన మద్దతు అందించడానికి సిద్ధంగా ఉన్నాయి. సమస్య పరిష్కారానికి టర్కీ సహాయం చేస్తానంది. అవసరమైన ఆహారపదార్థాలు అందించడానికి ఇరాన్ ముందుకు వచ్చింది.

Read More

ఇండోనేషియాలో అగ్నిపర్వత విస్ఫోటం

ఇండోనేషియాలోని బాలీలో ఉన్న అగ్నిపర్వతం మౌంట్ అగుంగ్ భయంకర రూపం ధరించింది. ఎప్పుడు పేలుతుందో తెలియని పరిస్థితి. దీనికి దగ్గరగా ఉత్తర సుమత్రాలో వున్న మరో అగ్నిపర్వతం మౌంట్ సినాబంగ్ అకస్మాత్తుగా మొన్న బద్దలైంది.  ఆకాశంలో 2.5 కి.మీ. ఎత్తు వరకు అగ్నిపర్వత బూడిద ఎగసిపడింది. దట్టమైన పొగలు క్రమ్ముకున్నాయి. వేలాది స్థానికులను అధికారులు తరలించారు. అగ్నిపర్వతానికి కనీసం 7 కి.మీ.దూరంలో ఉండాలని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. మౌంట్ సినాబంగ్ పేలడంతో ఇప్పుడు మౌంట్ అగుంగ్ కూడా బద్దలవుతుందని భయపడుతున్నారు. మౌంట్ అగుంగ్ 50 సంవత్సరాల క్రితం పేలింది. మౌంట్ అగుంగ్ పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న దాదాపు లక్షన్నర మంది ప్రజలను అధికారులు ఖాళీ చేయించారు.

Read More

పాకిస్తాన్ లో ముందస్తు ఎన్నికలకు డిమాండ్ చేసిన ఇమ్రాన్ ఖాన్

దేశంలో ముందస్తు ఎన్నికలు జరపాలని పాకిస్తాన్ తెహ్రీకె ఇన్సాఫ్ పార్టీ చైర్మన్ ఇమ్రాన్ ఖాన్ డిమాండ్ చేశారు. ఇస్లామాబాద్ లో ఒక సభలో మాట్లాడుతూ ఆయన ఈ డిమాండ్ చేశారు. ఢిల్లీ లోని కేజ్రీవాల్ ప్రభుత్వం మాదిరిగానే పాకిస్తాన్ లో ని ఖైబర్ పాఖ్తుం ఖ్వాన్ రాష్ట్రంలో ప్రజారంజకంగా పరిపాలించి మంచి పేరు సంపాదించిన ఇమ్రాన్ ఖాన్ పార్టీ సమరోత్సాహం తో ఉంది. కొత్త ప్రధాని షాహిద్ ఖాఖాన్ అబ్బాసీపై కూడా అవినీతి ఆరోపణలున్నాయని పేర్కొంటూ నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాకిస్తాన్ ముస్లిమ్ లీగ్ వల్ల పాకిస్తాన్ సైన్యానికి చెడ్డపేరు వస్తోందని ఆరోపించారు. దేశ ఆర్థిక వ్యవస్థ నాశనమవుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Read More

ట్రంప్ ను ఐసిస్ తో పోల్చిన లండన్ మేయర్ సాదిఖ్ ఖాన్

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఉగ్రవాద సంస్థ ఐయస్ఐయస్ వంటి భాష వాడుతున్నారని లండన్ మేయర్ సాదిక్ ఖాన్ విమర్శించారు. ముస్లిములు అమెరికాలో ప్రవేశించకుండా సరిహద్దులు పూర్తిగా మూసేయాలని డోనాల్డ్ ట్రంప్ అనడాన్ని ఉటంకిస్తూ లేబర్ పార్టీ కాన్ఫరెన్సులో సాదిక్ ఖాన్ ఈ మాటలు అన్నారు. అమెరికా అధ్యక్షుడితో ఈ విషయమై తనకు వాదన ఇష్టం లేదని సాదిఖ్ ఖాన్ అన్నారు. ముస్లిములు అమెరికాలో ప్రవేశించకుండా పూర్తిగా మూసేయాలని పిలుపునిచ్చిన డోనాల్డ్ ట్రంప్ లండన్ మేయరు సాదిక్ ఖాన్ అందుకు మినహాయింపని చెప్పడంతో మేయరు మరింత ఆగ్రహించారు. తాను మినహాయింపేమీ కాదని చెబుతూ, “ట్రంప్ ఏం మాట్లాడుతున్నారో కాస్త ఆలోచించుకోవాలని” అన్నారు. “ఎందుకంటే మీరు మాట్లాడుతున్నది ఐయస్ఐయస్ భాషలా ఉంది” అని వేలెత్తి చూపారు. పాశ్చాత్యులు ఇస్లామ్ ను ద్వేషిస్తారని ఐయస్ఐయస్ చెబుతుంది. అమెరికా అధ్యక్షుడిగా మీరు కూడా…

Read More

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ విద్యార్ధి ఎన్నికల్లో ‘లాల్-నీల్’ విజయభేరి

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ విద్యార్థి ఎన్నికల్లో హోరాహోరిగా పోటీ నడిచింది. వామపక్ష, దళిత, ముస్లిమ్ సమైక్యతతో ఏర్పడిన అలయెన్స్ ఆఫ్ సోషల్ జస్టిస్ తరఫున పోటీ చేసిన శ్రీరాగ్ ఘనవిజయం సాధించాడు. బారతీయ జనతాపార్టీకి అనుబంధ విద్యార్థి సంఘం ఏబివిపి అభ్యర్థి కే. పల్సానియా ఓడిపోక తప్పలేదు. అలయెన్స్ ఆఫ్ సోషల్ జస్టిస్ లో వివిధ విద్యార్థి సంఘాలున్నాయి. స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్, దళిత్ స్టూడెంట్స్ యూనియన్, ట్రయిబల్ స్టూడెంట్స్ ఫోరమ్, తెలంగాణ విద్యార్థి వేదిక, ముస్లిమ్ స్టూడెంట్స్ ఫెడరేషన్ మాత్రమే కాక సారూప్య భావాలు కలిగిన అనేకమంది మద్దతిచ్చారు. ఈ గ్రూపులు రిసెర్చ్ స్కాలర్ రోహిత్ వేములకు మద్దతుగా నిలబడిన గ్రూపులు. ఎన్నికల్లో దాదాపు అన్ని పదవుల్లోను అలయెన్స్ ఘనవిజయం సాధించింది. జనరల్ సెక్రటరీగా అలయెన్స్ కు చెందిన ఆరిఫ్…

Read More

ఒక్క ముస్లిమ్ సభ్యుడూ లేని తెదేపా పొలిట్ బ్యూరో

ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలుగుదేశం పోలిట్ బ్యూరో సభ్యుల పేర్లు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముస్లిములు దాదాపు పదిశాతం ఉన్నప్పటికీ ఒక్క ముస్లిమ్ పేరుకు  కూడా అందులో చోటు దక్కలేదు. చంద్రబాబునాయుడు మంత్రివర్గంలో కూడా ఒక్క ముస్లిమ్ పేరు కనబడదు. తెలుగుదేశానికి చెందిన ఒక నాయకుడు ఈ విషయమై మాట్లాడుతూ నంద్యాల ఎన్నికల్లో పార్టీకి ముస్లింలు పూర్తి మద్దతు ఇచ్చినా మరోసారి మోసపోయామని అన్నాడు. నిజానికి నంద్యాల ఎన్నికల వరకు చంద్రబాబునాయుడుకు ముస్లిములు అస్సలు గుర్తుకు రాలేదని, నంద్యాల ఎన్నికల కోసమే ఎన్ ఎం డీ ఫారూక్ ను శాసనమండలి ఛైర్మన్ గా నియమించారని, ఇచ్చిన ఒకట్రెండు పదవులు కూడా ముస్లిమ్ ఓట్ల కోసమే చేశారన్న ఆరోపణలు బలంగా వినిపించాయి. నంద్యాల ఎన్నికలు ముగియగానే మరిచిపోయారని, 2014 ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ కేవలం ఒకే ఒక్క…

Read More