ఇంగ్లండ్ ప్రధాని చర్చిల్ ఇస్లామ్ స్వీకరించాలనుకున్నారా…!?

లండన్ : రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటన్ దేశానికి ప్రధానమంత్రిగా పనిచేసిన సర్ విన్‌స్టన్ చర్చిల్ ఇస్లాం స్వీకరించాలనుకున్నారా…అవునని తాజాగా వెలుగుచూసిన లేఖ ఈ విషయాన్ని బహిర్గతం చేసింది.

సర్ విన్‌స్టన్ చర్చిల్ తాను ఇస్లాం మతాన్ని స్వీకరించాలనే కోరికను వ్యక్తం చేయగా దాన్ని అతని కుటుంబం వ్యతిరేకించిందని తాజాగా వెల్లడైన లేఖతో తేలింది. బ్రిటిష్ సామ్రాజ్య ప్రధాన రక్షకుడైన ప్రధాన మంత్రి సర్ విన్‌స్టన్ చర్చిల్ ఇస్లాం మతాన్నివిపరీతంగా అభిమానించే వాడని వెల్లడైంది. రెండవ ప్రపంచ యుద్ధంలో  బ్రిటన్ దేశాన్ని విజయం వైపు నడిపించిన ప్రధాన మంత్రి ఇస్లాం మతమంటే తనకిష్టమని చెప్పి అందులోకి మారేందుకు చేసిన యత్నాన్ని అతని కుటుంబం నచ్చజెప్పి మతం మారకుండా అడ్డుకుందని సమాచారం. ‘‘నేను మీలో ఇస్లాంపై మీలో ఉన్న ధోరణిని గమనించానని… దయచేసి మీరు ఇస్లాం మతంలోకి  మారకండి..’’అంటూ 1907 వ సంవత్సరం ఆగస్టు నాడు చర్చిల్ కు అతని సోదరి రాసిన లేఖలో కోరారు. ‘‘మీరు ఇస్లాం మతం స్వీకరించి ఉంటే మీలో పరివర్తన వస్తుందని, దాని ప్రభావం వల్ల పోరాటం జరపలేరని’’చర్చిల్ సోదరి పేర్కొంది. చర్చిల్ సోదరుడైన జాక్ ను పెళ్లాడిన లేడీ గ్వాండోలిన్ రాసిన లేఖను కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం పరిశోధక విద్యార్థి వారెన్ డాకెట్ పరిశోధనలో వెలుగుచూసింది.

ఇస్లామిక్ సంస్కృతిపై  విక్టోరియన్లలో సాధారణంగా ఉన్న అభిమానం చర్చిల్ లో ఉండేదని వారెన్ డాక్టేర్ చెప్పారు. తాను బ్రిటన్ ఆర్మీ అధికారిగా సూడాన్ దేశంలో పనిచేసినపుడు తనకు ఇస్లామిక్ సమాజం గురించి పరిశీలించే అవకాశం లభించిందని లేడీ లిట్టన్ కు చర్చిల్ రాసిన లేఖలో పేర్కొన్నారు. చర్చిల్ వ్యక్తిగతంగా అరబ్ దుస్తులు ధరించటానికి ఇష్టపడేవాడని తేలింది. 1940వ సంవత్సరంలో జర్మన్ నాజీ సైనికులపై చర్చిల్ ముస్లిమ్ దేశాల మద్ధతుతో విజయం సాధించినపుడు రీజెంట్స్ పార్కులో లండన్ సెంట్రల్ మస్జిద్ నిర్మాణానికి చర్చిల్ అనుమతిస్తూ భూమి కేటాయించారు. తాను మస్జీద్ నిర్మాణానికి ఇచ్చిన భూమి బహుమతిని ముస్లిమ్ దేశాల స్నేహితులు అభినందించారని చర్చిల్ హౌస్ ఆఫ్ కామన్స్ లో పేర్కొన్నాడు.

Related posts