లండన్ : రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటన్ దేశానికి ప్రధానమంత్రిగా పనిచేసిన సర్ విన్స్టన్ చర్చిల్ ఇస్లాం స్వీకరించాలనుకున్నారా…అవునని తాజాగా వెలుగుచూసిన లేఖ ఈ విషయాన్ని బహిర్గతం చేసింది. సర్ విన్స్టన్ చర్చిల్ తాను ఇస్లాం మతాన్ని స్వీకరించాలనే కోరికను వ్యక్తం చేయగా దాన్ని అతని కుటుంబం వ్యతిరేకించిందని తాజాగా వెల్లడైన లేఖతో తేలింది. బ్రిటిష్ సామ్రాజ్య ప్రధాన రక్షకుడైన ప్రధాన మంత్రి సర్ విన్స్టన్ చర్చిల్ ఇస్లాం మతాన్నివిపరీతంగా అభిమానించే వాడని వెల్లడైంది. రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటన్ దేశాన్ని విజయం వైపు నడిపించిన ప్రధాన మంత్రి ఇస్లాం మతమంటే తనకిష్టమని చెప్పి అందులోకి మారేందుకు చేసిన యత్నాన్ని అతని కుటుంబం నచ్చజెప్పి మతం మారకుండా అడ్డుకుందని సమాచారం. ‘‘నేను మీలో ఇస్లాంపై మీలో ఉన్న ధోరణిని గమనించానని… దయచేసి మీరు ఇస్లాం మతంలోకి మారకండి..’’అంటూ…
Read More