పిండిమిల్లుకు వచ్చినందుకు దళితుడి తల నరికిన వర్ణాహంకారి

ఉత్తరాఖండ్ : తనను ప్రశ్నించాడనే కోపంతో ఓ దళితుడి తలను నరికిన ఘటన ఉత్తరాఖండ్ రాష్ట్రంలో జరిగింది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని కదారియా గ్రామానికి చెందిన సోహన్ రామ్ అనే దళిత వ్యక్తి గోధుమ పిండి పట్టించుకునేందుకు పిండిమిల్లుకు వచ్చాడు. ఇదే సమయంలో స్కూల్లో ఉపాధ్యాయుడిగా పని చేసే లలిత్ కర్నాటక్ అనే వ్యక్తి కూడా వచ్చాడు. దళితుడైన సోహన్ పిండి ఆడించుకునేందుకు అక్కడికి రావడంవల్ల ఆ ప్రదేశం మొత్తం అపవిత్రం అయిందని, కులం తక్కువవాడిని ఎందుకు రానిస్తారంటూ లలిత్ వ్యాఖ్యలు చేశాడు.దీంతో, అవమానానికి గురైన సోహన్ ‘ఎందుకలా నోరు పారేసుకుంటారు?’ అని ప్రశ్నించాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన లలిత్ అక్కడే ఉన్న పెద్ద కొడవలితో అతని మెడపై ఒక్క వేటు వేశాడు. అంతటితో ఆగని లలిత్…అదే ఆవేశంతో…సోహన్ తలను మొండెం నుంచి వేరు చేశాడు. దీంతో ఆ గ్రామంలో దళితులు ఆందోళన చేపట్టారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు లలిత్ ను రిమాండ్ కు తరలించారు.

Related posts